బాదుడుండదు! | state budget | Sakshi
Sakshi News home page

బాదుడుండదు!

Published Fri, Feb 14 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM

state budget

  • నేడు రాష్ట్ర బడ్జెట్
  •  పథకాలకు స్వల్ప మార్పులు.. మరిన్ని మెరుగులు
  •  పీయూసీ విద్యార్థులకు లాప్‌టాప్‌లు
  •  ఏపీఎల్ కార్డుదారులకు తక్కువ ధరకు రేషన్  
  •  విధాన సౌధలో తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సిద్ధు
  •  అరుదైన ఘనత దక్కించుకోనున్న సీఎం
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాసన సభలో శుక్రవారం 2014-15 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఆర్థిక శాఖను ఆయనే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొమ్మిదో సారి ఆయన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నందున, ఆ ఖ్యాతి రాష్ట్రంలో తొలిసారిగా ఆయనకు దక్కనుంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున, ముఖ్యమంత్రి పలు వరాలు కురిపిస్తారనే అంచనాలున్నాయి.

    50 కొత్త తాలూకాల ఏర్పాటు, ప్రతి తాలూకాలో ప్రాథమిక సదుపాయాల కల్పనకు తలా రూ.5 కోట్లు, వ్యవసాయానికి వడ్డీ రహిత రుణాల గరిష్ట మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంపు లాంటి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. పేద కుటుంబాల్లో జన్మించిన ఆడ పిల్లల కోసం అమలవుతున్న భాగ్యలక్ష్మిలో కొన్ని మార్పులు చేయాలని కూడా సంకల్పిస్తోంది.  పీయూసీ విద్యార్థులకు లాప్‌టాప్‌లు, ఏపీఎల్ కార్డుదారులకు తక్కువ ధరకు రేషన్ లాంటి వ రాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో కొత్త పన్నులు విధించడానికి ముఖ్యమంత్రి సాహసించబోరని వినవస్తోంది.
     
    బీబీఎంపీ విభజన
     
    బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ)ను రెండుగా విభజించాలనే ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. బడ్జెట్‌లో దీనిపై ప్రకటన చేస్తానని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. పాలనా సౌలభ్యం దృష్ట్యా బీబీఎంపీని విభజించాలని ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement