మహిళా లెక్చరర్లకు అశ్లీల మెసేజ్‌లు..అరెస్ట్‌ | security guard arrested in bangalore over obscene messages to Women lecturers | Sakshi
Sakshi News home page

మహిళా లెక్చరర్లకు అశ్లీల మెసేజ్‌లు..అరెస్ట్‌

Published Sat, Jan 28 2017 10:49 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

మహిళా లెక్చరర్లకు అశ్లీల మెసేజ్‌లు..అరెస్ట్‌

మహిళా లెక్చరర్లకు అశ్లీల మెసేజ్‌లు..అరెస్ట్‌

బెంగళూరు : మహిళా లెక్చరర్లకు అశ్లీల సందేశాలు పంపిన సెక్యూరిటీగార్డును బెంగళూరు మల్లేశ్వరం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మల్లేశ్వరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో మహేంద్ర అనే యువకుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతను ఇదే కాలేజీకి చెందిన ఓ విద్యార్థి సెల్‌ఫోన్‌తో నలుగురు మహిళా లెక్చరర్లకు అశ్లీల మెసేజ్‌ పెట్టాడు.

ఈ ఘటనపై జనవరి 13న బాధితులు మల్లేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెసేజ్‌ వచ్చిన నంబర్‌ ఆధారంగా విచారణ చేపట్టారు. సెల్‌ఫోన్‌ విద్యార్థినికి సంబంధించినదని తెలియడంతో ఆరా తీయగా అశ్లీల సందేశాలు పంపింది సెక్యూరిటీ గార్డు అని తేల్చారు. ఈమేరకు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement