పవన్ కల్యాణ్‌తో కుమారస్వామి భేటీ
హైదరాబాద్ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ శనివారం జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ తమ సమావేశంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. చాలాకాలంగా తమ మధ్య స్నేహం ఉందని ఆయన తెలిపారు. తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి చిత్రం విడుదల సందర్బంగా ఆశీర్వాదం కోసమే పవన్‌ను కలిసినట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అన్నదమ్ముల్లాంటివని కుమారస్వామి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కుమారస్వామి తనకు మంచి మిత్రుడన్నారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదన్నారు. నితిన్ కుమారస్వామి గౌడ సినీ ప్రవేశంపై మాత్రమే చర్చించినట్లు పవన్ చెప్పారు. కుమారస్వామితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. కాగా కృష్ణా పుష్కరాలకు వెళ్లడం లేదని విలేకర్లు అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. అలాగే ప్రత్యేక హోదాపై ఆయనను ప్రశ్నించగా, తర్వాత స్పందిస్తానని అన్నారు.
కాగా కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ నటించిన 'జాగ్వార్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. హెచ్.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. ఎ. మహాదేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీప్తి కథానాయికగా నటించారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు.