obscene messages
-
అసభ్యకర మెసేజ్‌లతో నటికి వేధింపులు.. సహజీవనం చేయాలని ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా అసభ్య మెసేజ్ పంపతూ.. తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ నటి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. అమీర్‌పేట, నాగార్జునానగర్ కాలనీలో ఉంటున్న నటి (42) కు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రవీణ్ పదిహేనేళ్లుగా పరిచయం. ప్రవీణ్ భవనాలు నిర్మించే బిల్డర్. 8 ఏళ్ల క్రితం ఆమె వద్ద రూ. 47 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. బాధితురాలు అపార్ట్మెంట్లో ఉండే మరో మహిళ వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకుని ప్రవీణ్‌కు ఇచ్చింది. తన డబ్బులు తనకు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమ పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, ప్రాణాలతో బయటపడిన చిన్నారి -
Hyderabad: యువతిపై ప్రేమ.. అప్పటికే పెళ్లి నిశ్చయమైందని తెలిసి..
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఇన్‌స్ట్రాగామ్ సృష్టించి ఓ యువతి కుటుంబసభ్యులకు, ఆమెకు కాబోయే భర్తకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... వికారాబాద్ జిల్లాకు చెందిన జాతావత్ సిద్ధూ (22) ప్రైవేట్ ఉద్యోగి. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ఇష్టపడ్డాడు. అయితే, అప్పటికే ఆమెకు పెళ్లి నిశ్ఛయమైంది. దీంతో ఆమెపై పగ పెంచుకున్న సిద్ధూ నకిలీ ఇన్‌స్ట్రాగామ్ సృష్టించి యువతి కుటుంబ సభ్యులకు అనేక ఫోన్ నంబర్ల నుంచి అసభ్యకరమైన సందేశాలు పంపాడు. యువతి పెళ్లి ఆగిపోవాలని, అప్పుడు ఆమెను తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన కుటుంబసభ్యులకు తరచూ అసభ్యకర మెసేజ్‌లు రావడంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
దేవుడి హుండీల్లో అశ్లీల చీటీలు, కండోమ్‌లు..
యశవంతపుర: ఆలయాల్లోని హుండీల్లోకి అశ్లీల సందేశాలు రాసిన చీటీలు,కండోమ్స్ వేసిన మంగళూరులోని జొకట్టి నివాసి అబ్దుల్‌రహీం, అబ్దుల్ తౌఫీక్ అనే నిందితులను మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బుధవారం ఎమ్మెకెరె కొరగజ్జ ఆలయంలో ఉండగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. నిందితులు మూడు నెలలుగా పాండేశ్వర, కద్రి, ఉళ్లాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలయాల్లో ఆకతాయి చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. -
అసభ్య మెసేజ్‌లు పంపి పెళ్లి చెడగొట్టే యత్నం..
సాక్షి, సిటీబ్యూరో: వివాహం నిశ్చయమైన అమ్మాయికి, ఆమె కుటుంబ సభ్యులకు అసభ్యకరమైన మేసేజ్‌లు పంపుతూ పెళ్లి చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న యువకుడిని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బేగంబజార్‌కు చెందిన బాధితురాలికి ఇటీవల పెళ్లి కుదిరింది. అయితే ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు ఇటీవల అసభ్యకరమైన మేసేజ్‌లు వస్తున్నాయి. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు బేగంబజార్‌లో కిరాణ దుకాణం నిర్వహించే వివేక్‌గా గుర్తించారు. బుధవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు, బాధితురాలికి బంధువని తేలింది. -
ప్రొఫెసర్‌కు దిమ్మతిరిగేలా బుద్ది చెప్పారు
-
కీచక ప్రొఫెసర్ పీచమణిచారు
పాటియాలా: విద్యార్థినుల ఫోన్లకు అసభ్యకరమైన సందేశాల పంపిన ఓ ప్రొఫెసర్‌కు దిమ్మతిరిగేలా బుద్ది చెప్పారు యూనివర్సిటీ అమ్మాయిలు. ప్రొఫెసర్ని కాలేజీ నుంచి బయటకు లాక్కెళ్లి చితక్కొట్టారు. ఈ ఘటన పంజాబ్‌లోని పాటియాలా ప్రభుత్వ బాలికల కళాశాలలో జరిగింది. పాటియాలాలోని ప్రభుత్వ కాలేజీకి చెందిన ఓ ప్రొఫెసర్ అదే కాలేజీలో చదువుతున్న కొంతమంది అమ్మాయిలకు అసభ్యకరమైన సందేశాలు పంపాడు. దీంతో కోపోద్రిక్తులైన అమ్మాయిలు ఆ ప్రొఫెసర్‌పై దాడి చేశారు. కళాశాల నుంచి అతడిని బయటకు లాక్కొచ్చి చితక్కొట్టారు. ఇదంతా ఓ విద్యార్థిని వీడియో తీసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. కాగా ఆ ప్రొఫెసర్ పేరు ఇంత వరకూ బయటకు వెల్లడించలేదు. బాధితులు పోలీసులను సంప్రదించారో లేదో స్పష్టత లేదు. ఎనిమిది మంది జేఎన్‌యూ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ప్రొఫెసర్ అతుల్ జోహారీ ఉదంతం మర్చిపోకముందే కళాశాలల్లో ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం. -
స్టూడెంట్స్‌కు అసభ్యకర మెసెజ్‌లు..!
సాక్షి, క్రైమ్ : మైనర్ స్టూడెంట్స్‌కు అసభ్యకరమైన మెసెజ్‌లు పంపినందుకు టీచర్లను సస్పెండ్ చేసిన ఘటన జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. కుప్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న స్టూడెంట్స్‌కు ఉపాధ్యాయులు అసభ్యకరమైన సందేశాలను ఫోన్ ద్వారా పంపించారు. ఇది తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధాన విద్యాధికారి మహ్మద్ షఫీకి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ ఉపాధ్యాయులిద్దరినీ సస్పెండ్ చేశారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అంతర్గత విచారణ కోసం ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని కూడా నియమించింది. పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించి, కేసు నమోదు చేసుకుని, ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారణను వేగవంతం చేయనున్నట్లు హంద్వారా సీనియర్ పోలీస్అధికారి జీలాని వనీ తెలిపారు. ఎనిమిది రోజుల క్రితమే ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. పదకొండో తరగతి చదువుతున్న ఓ బాలికను, ఉపాధ్యాయుడు అత్యాచారం చేసి, అబార్షన్ చేయించడం కోసం ప్రయత్నించగా పట్టుబడ్డాడు. -
బీజేపీ అభ్యర్థి అశ్లీల సందేశం ?
యశవంతపుర : చిక్కమగళూరు జిల్లా మూడిగెరె బీజేపీ అభ్యర్థి ఎంపీ కుమారస్వామి ఒక మహిళలకు వాట్సప్‌లో అశ్లీల సందేశం ఉన్న విడియో పంపినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇది నియోజకవర్గంలో పెద్ద వివాదంగా మారింది. బీజేపీ నాయకులు తలదించుకునేలా చేసింది. గతంలో కూడా ఆడియో వైరల్ అయింది. స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలకు సమాధానం చెప్పలేక పోయారు. ఎన్నికల సమయం అశ్లీల విడియో వైరల్ కావటంతో బీజేపీ నాయకులు ప్రచారం చేయని స్థితి నెలకొంది. అయితే ఎవరో గిట్టనివారు నకిలీ స్క్రీన్షాŠట్ వైరల్ చేసినట్లు కుమారస్వామి మంగళవారం పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. నకలీ స్క్రీన్షాట్లను వైరల్ చేసి నియోజకవర్గంలో తన గౌరవ, మర్యాదలను కించపరుస్తున్నట్లు చిక్కమగళూరు ఎస్పీ అణ్ణామలై, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. -
బాలీవుడ్ నటికి, బీజేపీ నాయకురాలికి వేధింపులు
ముంబై: ఇద్దరు ప్రముఖ మహిళలకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. వారిలో ఒకరు బాలీవుడ్ నటి కాగా.. మరొకరు బీజేపీలో ప్రముఖ నాయకురాలు. కొంతకాలంగా వేధింపులను భరిస్తూ వచ్చిన వాళ్లిద్దరూ చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాలీవుడ్లో అలనాటి కలల రాణి సోనూ వాలియాను గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లో వేధిస్తున్నాడు. దీనిపై ఆమె ముంబైలోని బంగూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఐపీసీ సెక్షన్ 354 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఖూన్ భరీ మాంగ్ లాంటి చిత్రాల్లో హాట్‌గా నటించిన సోను వాలియా (53), ఇప్పుడు ముంబైలోని మలాడ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అతడు తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటంతో పాటు అసభ్య వీడియోలు కూడా పంపుతున్నాడని వాలియా తెలిపారు. దాదాపు వారం రోజుల నుంచి కొనసాగుతున్న ఈ వేధింపులు ఏమాత్రం తగ్గకపోవడంతో ఇక పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు. అతడిని తాను హెచ్చరించినా ఫలితం కనిపించలేదని, పైపెచ్చు అసభ్య ఫోన్ కాల్స్ మరింత పెరిగాయని అన్నారు. ఒక్కోసారి ఒక్కో నెంబరు నుంచి అతడు ఫోన్ చేస్తున్నాడని, అవేవీ ఇప్పుడు పనిచేయడం లేదని ఇన్స్పెక్టర్ శిరీష్ గైక్వాడ్ తెలిపారు. బీజేపీ నాయకురాలికి కూడా... ముంబై నగరానికే చెందిన ప్రముఖ బీజేపీ నాయకురాలు షైనా ఎన్సీకి కూడా వేధింపులు తప్పలేదు. తనకు ఒక వ్యక్త అసభ్యకరమైన సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడని ఆమె పోలీసులను ఆశ్రయించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కూడా అయిన షైనా.. తనకు గత డిసెంబర్ నెల నుంచి ఆ వ్యక్తి వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా అసభ్య సందేశాలు పంపుతున్నాడని, అతడి వేధింపులు భరించలేక చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ముంబై బీకేసీలోని సైబర్ క్రైం విభాగంలో ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. బీఎంసీ ఎన్నికల ప్రచారంలో బాగా బిజీగా ఉండటంతో ఇన్నాళ్ల పాటు పోలీసుల వద్దకు వెళ్లలేదన్నారు. -
మహిళా లెక్చరర్లకు అశ్లీల మెసేజ్‌లు..అరెస్ట్
బెంగళూరు : మహిళా లెక్చరర్లకు అశ్లీల సందేశాలు పంపిన సెక్యూరిటీగార్డును బెంగళూరు మల్లేశ్వరం పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లేశ్వరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో మహేంద్ర అనే యువకుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతను ఇదే కాలేజీకి చెందిన ఓ విద్యార్థి సెల్‌ఫోన్‌తో నలుగురు మహిళా లెక్చరర్లకు అశ్లీల మెసేజ్ పెట్టాడు. ఈ ఘటనపై జనవరి 13న బాధితులు మల్లేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెసేజ్ వచ్చిన నంబర్ ఆధారంగా విచారణ చేపట్టారు. సెల్‌ఫోన్ విద్యార్థినికి సంబంధించినదని తెలియడంతో ఆరా తీయగా అశ్లీల సందేశాలు పంపింది సెక్యూరిటీ గార్డు అని తేల్చారు. ఈమేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు. -
ఫేస్బుక్ కీచకుడు
పెనుగొండ: అతనో అధ్యాపకుడు. భావ వ్యక్తీకరణ, నిర్వహణ కోర్సులో దిట్ట. సామాజిక మాధ్యమాల నిర్వహణలోనూ ఆరితేరాడు. యువతులను వేధించడానికి అతను సామాజిక మాధ్యమాన్నే వేదికగా చేసుకున్నాడు. అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ చివరకు కటకటాలపాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కారాని నరేష్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మేనేజ్మెంట్ అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. ఇతను నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ తీసుకుని, ఫేస్బుక్ ఖాతా ప్రారంభించాడు. అందులో యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతూ పరిచయం చేసుకోవడం మొదలెట్టాడు. కొంత చనువు పెరిగాక అసభ్య మెసేజ్‌లు పంపడం ప్రారంభించాడు. ఇలా చాలామందికి అసభ్య మెసేజ్‌లు పంపాడు. ఈ నేపథ్యంలోనే పెనుగొండకు చెందిన ఓ యువతికి కూడా అసభ్య మెసేజ్‌లు పంపాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సీఐ సి.హెచ్.రామారావు ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించిన పోలీసులు శనివారం నరేష్‌ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అప్రమత్తంగా ఉండాలి : పోలీసులు అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాల్లో స్నేహం చేసేటప్పుడు యువత అప్రమత్తంగా ఉండాలని పెనుగొండ ఎస్సై సి.హెచ్.వెంకటేశ్వరరావు హెచ్చ రించారు. ఇటీవల ఫేస్బుక్, వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో స్నేహాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. కొందరు ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తున్నారని, మరికొందరు ఫిర్యాదు చేయడం లేదని వివరించారు. యువత ఇటువంటి వారి ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
అశ్లీల సందేశాలు
పంపిస్తున్న సీఈఓ అరెస్ట్ బెంగళూరు, న్యూస్‌లైన్ : మహిళా ఉద్యోగినికి అశ్లీల సందేశాలు, బూతు ఎస్ఎంఎస్లు పంపిస్తున్న ఓ ప్రైవేట్ కంపెనీ సీఈఓని స్థానిక కమర్షియల్ స్ట్రీట్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... భారత ఆర్మీలో 25 సంవత్సరాలు పనిచేసి 2006లో కల్నల్ హోదాలో ఉద్యోగ విరమణ పొందిన విజయ్బాత్రా(60), బెంగళూరులోని వెరిఫ్యాక్ట్ సర్వీసెస్ కంపెనీ సీఈఓగా 2011 నుంచి పనిచేస్తున్నారు. ఇదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతి(29)పై కన్నేసిన అతను నిత్యం వేధించేవాడు. ఆమె మొబైల్‌కు అసభ్య ఎస్ఎంఎస్లు, అశ్లీల దృశ్యాలు పంపించేవాడు. సహనం కోల్పోయిన యువతి ఈ విషయంపై విజయ్బాత్రాను నిలదీసింది. అప్పటి నుంచి ఆమెకు మరింత వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఫలితం లేకపోవడంతో ఉద్యోగం మానివేసి, మరో కంపెనీలో చేరింది. కంపెనీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మానివేయడంతో రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా యాజమాన్యం జాప్యం చేస్తూ వచ్చింది. విజయ్ బాత్రా వేధింపుల వల్లనే తాను ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉద్యోగం మానివేశానని, తనకు న్యాయం చేయాలని యాజమాన్యంను వేడుకున్నా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు విజయ్బాత్రాను అరెస్ట్ చేసి, బెయిల్‌పై విడుదల చేశారు. అయితే తన భార్యకు సందేశాలు పంపించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు పొరపాటుగా ఆమెకు వెళ్లాయని విచారణలో విజయ్బాత్రా పేర్కొన్నట్లు సమాచారం. సంఘటనకు సంబంధించి వాస్తవాలు కూపీ లాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఫేస్బుక్లో బూతు సందేశాలు పంపాడని.. 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య
16 ఏళ్ల యువకుడు ఫేస్బుక్ అకౌంట్‌కు అసభ్యకర సందేశాలు పంపి మానసిక క్షోభకు గురిచేయడం, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం ముంబైలో జరిగింది. ముంబై పత్రిక మిడ్ డే కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ముంబయి శివారు ప్రాంతం కాండివ్లి చెందిన ఈ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. గత కొంత కాలంగా ఓ టీనేజర్ ఆమె ఫేస్బుక్ అకౌంట్‌కు బూతు సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడు. తన తండ్రితో కలసి వెళ్లి ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ కేసు గురించి పట్టించుకోలేదు. మంగళవారం సాయంత్రం ఆ బాలిక తన గదిలో చదువుకుంటోంది. కాసేపటి తర్వాత ఆమె తల్లి వెళ్లి చూడగా గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆకతాయి కుర్రాడు ఫేస్బుక్ అకౌంట్‌కు మళ్లీ అసభ్యకర సందేశాలు పంపాడని, అందుకే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి ఆరోపించారు. నిందితుడిని గుర్తించామని, త్వరలోనే విచారిస్తామని పోలీసలు తెలిపారు. అలాగే మృతురాలి ఫేస్బుక్ అకౌంట్ కూడా పరిశీలించనున్నట్టు తెలిపారు.