తులసి రామచంద్రప్రభుకు టికెట్ ఎలా ఇస్తారు?
గుంటూరు : మంగళగిరి టీడీపీలో ముసలం పుట్టింది. పారిశ్రామిక వేత్త తులసీ రామచంద్రప్రభుకు టికెట్ కేటాయింపుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గపు సీటును తులసి రామచంద్రప్రభు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో స్థానికేతరుడికి టికెట్ ఎలా కేటాయించారంటూ టీడీపీ పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు శుక్రవారం తాళం వేశారు.
నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మరోవైపు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టికెట్పైనా రగడ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డిని కాదని...ఇటీవలే టీడీపీలో చేరిన వరదరాజుల రెడ్డికి టికెట్ ఇవ్వటంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ జెండాలు తగులబెట్టారు.