
యశవంతపుర : చిక్కమగళూరు జిల్లా మూడిగెరె బీజేపీ అభ్యర్థి ఎంపీ కుమారస్వామి ఒక మహిళలకు వాట్సప్‌లో అశ్లీల సందేశం ఉన్న విడియో పంపినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇది నియోజకవర్గంలో పెద్ద వివాదంగా మారింది. బీజేపీ నాయకులు తలదించుకునేలా చేసింది. గతంలో కూడా ఆడియో వైరల్ అయింది.
స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలకు సమాధానం చెప్పలేక పోయారు. ఎన్నికల సమయం అశ్లీల విడియో వైరల్ కావటంతో బీజేపీ నాయకులు ప్రచారం చేయని స్థితి నెలకొంది. అయితే ఎవరో గిట్టనివారు నకిలీ స్క్రీన్‌షాŠట్ వైరల్ చేసినట్లు కుమారస్వామి మంగళవారం పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. నకలీ స్క్రీన్‌షాట్లను వైరల్ చేసి నియోజకవర్గంలో తన గౌరవ, మర్యాదలను కించపరుస్తున్నట్లు చిక్కమగళూరు ఎస్పీ అణ్ణామలై, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.