
న్యూఢిల్లీ: చిన్నచిన్న సమస్యలే కొన్నసార్లు విపరీతానికి దారి తీస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో నీటి కుళాయి దగ్గర గొడవ ఓ మనిషి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నజఫ్‌ఘర్‌లోని జల విహార్ ప్రాంతానికి చెందిన జితేంద్ర నీళ్లు పట్టేందుకు కుళాయి దగ్గరకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అమిత్ రావత్‌తోపాటు మరో వ్యక్తి జితేంద్రతో గొడవకు దిగారు. జితేంద్రపై దాడి చేస్తూ రక్తం చిందేలా చితకబాదారు. (‘బాబోయ్..నా భార్య నుంచి కాపాడండి’)
ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు వెంటనే కుళాయి దగ్గరకు వెళ్లి గాయాలపాలైన జితేంద్రను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరోవైపు అమిత్ రావత్, అతని తల్లితో కలిసి బాధితుడి కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగాడు. దీంతో జితేంద్ర సోదరుడు అనిల్ సింగ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అనంతరం తిరిగి ఆసుపత్రికి చేరుకునేసరికి జితేంద్ర ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు అమిత్ రావత్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. (తీవ్ర గాయాలు.. గంటల వ్యవధిలోనే మృతి)
Comments
Please login to add a commentAdd a comment