
సాక్షి, బెంగళూరు: ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం అంబరీష్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారా? అంని సీఎం కుమారస్వామి సుమలత ప్రశ్నించారు. మండ్య జిల్లాలో సుమలతా మీడియాతో మాట్లాడుతూ అంబరీష్ పేరును ఉపయోగించుకున్న వారు ఎవరు, ఇప్పుడు ఆయనకు విరుద్ధంగా మాట్లాడేవారు ఎవరనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అంబరీష్ గురించి ఏమీ మాట్లాడనని రెండు రోజుల క్రితం చెప్పిన సీఎం అప్పుడే మాట తప్పారని విమర్శించారు, అంబరీష్‌కు ఏం చేశారో మాట్లాడుతున్న సీఎం, మండ్య ప్రజలకు ఏమీ చేశారో కూడా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.