నా జీతం 7కోట్లు.. ఏం చేసుకోను.. నా భార్య విడాకులు అడుగుతోంది! | Techie Who Bagged Rs 7 Crore Promotion,But Now His Wife Wants a Divorce | Sakshi
Sakshi News home page

నా జీతం 7కోట్లు.. ఏం చేసుకోను.. నా భార్య విడాకులు అడుగుతోంది!.. ఐటీ ఉద్యోగి ఆవేదన

Published Fri, Feb 14 2025 1:58 PM | Last Updated on Fri, Feb 14 2025 3:56 PM

Techie Who Bagged Rs 7 Crore Promotion,But Now His Wife Wants a Divorce

మీరు చెప్పినట్లేగానే నేను వారానికి 70గంటలకు పైగా పనిచేశా. చివరికి నాకు మిగిలిందేంటి?  నా భార్య విడాకులు ఇవ్వమని అంటోంది. ఇప్పుడేం ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ ఓ టెక్కీ సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల, ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే భారత్‌లోని యువత వారానికి 70గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సూచించారు. అయితే, నారాయణ మూర్తికి సూచనకు పలువురు మద్దతు పలికితే.. మరికొందరు విమర్శించారు. ప్రముఖ సంస్థ లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ మరో అడుగు ముందుకేసి వారానికి 90 గంటలు పనిచేయండి. ఎంత కాలం భార్యలను చూస్తూ కూర్చుంటారు? అని ప్రశ్నించారు. అలా మీరు చెప్పినట్లు చేస్తే అందరికి నాకు పట్టిన గతే పడుతోంది. మీరు చెప్పినట్లుగా చేసినందుకే నా భార్య నన్ను విడాకులు కోరుతోంది’అని ఓ టెక్కీ పరోక్షంగా  సోషల్‌ మీడియా వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.

ప్రస్తుతం, ఈ ఘటన సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. ప్రముఖలు చెప్పినట్లుగా పనిచేసే తమ భవిష్యత్‌ ఇలాగే ఉంటుందేమోనంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

పేరు ప్రస్తావించని టెక్కీ.. అధిక పనిగంటల కారణంగా తన జీవితంలో ఎదురైన సంఘటనను ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ బ్లిండ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. ఆ పోస్టులో ‘నేను ఐటీ రంగంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని కలలు కన్నా. కలల్ని సాకారం చేసుకునే ప్రయత్నంలో మూడేళ్లలు అహర్నిశలు కష్టపడి పనిచేశా. ప్రమోషన్‌ కోసం జూనియర్‌ నుంచి సీనియర్‌ స్థాయికి చేరుకున్నాను.

 జీతం, ప్రమోషన్‌ పెరిగే కొద్ది పనికూడా పెరిగింది. ఎంతలా అంటే నా విధుల్లో భాగంగా యురోపియన్‌ యూనియన్‌ దేశాలతో పాటు ఆసియా దేశాల ఉద్యోగుల్ని సమన్వయం చేసుకోవాల్సి వచ్చేంది. ఫలితంగా, ఆఫీస్‌ మీటింగ్స్‌ సైతం ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగిసేవి. అది చాలదన్నట్లు  కొన్ని సార్లు రోజుకు 14 గంటలు కంప్యూటర్‌తో కుస్తీ పడేవాడిని. ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది. మూడేళ్లకే సీనియర్‌ మేనేజర్‌గా ప్రమోషన్‌తో పాటు ఏడాదికి రూ.7.8 కోట్ల జీతం కూడా తీసుకున్నాను.

కానీ ఏం లాభం ఇప్పుడు నా భార్య నాకు విడాకులు కావాలని అడుగుతోంది. అందుకు కారణం నేనే. ఆఫీస్‌ వర్క్‌ కారణంగా నా భార్య డెలివరీ సమయంలో అందుబాటులో లేకపోయాను. డెలివరీ తర్వాత తనతో గడిపానా అంటే అదీలేదు. తోడు లేక, నా కూతురు పుట్టిన రోజులకు అటెండ్‌ కాలేకపోయాను. పాపం నా భార్య డిప్రెషన్‌కు గురైంది. డిప్రెషన్‌ ఎక్కువైంది. డాక్టర్‌కు  చూపించుకోవాలని అడిగేది. అది సాధ్యమయ్యేది కాదు. చివరికి ఈ బాధల్ని తట్టుకోలేక నా భార్య విడాకులు ఇవ్వమని అడిగింది. ఇప్పుడు నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

"నా జీవితంలో నేను ఏమి చేస్తున్నానో, ఏ కోల్పోయానోనని నన్ను నేను ప్రశ్నించుకోకుండా ఉండలేకపోతున్నాను. కానీ ఈ లేఆఫ్ తుఫాన్ యుగంలో నా దగ్గర ఉన్నదానితో నేను సంతోషంగా ఉండాలి కదా? కానీ సంతోషంగా ఎలా ఉండాలి?’ అని ప్రశ్నిస్తూ తన పోస్ట్‌కు ముగింపు పలికాడు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement