మంగళగిరిలో టీడీపీ రాస్తారోకో | TDP Leaders Darna in mangalagiri | Sakshi
Sakshi News home page

మంగళగిరిలో టీడీపీ రాస్తారోకో

Published Mon, May 19 2014 12:10 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

TDP Leaders Darna in mangalagiri

మంగళగిరి రూరల్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మంగళగిరి నియోజకవర్గంలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై విచారణ చేపట్టాలని కోరుతూ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గంజి చిరంజీవి ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ సెంటర్‌లోని గౌతమబుద్ధారోడ్‌పై ఆదివారం రాస్తారోకో చేశారు. తొలుత నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకుని పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి అంబేద్కర్ సెంటర్‌కు చేరుకున్నారు.
 
 కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి మాట్లాడుతూ పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు సంబంధించి మొత్తం 14 ఓట్ల తేడా వుందని తాము గుర్తించి, శనివారం రాత్రి లెక్కింపు కేంద్రమైన ఆచార్య నాగార్జునయూనివర్సిటీకి వెళ్లి  ఆర్వో ఝాన్సీలక్ష్మిని కలసి వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. రాస్తారోకోలో టీడీపీ నాయకులు నందం అబద్దయ్య, ఆరుద్ర అంకవరప్రసాద్, గుత్తికొండ ధనుంజయరావు, సంకా బాలాజీగుప్తా, వల్లూరి సూరిబాబు, కోనంకి శ్రీనివాసరావు, అవ్వారు కృష్ణ, బీజేపీ నాయకులు జగ్గారపు రామ్మోహనరావు  తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement