బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్‌కు కమలం పేరుతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోందని సీఎం సిద్ధరామయ్య ఆరోపణలు చేశారు. సిద్ధరామయ్య ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
‘గత ఏడాది నుంచి బీజేపీ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడుగొట్టాలని చూస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ కమలం చేపట్టింది. మా ఎమ్మెల్యేలకు రూ. 50 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ, బీజేపీ వారి ప్రయత్నం వృథా అయింది’ అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థానాలు గెలువకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘మా ప్రభుత్వానికి ఏం కాదు. మా ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా పార్టీ మారరు. కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీని వీడరు. నా నాయకత్వంలోనే ఐదేళ్ల పాటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కొనసాగుతుంది’ అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
మరోవైపు.. సీఎం సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను బీజేపీ ఎంపీ ఎస్ ప్రకాశ్ తీవ్రంగా ఖండించారు. ‘సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. ఆయన పలుమార్లు ఇటువంటి ఆరోపణలు చేస్తునే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఒక వర్గం మద్దతు కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన పనులు, కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయలు చెప్పటం వదిలేసి.. బీజేపీపై నకిలీ ఆరోపణల చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు బదలు.. ఎన్నికల తర్వాత సీఎం కుర్చి కోసమే ఆలోచిస్తున్నారు’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment