
జమ్మూ కశ్మీర్: ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇద్దరు పైలెట్లలతో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌కు సమీపంలోని శివ్ గఢ్ ధార్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, దురదృష్టవశాత్తూ పైలెట్లు ఇద్దరూ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.
ఆకాశంలో దట్టమైన పొగమంచు వ్యాపించడంతో సిగ్నల్ సరిగా కనిపించక హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఉధంపూర్ డీఐజీ సులేమాన్ చౌదరి మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. శివ్ గఢ్ ధార్‌లో ఘటన స్థలానికి రెస్క్యూ బృందాలను పంపించామని తెలిపారు. ఈ ప్రాంతంలో అధిక పొగమంచు ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment