సాక్షి, క్రైమ్ : మైనర్ స్టూడెంట్స్‌కు అసభ్యకరమైన మెసెజ్‌లు పంపినందుకు టీచర్లను సస్పెండ్ చేసిన ఘటన జమ్మూ కాశ్మీర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. కుప్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న స్టూడెంట్స్‌కు ఉపాధ్యాయులు అసభ్యకరమైన సందేశాలను ఫోన్ ద్వారా పంపించారు. ఇది తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధాన విద్యాధికారి మహ్మద్ షఫీకి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ ఉపాధ్యాయులిద్దరినీ సస్పెండ్ చేశారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అంతర్గత విచారణ కోసం ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని కూడా నియమించింది.
పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించి, కేసు నమోదు చేసుకుని, ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారణను వేగవంతం చేయనున్నట్లు హంద్వారా సీనియర్ పోలీస్‌అధికారి జీలాని వనీ తెలిపారు. ఎనిమిది రోజుల క్రితమే ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. పదకొండో తరగతి చదువుతున్న ఓ బాలికను, ఉపాధ్యాయుడు అత్యాచారం చేసి, అబార్షన్ చేయించడం కోసం ప్రయత్నించగా పట్టుబడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment