సాక్షి, హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నేటి నుంచి సీఎం కేసీఆర్.. మళ్లీ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగా మొదట కేరళ సీఎం పినరయి విజయన్‌తో సంప్రదింపులు జరుపనున్నారు. అటుపై ఈ నెల 13న డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాజకీయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సీఎం కుమారస్వామితో సోమవారం ఉదయం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. నీరు విడుదల చేసినందుకు కుమారస్వామికి కృతజ‍్క్షతలు తెలిపారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment