darna
-
నీళ్లు లేవు.. సార్లు రారు
మంథని: ‘మా బడిలో తాగేందుకు మంచినీళ్లు రావు.. మరుగుదొడ్లులేవు.. సార్లయితే స్కూల్‌కే రావడం లేదు.. అదే మని అడిగితే బెదిరిస్తున్నారు. మూడేళ్లు గా ఇదే దుస్థితి.. అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.. ఓపిక నశించి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కినం’అని పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బాలుర గురుకుల వసతి గృహం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలోని మంథని – కాటారం ప్రధాన రహదారిపై వెంకటాపూర్ క్రాస్ రోడ్డు వరకు కాలినడకన చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు హాస్టల్ నుంచి బయలు దేరిన సుమారు వంద మంది విద్యార్థులు.. వెంకటాపూర్ క్రాస్‌రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులు పాఠాలు సరిగా బోధించడం లేదని వాపోయారు. కలుషితనీటితో అలర్జీ వస్తోందని, చాలామంది అనారోగ్యం బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలని సార్లకు చెబితే పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై వచ్చి నచ్చజెప్పి.. గంటల కొద్దీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు స్తంభించాయి. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ అధికారులతో మాట్లాడుతానని విద్యార్థులకు నచ్చజెప్పారు. వారిని వసతి గృహానికి తీసుకెళ్లి అవగాహన కల్పించారు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఆర్సీవో గౌతమ్, జిల్లా కనీ్వనర్ సుస్మిత హాస్ట ల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన.. బోధన్/రుద్రూర్: నిజామాబాద్ జిల్లా లోని బోధన్, సాలూర, రుద్రూర్, పోతంగల్ మండలాల్లోని గ్రామాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయని, కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుతిరుగుడు, మొక్క జొన్న పంటల కోతలు 50 శాతం వరకు పూర్తయ్యాయి. కాగా, మిగిలిన పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. -
పోలీసు అభ్యర్థులకు న్యాయం చేయండి: కాంగ్రెస్
హైదరాబాద్: ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకపు పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం వెంటనే స్పందించి హైకోర్టు తీర్పు ప్రకారం అభ్యర్థులకు న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు. తెలంగాణ పోలీసు బోర్డులో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి మంగళవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సమర దీక్ష నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నేతలు విచ్చేసి దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేతలు మాట్లాడుతూ బోర్డు నిర్ల క్ష్యం కారణంగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్య ర్థులు నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం మార్కులు కలిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శివసేనా రెడ్డి మాట్లాడుతూ... బోర్డు ఇచ్చిన తప్పుడు ప్రశ్నల వల్ల ఏడు మల్టిపుల్ ప్రశ్నల మార్కులను అభ్యర్థులకు కలపాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమన్నారు. హైకోర్టు తీర్పు అమలు చేస్తే దాదాపు 70 వేల మంది అభ్యర్థులకు న్యాయం జరిగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, నేతలు ప్రవళిక నాయక్, శివకుమార్ రెడ్డి, వెంకట్, మాతం ప్రదీప్, సునీత, దివ్య పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన ‘మధ్యమానేరు’ నిర్వాసితులు
వేములవాడ అర్బన్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు ముంపు గ్రామాల్లో ఏళ్లుగా నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ నిర్వాసితులు సోమవారం రోడ్డెక్కారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాధర్నాకు పూనుకున్నారు. ముందస్తుగా పోలీసులు ముంపు గ్రామాలైన అనుపురం, రుద్రవరం గ్రామాల్లో భారీగా మోహరించారు. సోమవారం వందలాది మంది నిర్వాసితులను పోలీసులు అడ్డుకోవడంతో అనుపురం వద్ద కరీంనగర్–సిరిసిల్ల రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులు నందికమాన్ వద్దకు భారీగా తరలివచ్చారు. ‘మేం వ్యవసాయం చేసుకుందామంటే భూములు లేవు. చేతిలో పనిలేక అడ్డాకూలీలుగా మారాం’అని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. పట్టా ఇచ్చిన ప్రతీ కుటుంబానికి రూ.5.04 లక్షలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీ నెరవేర్చలేదన్నారు. తమకు ఇళ్లు, భూముల పరిహారం, పట్టాలు, యువతకు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు 300 మందిని పోలీసులు కోనరావుపేట పీఎస్‌కు తరలించారు. మహాధర్నాకు తరలివస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులను వేములవాడ బ్రిడ్జిపై పోలీసులు అరెస్ట్ చేసి తంగళ్లపల్లి ఠాణాకు తరలించారు. నిర్వాసితులకు అండ: రేవంత్‌రెడ్డి మిడ్‌మానేరు నిర్వాసితులకు సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, వారికి న్యాయం జరిగేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ధర్నా చేస్తున్న నిర్వాసితులపై పోలీసులు దౌర్జన్యం చేయడం దుర్మార్గమని, నిర్వాసితులతో పాటు కాంగ్రెస్ నేతల అరెస్టును ఖండిస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయం చేయాలి: బండి రాష్ట్ర ప్రభుత్వం మిడ్‌మానేరు బాధితుల డిమాండ్లపై స్పందించి వెంటనే న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముంపు బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న జేఏసీ, బీజేపీ నేతలను, మహిళలను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలన్నారు. -
యాదాద్రి ఆలయ ఈవోను తొలగించాలి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట ప్రధానాలయం పునఃప్రారంభం నుంచి కొండపైకి ఆటోలను అనుమతించకపోవడంతో ఆలయ ఈవోను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వైకుంఠద్వారం వద్ద ఆటోకార్మికులు కుటుంబాలతో కలసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి ఆందోళన విరమించాలని చెప్పగా కార్మికులు అందుకు నిరాకరించారు. ఫైనాన్స్, అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేశామని, ఆటోలను అనుమతించకపోతే సుమారు 300 కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొట్టమీద కొడుతున్న ఈవోను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ దశలో పోలీసులకు ఆటోకార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది. దీంతో భక్తులు కొద్దిసేపు ఇబ్బందులకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఆటోకార్మికులు స్వచ్ఛందంగా ఆందోళన విరమించారు. -
‘ఢిల్లీలో కేసీఆర్ దీక్షకు ఎమ్మార్పీఎస్ మద్దతు’
ముషీరాబాద్ (హైదరాబాద్): ఢిల్లీలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈనెల 11న రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టే ధర్నాకు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రకటించారు. శనివారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రైతులు పండించిన వడ్లను, పంటను కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్లు సాధించేవరకు ఎమ్మార్పీఎస్ వారికి తోడుగా ఉంటుందని తెలిపారు. కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటును అందిస్తూ రైతు బాంధవుడిగా ఎల్లవేళలా అండగా ఉంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో కొల్లూరి వెంకట్, వరిగడ్డి చందు, చింతం తిరుపతి, శాగంటి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
యాసంగి ధాన్యం కొనాల్సిందే!
సాక్షి నెట్వర్క్: తెలంగాణలో పండే యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ మరోసారి డిమాండ్ చేసింది. లేకుంటే కేంద్రానికి రాస్తా బంద్ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఆ పార్టీ శ్రేణులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్, విజయవాడ రహదారులపై రాస్తారోకోలు చేపట్టాయి. నేతలు, కార్యకర్తలు వరి కంకులు, ప్లకార్డులు చేపట్టి, రోడ్లపై ధాన్యం కుప్పపోసి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వద్ద హైదరాబాద్–బెంగళూరు హైవే ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో కార్యకర్తలు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. ‘‘రైతుల కోసం కేంద్రం ఏం చేసిం దో బీజేపీ నేతలు గుండె మీద చేయి వేసుకుని చెప్పాలి. పండించిన పంటనే కొనలేని దద్దమ్మ ప్రభుత్వం. అగ్రిమెంట్ రాసిచ్చారని ఒకరు.. కొంటమని మరొకరు.. కొనమని ఇంకొకరు.. నూకలు తినాలంటరు. నూకలు మేం తినం.. మీకు నూకలు చెల్లినయ్’’ అని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో ధాన్యం కొనేదాకా ఊరుకోబోమన్నారు. ఇక్కడ గంటకుపైగా ఆందోళన సాగడంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అడుగడుగునా నిరసనలతో.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీంద్రకుమార్‌ల ఆధ్వర్యంలో 65వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. మిర్యాలగూడ పట్టణంలో అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండల కేంద్రం లో ఎమ్మెల్యే నోముల భగత్.. సూర్యాపేట సమీపంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్.. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌లో ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి నేతృత్వంలో రాస్తారోకోలు జరిగాయి. ►యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు నిరసనలు చేపట్టారు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ►నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ వైజంక్షన్ వద్ద 44వ జాతీయ రహదారిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో రాస్తారోకో చేశారు. ►ఆదిలాబాద్ జిల్లా చాందా(టి) గ్రామ సమీపంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్ నేతృత్వంలో ఆందోళనలు నిర్వహించారు. ►సంగారెడ్డిలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, పద్మాదేవేందర్‌రెడ్డి, మాణిక్‌రావు, దేవీప్రసాద్‌రావు, చింతా ప్రభాకర్ తదితరులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ►మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో, పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. నేడు జిల్లా కేంద్రాల్లో దీక్షలు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గురువారం హైదరాబాద్ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, దీక్షలకు టీఆర్ఎస్ సన్నద్ధమైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పార్టీ మండల కమిటీలు, అనుబంధ సంఘాల నేతలు దీక్షలకు రావాలని సూచించారు. -
విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కంగ్రెస్ ధర్నా
-
గ్రామస్థులపై దాడి, నిరసనగా ధర్నా
సాక్షి, గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ఉద్రిక్తత నెలకొంది. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో చాలా మంది ఉపాధి కోల్పొయి తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక వలస కార్మికుల విషయానికి వస్తే సొంత గ్రామాలకు వెళ్లలేక ఉన్న చోట ఉపాధిలేక, ఆహారం దొరకక, తలదాచుకోవడానికి నీడ లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. చెట్టినాడు సిమెంట్ ఫ్యాకర్టీలో బీహార్ నుంచి వచ్చిన చాలా మంది కార్మికులు పని చేస్తోన్నారు. (యాక్టివ్ కేసుల కంటే డిశ్చార్జ్ కేసులే ఎక్కువ) అయితే లాక్డౌన్ కారణంగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పరిస్థితి ఎలా ఉందో చూడటానికి బుధవారం పెదగార్లపాడు గ్రామస్థులు వారి వద్దకు వెళ్లారు. వారికి సాయం అందించాలనే ఉద్దేశంతో గ్రామస్తులు అక్కడికి వెళ్లగా వారిపై సిమెంట్ ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడింది. దీంతో గ్రామస్థులు దాడికి నిరసనగా ఫ్యాక్టరీ ఎదుట ధర్నాకి దిగారు. కరోనా కారణంగా సామాజిక దూరం పాటించాల్సిన సమయంలో ఇలా జరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. (ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్..) -
టీడీపీ గూండాగిరిపై నిరసన గళం
సాక్షి, వజ్రపుకొత్తూరు: టీడీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటూ గ్రామ వలంటీర్లు నినదించారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న తమపై గూండాగిరి ప్రదర్శించి దాడులు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున కదం తొక్కా రు. పూండి– గోవిందపురం గ్రామ వలంటీర్ కిక్క రి సరస్వతిపై ఈ నెల 7న టీడీపీ నేత పుచ్చ ఈశ్వరరావు కుటుంబ సభ్యులు దాడి చేసి కొట్టడాన్ని నిరసిస్తూ తోటి వలంటీర్లు సోమవారం స్థానిక గ్రామ సచివాలయం వద్ద ధర్నా చేపట్టారు. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంచినీటి పథకం తాళం ఇవ్వాలని కోరడమే వలంటీర్ పాపమా.. అంటూ మండిపడ్డారు. రాజకీయ ముసుగులో దాడులు చేసి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే సహించబోమని ముక్త కంఠంతో నినదించారు. పూండి–గోవిందపురంలోని వైఎస్సార్ కూడలి వద్ద వలంటీర్లు, నాయకుల మనవహారం కేసు విచారణలో ఉంది.. వలంటీర్‌పై దాడులను ఉపేక్షించేది లేదని వజ్రపుకొత్తూరు ఎంపీడీఓ సీహెచ్.ఈశ్వరమ్మ స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులు కేసుని విచారించారని, నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినందున పోలీసులు అరెస్టు చేస్తారని చెప్పారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదు నెలలుగా స్థానికులకు తాగునీరు అందించకుండా మంచినీటి పథకానికి తాళాలు వేశారని, దీనిపై ప్రశ్నిస్తే వలంటీర్‌ను జుత్తు పట్టుకుని కొట్టడం దారుణమన్నారు. నిరసన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చింత రవివర్మ, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు సీదిరి త్రినాథ్, మండల పార్టీ అధ్యక్షుడు పుక్కళ్ల గురయ్యనాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలిన ఉమామహేశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశవరావు, కొల్లి రమేష్, డీసీఎంఎస్ డైరెక్టర్ నర్తు ప్రేమ్‌కుమార్, మద్దిల హరినారాయణ, కె.గోపాల్, జి.రామారావు, కొల్లి జోగారవు, అంబటి శ్రీను, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఖండించాలి.. వలంటీర్లపై దాడులను ప్రజా సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ ఖండించాలి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు వారథులుగా పని చేస్తున్న తమపై దాడులు చేయడం దారుణం. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి.– నర్తు అరుణ, గ్రామ వలంటీర్, గడరుడభద్ర పరారీలో ఉన్నారు.. వలంటీర్‌పై దాడి చేసిన ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. గాలిస్తున్నాం. ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశాం. వలంటీర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవు. విచారణ పూర్తయింది. సరస్వతికి న్యాయం చేస్తాం. – ఎం.గోవింద, ఎస్ఐ, వజ్రపుకొత్తూరు -
ఖానాపూర్‌లో కోర్టు కొట్లాట!
సాక్షి, ఖానాపూర్: నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ పట్టణంలో కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయవాదులు చేపట్టిన నిరవదిక రిలే నిరాహార దీక్షకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పార్టీలకతీతంగా ప్రజలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థులు వెల్లువలా తరలివచ్చి బహిరంగ మద్దతు తెలుపుతూ కోర్టు ఏర్పాటులో జాప్యంపై ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. కోర్టు ఏర్పాటు కోసం చేస్తున్న రీలే దీక్షకు మద్దతుగా శనివారం పట్టణంలో వ్యాపార సంస్థల సంపూర్ణ బంద్ పాటిస్తామని ఐక్య వ్యాపార కమిటీ అధ్యక్షుడు రాజేందర్ శుక్రవారం ప్రకటించారు. గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు కోర్టు కోసం ఏకగ్రీవ తీర్మానం చేశారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం పలువురు ముస్లీంలు, పలు మజీద్ కమిటీల పెద్దలు తరలివచ్చి న్యాయవాదులకు సాంప్రదాయ (ఇమామ్ జామీన్) దట్టికట్టి సంఘీబావం తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పలు గ్రామాల సర్పంచ్‌లతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు తరలివచ్చి దీక్ష స్థలి వద్ద మద్దతు ఇచ్చి బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు. స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేస్తాం శాంతియుతంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేని యెడల న్యాయవాదులు చేస్తున్న ఉద్యమం ప్రజల చేతుల్లోకి వచ్చి ఆందోళనలు ఉదృతం అయితే దానికి పూర్తి బాద్యత ప్రభుత్వమే వహించాలని వివిధ పార్టీలు, కులసంఘాలు పార్టీల నాయకులు హెచ్చరించారు. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు రామయ్య దీక్షకు మద్దతుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి సంఘీబావం తెలిపి మాట్లాడారు. కోర్టు ఏర్పాటుకు సరిపడా వనరులు పట్టణంలో అందుబాటులో ఉండడంతో పాటు 1,500 పైగా కేసులు ఉన్నందుకు కోర్టు ఏర్పాటు అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పద్మశాలి సంఘం నాయకులు ర్యాలీగా వచ్చి మద్దతుగా బైఠాయించారు. శివాజీనగర్ యూత్, ఎస్ఆర్ విద్యాసంస్థల యజమాన్యం విద్యార్థులు మద్దతు తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు సురేశ్, వెంకట్మహేంద్ర, సత్యనారాయణ, ఆసిఫ్అలీ, రాజశేఖర్, కిశోర్‌నాయక్, రాజగంగన్న, రాఘవేంద్ర, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులారా... ఆత్మహత్యలకు పాల్పడవద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో గందరగోళంపై సోమవారం (29న) ఇంటర్‌బోర్డు ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, టీడీపీ ప్రకటించాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఇతర రాజకీయపార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర వర్గాలవారు కలసి రావాలని పిలుపునిచ్చాయి. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, వారికి తాము అండగా ఉంటామని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశాయి. శనివారం ఇక్కడి మఖ్దూంభవన్‌లో భేటీ అనంతరం ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. 23 మంది మరణం హృదయవిదారకం ఇంటర్ బోర్డు తప్పులకు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం హృదయ విదారకరమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ఎదిగిన పిల్లలు రాలిపోయి, ఎద నిండా ఆవేదనతో తల్లిదండ్రులున్నారని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మొత్తం మేల్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. ఒక కంపెనీ ప్రయోజనాల పరిరక్షణకే ప్రభుత్వం, అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఈ సంస్థ మొదటి నుంచి తప్పులు చేస్తున్నా వెనకేసుకు వచ్చారని విమర్శించారు. తప్పులపై కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు మొదటి నుంచి హెచ్చరిస్తున్నా బోర్డు అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇంటర్ కార్యదర్శికి సమస్యలన్నీ తెలుసని, విద్యార్థులు ఫెయిలైతే డ్రైవర్లు కావచ్చని, దుకాణాల్లో పని చేసుకోవచ్చని ఉచిత సలహాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కూడా ఉచితంగా విద్యార్థులకు వాల్యూయేషన్ చేస్తామన్నారే తప్ప ఈ సమస్యపై సమగ్ర సమీక్ష నిర్వహించలేదన్నారు. తమకు ఎమ్మెల్యేల సంఖ్య లేకపోయినా సమాజం పట్ల నిబద్ధత ఉందని, ఏదిఏమైనా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామన్నారు. నిద్ర నటించే సర్కార్‌ను తట్టి లేపేందుకే ఈ వ్యవహారంపై నిద్ర నటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు ధర్నా నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిఫారసుతోనే పరీక్షల నిర్వహణలో అనుభవంలేని గ్లోబరీనా సంస్థకు టెండర్ కట్టబెట్టారని ఆరోపించారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే ఈ సంస్థకు పరీక్షా ఫలితాల బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. ప్రతి అంశంపై ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ ఇంటర్ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిం చారు. విద్యార్థులు రోడ్డున పడితే టీఆర్ఎస్ మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ ఫ్యూడల్ మైండ్‌సెట్‌తో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేబినెట్ బాధ్యత వహించాలి: రమణ ఇంటర్ బోర్డు తప్పులకు సీఎం కేసీఆర్, కేబినెట్ బాధ్యత వహించాలని, మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంపై విపక్షపార్టీలుగా గవర్నర్‌ను కలిస్తే నామమాత్రంగా స్పందించారన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేటీఆర్ మాత్రం ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిర్బంధాన్ని ఛేదిస్తాం: చాడ సీఎం కేసీఆర్ ప్రయోగించే నిర్బంధాన్ని, పోలీస్ వ్యవస్థను ఛేదించి 29న ధర్నా నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. తొంభై మార్కులు వచ్చిన అమ్మాయికి ఇంటర్‌బోర్డు సున్నా మార్కులు వేసినందుకు సిగ్గుపడాల్సింది పోయి... ఇలాగే జరుగుతాయి అని చెప్తారా? అని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉంటామని, జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. -
బీసీల జీవనస్థితి మెరుగు జగన్‌తోనే సాధ్యం
విజయవాడ సిటీ: బీసీల కష్టాలు తీరి, జీవన పరిస్థితులు మెరుగుపడాలంటే వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీలను చంద్రబాబు మోసం చేసిన తీరుపై గురువారం వైఎస్సార్ కాంగ్రె‹స్ పార్టీ బీసీ సెల్ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బీసీలను ఓటు బ్యాంకుగా భావించి మోసం చేస్తున్న చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో బీసీలంతా ఏకమై గుణపాఠం చెప్పాలన్నారు. ఆదరణ పేరుతో బీసీలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు జీవన పరిస్థితులు అలాగే ఉండాలనే ఉద్దేశంతో వారికి పనిముట్లు చంద్రబాబు మభ్యపెడుతున్నారన్నారు. బీసీల అభివృద్ధి కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. బీసీల సమస్యలను చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే సీఎం హోదాలో ఉండి అవహేళన చేసిన ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మాయల ఫకీర్ చంద్రబాబును వ చ్చే ఎన్నికల్లో సాగనంపాలన్నారు. బీసీలను జడ్జీలు కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుతంత్రాలను వివరించారు. దమ్మిడీకి పనికిరాని వారిని జన్మభూమి కమిటీ పేరుతో ప్రజలపై రుద్ది రాజ్యాంగాన్ని చంద్రబాబు అవహేళన చేశారని మండిపడ్డారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో బీసీలు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడ్డారన్నారు. అంతేకాకుండా విదేశాల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు. అటువంటి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను చంద్రబాబు నీరుగార్చి అడ్డంకులు సృష్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. రైతులు, డ్వాక్రా అక్కాచెల్లిమ్మలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇలా అందర్నీ చంద్రబాబు మోసం చేశాడన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన రావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ చంద్రబాబుకు అణగారిన వర్గాలంటే చులకన అన్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ చంద్రబాబు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు అణగారిన వర్గాల జీవన స్థితిగుతులు మారుస్తాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎంపీ సాంబూ, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి, విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్, విజయవాడ పార్లమెంటు బీసీ సెల్ అ«ధ్యక్షుడు కసగోని దుర్గారావు గౌడ్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు బోను రాజేష్, బొమ్మ న్న శివశ్రీనివాసరావు, గొలగాని శ్రీనివాసరావు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. నేతలు ర్యాలీగా వెళ్లి విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతిపత్రాన్ని అందజేశారు. -
‘చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైఎస్సార్సీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో తమ పోరాటం కొనసాతుందని అన్నారు. హోదా కోసం వైఎస్సార్సీపీ 2014 నుంచి పోరాటం చేస్తోందని, నోటీసులు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు మోసం వల్లనే ప్రత్యేక హోదా రాలేదని, తెలంగాణ ప్రజలు ఆయనకు దిమ్మతిరిగే జవాబిచ్చారని పేర్కొన్నారు. అదే రీతిలో ఏపీ ప్రజలు కూడా బుద్ధిచెబుతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు నీతులు చెప్పారు.. తెలంగాణ ప్రజలు చంద్రబాబు చెంప చెల్లుమనిపించారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో పోటీ చేసి ఏపీ ప్రజలను మభ్యపెట్టాలని ఆయన ప్రయత్నించారని, కానీ తెలంగాణ ప్రజలు ఆయనకు గట్టిగా బుద్ధిచెప్పారని అన్నారు. ఏపీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను కొనుగోలు చేసి తెలంగాణలో ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఓడించాలని చంద్రబాబు నీతులు చెప్పారని ఆయన గుర్తుచేశారు. గాంధీ విగ్రహం ముందు ధర్నా చేసిన నేతలు ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాగా మంగళవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్లతో పాటు వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, మిథున్ రెడ్డి, వర ప్రసాద్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లులు పాల్గొన్నారు. రాజ్యసభలో ఆందోళన.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో ఆందోళకు దిగారు. హోదాను డిమాండ్‌చేస్తూ సభలో ప్లకార్డులు పట్టుకుని నిరసనకు వ్యక్తం చేశారు. దీంతో సభ మధ్యాహ్న రెండు గంటలకు వాయిదా పడింది. -
మహదర్నాకు సిద్ధమవుతున్న ఏపీ ఉపాద్యయ సంఘాలు
-
విజయవాడలో బీజేపీ నేతల ధర్నా
-
అభివృద్ధి కోసమే కర్మాగారం..లాభాల కోసం కాదు
-
‘నాలుగేళ్లు చంద్రబాబు నిద్రపోయారా’
సాక్షి, అమరావతి: కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే చదువుకున్నయువతకు ఉద్యోగాలు దొరుకుతాయని, ప్రజలకు ఉపాధి లభిస్తుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. కడపలో మానవ వనరులు అధికంగా ఉన్నాయని, ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సిన నీరు, విద్యుత్, ఖనిజం, భూమి, ఈ ప్రాంతంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇన్ని సహజ వనరులు ఉన్నచోట ఫ్యాక్టరీని ఎందుకు నిర్మించరని రాచమల్లు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం కడపలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు. నాలుగేళ్ల కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ పదవులు అనుభవించి ఇప్పుడు కొత్తగా ఉక్కు ఫ్యాక్యర్టీ కోసం దీక్ష చేయడం ఏమిటని రాచమల్లు ప్రశ్నించారు. కడపలో కర్మాగారం పెడితే లాభం రాదని కేంద్రం చెబుతోందన్న రాచమల్లు ప్రజల అభివృద్ధి కోసం కర్మాగారం నిర్మించాలిగానీ, లాభాల కోసం కాదని వ్యాఖ్యానించారు. కడపలో వైఎస్ జగన్‌ను దెబ్బతియాలనే ఉద్దేశంతోనే టీడీపీ దొంగ దీక్షలు చేస్తోందని విమర్శించారు. అర్హత, యోగ్యత, నైతిక విలువలు లేని రమేష్ నాయుడు (సీఎం రమేశ్) రాజకీయ లబ్ధి కోసమే దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. 19 మంది ఎంపీలు ఉన్న టీడీపీ ఉక్కు ఫ్యాక్టర్టీ సాధించలేకపోతోందని, నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు నిద్రపోయారా అని ధ్వజమెత్తారు. కేంద్రంతో విభేదించినప్పుడే చంద్రబాబు దీక్ష చేసి ఉంటే 67 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపేవారని అన్నారు. ముగిసిన మహాధర్నా ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా విజయవంతంగా ముగిసింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. జిల్లాలోని పాత కలెక్టరేట్ వద్ద జూన్ 23 నుంచి 26 వరకు ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఈ నెల 24న బద్వేలులో మహా ధర్నా, 25న రాజాంపేటలో మహాధర్నా, జమ్మలమడుగులో భారీ దీక్షలు చేపడుతామని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. నిరసనల్లో భాగంగా జూన్ 27న జాతీయ రహదారుల దిగ్బందిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం డిమాండ్ చేస్తూ జూన్ 29న రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.. కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినదించారు. -
ప్రజాస్వామ్య విలువలకు కాంగ్రెస్ మద్దతుగా నిలవాలి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య విలువలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవాలని సీపీఐ సీనియర్ నేత డి. రాజా వ్యాఖ్యానించారు. గత వారం రోజులుగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలకు రాజా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆప్ నేత సత్యేంద్ర జైన్‌ను ఆయన పరామర్శించారు. ప్రధాని మోదీ, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చర్యలను ఆయన ఖండించారు. తమ పోరాటానికి మద్దతు తెలిపిన రాజాకు కేజ్రీవాల్ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు. ‘ధన్యావాదాలు కామ్రేడ్ రాజా’ అంటూ ట్వీట్ చేశారు. కాగా దేశ రాజధానిలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఇంట్లో ముఖ్యమంత్రి కూర్చుని ధర్నా చేయడమేంటని ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కేజ్రీవాల్‌పై పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. -
పెళ్లయిన కొద్ది రోజులకే..
ఉండ్రాజవరం: ప్రేమించి పెళ్లి చేసుకున్న నెలరోజులకే భర్త తన వద్దకు రావడం లేదని, అత్తవారింటికి వెళ్తే తనను రానివ్వకుండా తలుపులు వేసుకుంటున్నారని ఒక మహిళ అత్తవారింటి ముందు గురువారం రాత్రి నుంచి ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామానికి చెందిన పెదప్రోలు సురేష్ అదే గ్రామానికి చెందిన ఎమ్.సులోచన ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరు మే5న గౌరీపట్నంలోని చర్చిలో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే తన భర్త తనవద్దకు రావడం మానేశాడని ఆరోపిస్తోంది. -
యూనిఫాం ఇవ్వలేదని డ్రైవర్ ధర్నా
తిరువొత్తియూరు: యూనిఫాం ఇవ్వలేదని ప్రభుత్వ బస్సు ముందు కూర్చొని డ్రైవర్ ధర్నా చేసిన సంఘటన దిండుక్కల్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. దిండుకల్ సమీపం వత్తలగుండు ఊర్కాలన్ ఆలయ వీధికి చెందిన సురేష్ దిండుకల్ ప్రభుత్వ రవాణా సంస్థ శాఖ డిపో–3లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం దిండుకల్ నుంచి కుములికి వెళ్లడం కోసం బస్సును తీశాడు. ఆ సమయంలో అతను యూనిఫారం ధరించలేదు. దీన్ని గమనించిన ట్రాన్స్‌పోర్టు డిపో సహాయ ఇంజినీర్ అక్కడికి చేరుకుని సురేష్‌ను అడ్డుకున్నాడు. దీంతో డ్రైవర్‌కు సహాయ ఇంజనీర్‌కు మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహం చెందిన డ్రైవర్ సురేష్ బస్సు ముందు కూర్చొని ధర్నా చేశాడు. రవాణసంస్థ అధికారులు యూనిఫాం అందచేయకపోవడాన్ని ఖండిస్తూ నినాదాలు చేశాడు. సురేష్ మాట్లాడుతూ తాను 2009 నుంచి పర్మినెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఏడాదికి రెండు జతల యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. రెండేళ్లుగా యూనిఫాం అందజేయలేదని, 2014 నుంచి యూనిఫాం కుట్టు కూలి నగదును ఇవ్వలేదని, దీనిపై మదురై డిపో జనరల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలిపాడు. అధికారులు యూనిఫాం, కుట్టు కూలి నగదు అందజేయాలని కోరాడు. -
మహిళా న్యాయవాది ధర్నా
అన్నానగర్: భర్తతో కలపాలని కోరుతూ కోర్టు ఆవరణలో ధర్నాకు దిగిన మహిళా న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు శ్రీనివాసపురానికి చెందిన అన్భళగన్ (33). ఇతని భార్య శరణ్య (27) తంజావూరు కోర్టులో న్యాయవాదులుగా పని చేస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగా భార్య, భర్త విడిపోయి జీవిస్తున్నారు. ఈ స్థితిలె భార్య నుంచి విడాకులు కోరుతూ అన్భళగన్ తంజావూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇలాఉండగా తనను భర్తతో కలపాలని కోరుతూ బుధవారం సాయంత్రం శరణ్య తంజావూరు కోర్టు ఆవరణలో ధర్నా చేపట్టింది. రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు ఆమెను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి మహిళా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అర్ధరాత్రి ఆమెను ఇంట్లో వదిలిపెట్టారు. అనంతరం గురువారం శరణ్య మళ్లీ ధర్నాకు దిగింది. మధ్యాహ్నం ఆమెను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. గతంలో ఆమె ఇదేవిధంగా ధర్నా చేపట్టిన సమయంలో నమోదైన ప్రభుత్వ విధులకు ఆటకం కలిగించిన కేసు, ఆత్మహత్య బెదిరింపు కేసులను విచారించిన న్యాయమూర్తి తంగమణి, శరణ్యకు మే 10వతేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిర్పునిచ్చారు. పోలీసులు ఆమెను తిరుచ్చి సెంట్రల్ జైలుకు పంపారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
మిడ్జిల్ (జడ్చర్ల): తనను పెళ్లి చేసుకోవాలని ఓ బాలిక ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ సంఘటన మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన బాలిక(17) మహబూబ్‌నగర్‌లో ఇంటర్ చదువుతుండగా.. అదే గ్రామానికి చెందిన మహేష్(21) అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఈ నెల 8వ తేదీన గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా.. యువకుడి తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నారు. అనంతరం యువకుడి కుటుంబ సభ్యులు రాత్రికి రాత్రే ఇంటి నుంచి పరారయ్యారు. తనను ప్రేమించి మోసం చేసిన మహేష్‌తో పెళ్లి జరిపించాలని బాలిక ఆదివారం గ్రామంలో యువకుని ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఈమెకు ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ప్రేమ పేరుతో బాలికను మోసం చేసిన మహేష్‌తో పెళ్లి జరిపించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి యువకుడిపై కేసు నమోదు చేస్తామని బాలికకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. యువకుడితో తనకు పెళ్లి జరిపించి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు భీంరాజ్, గణేష్, రాజు తదితరులు ఉన్నారు. -
రైతులపై ఎస్.ఐ. జులుం
రెడ్డిగూడెం (మైలవరం) : శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ఎస్.ఐ. విధి నిర్వహణలో ఓ వీధి రౌడీలా వ్యవహరించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఘటన మండలంలోని మిట్టగూడెం ప్రధాన సెంటర్లో గురువారం చోటు చేసుకుంది. రెడ్డిగూడెం నుంచి సీఎం బందోబస్తుకు వెళ్తున్న స్థానిక ఎస్.ఐ. అనిల్‌కుమార్.. మండలంలోని మిట్టగూడెం సెంటర్లో రోడ్డు పక్కన ట్రాక్టర్లో మామిడి కాయల ఖాళీ బాక్స్‌లు వేసుకుంటున్న రైతుల దగ్గరకు వెళ్లి దురుసుగా ప్రవర్తించి చెయ్యి చేసుకున్నాడు. ‘ట్రాక్టర్ ఎవడిదిరా...’ అంటూ రైతు అలవాల నర్సారెడ్డిపై చెయ్యి చేసుకోవడంతో అక్కడే ఉన్న మరో మామిడి రైతు నరెడ్ల నాగిరెడ్డి ఇదేమని ప్రశ్నించాడు. దీంతో అతని కాలర్ పట్టుకుని లాక్కురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్.ఐ. ఓవర్ యాక్షన్ చూస్తున్న గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. వారిని చూసి కంగుతిన్న ఎస్.ఐ. అక్కడ నుంచి ఉడాయించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధిక సంఖ్యలో మిట్టగూడెం ప్రధాన కూడలికి చేరుకుని రోడ్డుపై ధర్నాకు దిగారు. ఎస్.ఐ. అనిల్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులపై చెయ్యి చేసుకున్న ఎస్.ఐ.ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత రైతులకు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న మైలవరం సీఐ రామచంద్రరావు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. రైతులను అనవసరంగా కొట్టిన ఎస్.ఐ.ని సస్పెండ్ చేసే వరకు ఆందోళన విరమింపచేసేది లేదని వారు భీష్మించుకుని కూర్చున్నారు. విచారణ జరిపి ఎస్.ఐ.పై చర్యలకు నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామంటూ సీఐ సర్దిచెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. కాగా నాలుగు కూడలి సెంటర్లో రైతుల ధర్నాతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నూజివీడు – గంపలగూడెం రహదారి, విజయవాడ – విస్సన్నపేట రహదారులపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం తమపై దాడి చేసిన ఎస్.ఐ.పై చర్యలు తీసుకోవాలంటూ అలవాల నర్సారెడ్డి, నరెడ్ల నాగిరెడ్డి రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
నేను సిద్ధంగా ఉన్నా..
పులివెందుల : పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని.. సమయంతో నాకు పనిలేదని ఏ క్షణమైనా చర్చకు రావడానికి నాకు సమ్మతమేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు చర్చకు రావాలంటూ టీడీపీ నాయకులు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. గురువారం కడప నగరంలో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో తాను నియోజకవర్గ అభివృద్ధిపై పూల అంగళ్ల సర్కిల్ వద్దకానీ, వేంపల్లె అడ్డరోడ్డులోకానీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని ఎంపీ ప్రతి సవాల్ చేశారు. శుక్రవారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు చెప్పినట్లుగా పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మరోసారి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల అమలు తీరుపై కడిగిపారేస్తామన్నారు. వైఎస్సార్ హయాంలో పులివెం దులలో జరిగిన అభివృద్ధిపైనా.. సాగునీటి ప్రాజెక్టు పనులపైనా.. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు హయాంలో పులివెందులలో ఎలాంటి అభివృద్ధి జరిగిందన్న విషయంపైనా చర్చించి తీరుతామని వెల్లడించారు. అలాగే వైఎస్సార్ మర ణం తర్వాత ఆగిపోయిన పనులపైనా చర్చిద్దామని సవాలు విసిరారు. ఆ తర్వాతే 5వ తేదీన జరిగే ఢిల్లీలో జరిగే ధర్నాకు, పార్లమెంటు సమావేశాలకు హాజరవుతానని చెప్పారు. కానీ, టీడీపీ నాయకులు దీనికి 4వ తేదీ వరకు సమయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అధికారం ఉందని చర్చా కార్యక్రమాన్ని పోలీసులతో భగ్నం చేయించాలని ప్రయత్నిస్తే మాత్రం టీడీపీ నేతలు నైతికంగా ఓటమి చెందినట్లేనని తెలిపారు. నేను రైతులతో నీళ్ల కోసం ధర్నా చేస్తే.. రౌడీలతో ధర్నా చేశానని సతీష్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటు అన్నారు. అన్నదాతలను రౌడీలనడంతోనే వారిపట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్ధమవుతోందని చెప్పారు. నేను రౌడీయిజాన్ని ప్రోత్సహించే వ్యక్తినైతే పులివెందులలో టీడీపీ నాయకులు ఇంత స్వేచ్ఛగా తిరగలేరన్నారు. వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యానికి, చట్టానికి కట్టుబడి ప్రవర్తిస్తుందే తప్ప.. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు. ప్రతిపక్షనేత రివ్యూ మీటింగ్‌కు హాజరైన అధికారులను భయభ్రాం తులకు గురిచేసిన నీచమైన చరిత్ర మీదని.. పులివెందులకు ప్రతిపక్షనేత జగన్ ఏమీ చేయలేదని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లు వదాలి.. పీబీసీ నీటి విషయమై, ప్రాజెక్టుల విషయమై వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేకసార్లు నా ఫోన్ ద్వారానే మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఫోన్ చేశామన్నారు. వైఎస్సార్ పుణ్యంతో ప్రాజెక్టులు కడితే దేవుని దయతో వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి నీరు వచ్చాయన్నారు. ఇప్పుడు ఆ నీటిని సక్రమంగా వినియోగించాలని డిమాండ్ చేశారు. లింగాల.. పులివెందుల బ్రాంచ్ కెనాల్ చివరి ఆయకట్టు వరకు ఉన్న చెరువులను నీళ్లతో నింపాలని లేనిపక్షంలో పీబీసీ కార్యాలయం ఎదుట కాకుండా.. టీడీపీ నేతల ఇళ్ల వద్ద రైతులతో కలిసి ధర్నా చేపడతామన్నారు. వైఎస్ విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్నపుడు అనంతపురంలో జరిగిన ఐఏబీ సమావేశంలో విజయమ్మ, నేను సీబీఆర్, పైడిపాలెం నీటి విషయమై అధికారులను నిలదీస్తుంటే.. అడ్డుకున్న సతీష్‌రెడ్డి ఇప్పుడు నీటి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో లింగాల ఎంపీపీ సుబ్బారెడ్డి, పులివెందల మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, పట్టణకన్వీనర్ వరప్రసాద్, తొండూరు నాయకులు రవీంద్రనాథరెడ్డి, రామమునిరెడ్డి, రసూల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం ప్రైవేటుకు అప్పగించొద్దు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మధ్యాహ్నభోజన పథకం నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.స్వరూపారాణి డిమాండ్ చేశారు. మధ్యాహ్నభోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్‌లో గురువారం ఆందోళన చేశారు. స్వరూపారాణి మాట్లాడుతూ పథకం కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. 2003 నుంచి పనిచేస్తున్న కార్మికులను కాదని, నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రైవేటు సంస్థలకు అప్పగించారన్నారు. పథకం నిర్వాహణకు అవసరమైన స్థలం, కిచెన్ షెడ్లు ఏర్పాటుకు కావాల్సిన నిధులను ప్రభుత్వమే సమకూరుస్తోందన్నారు. ఇది సరైన విధానం కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులపై రాజకీయ ఒత్తిళ్లను అరికట్టాలని కోరారు. ప్రైవేటు సంస్థలకు పథకాన్ని అప్పగించడం వల్ల 80 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, మద్యాహ్నభోజన పథకం కార్మికుల యూనియన్ అధ్యక్షురాలు వరలక్ష్మీ, ఉపాధ్యక్షురాలు ఎన్సీహెచ్ సుప్రజ, కార్యదర్శి డి.రమాదేవి, నాగరాణి, నాగమణి, వెంకటలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
‘హోదా’ ధర్నా రేపు
శ్రీకాకుళం అర్బన్: నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని కలెక్టరేట్ వద్ద మార్చి ఒకటో తేదీన చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన తర్వాత నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమ బాటలో పయనించాలంటే ప్రత్యేకహోదా ఎంతో అవసరమన్నారు. రాష్ట్రానికి హోదా సంజీవని వంటిదని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మొదటినుంచి చెబుతూనే ఉన్నారన్నారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధిస్తామని చంద్రబాబు, మోదీలు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకహోదా ఊసే లేదన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో చంద్రబాబు అవినీతి, అన్యాయ పాలన సాగుతోందన్నారు. ఇసుక, మద్యం, కరెంటు, రాజధాని భూములు, దేవుడి మాన్యాలు, ఇలా ప్రతి ఒక్కటీ చంద్రబాబు, ఆయన మంత్రులు దోచుకుంటుంటే కింది స్థాయిలో పెన్షనర్లు, రేషన్‌కార్డులు, మరుగుదొడ్లు, నీరు–చెట్టు తదితర వాటిల్లో జన్మభూమి కమిటీల సభ్యులు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు దుర్మార్గపాలన, దిగజారుడు రాజకీయాలు ఏ స్థాయికి చేరుకుందంటే అవినీతి, అక్రమాలతో సంపాదించిన సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడేటట్లు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలంతా ప్రత్యేకహోదా కోరుతుంటే బాబు తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకే మొగ్గు చూపారన్నారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఎక్కడ తన కేసులు తిరగదోడతారనే భయంతో చంద్రబాబు ఆ ప్రయత్నమే చేయలేదన్నారు. ప్రత్యేకహోదా సంజీవని అని, హోదాతో చేకూరే లాభాలు, ప్రయోజనాలను విద్యార్థులకు, ప్రజలకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వివరిస్తూ ప్రతి జిల్లాలో యువభేరి కార్యక్రమాలను నిర్వహించారన్నారు. ఈ సదస్సులకు విద్యార్థులు రాకుండా టీడీపీ అడ్డుకునే సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. హోదా కోసం ఉద్యమించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని చంద్రబాబే స్వయంగా హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోరుతూ బంద్ చేస్తే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను, వామపక్ష పార్టీల నాయకులను ముందస్తుగా గృహనిర్బంధాలు, అరెస్ట్‌లు చేసి జైళ్లలో పెట్టడం వంటివి చేశారన్నారు. హోదా వలన ప్రయోజనాలు లేవని, ప్రత్యేక ప్యాకేజీతోనే అభివృద్ధి అని చంద్రబాబు చెప్పి దానికే మొగ్గు చూపారన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఎన్నడూ హోదా కోసం మాట్లాడిన సందర్భం లేదన్నారు. గత ఏడాది కేంద్రబడ్జెట్ ప్రకటిస్తే అన్ని రాష్ట్రాల కంటే మనకే అధికంగా నిధులు కేటాయించారని చంద్రబాబు గొప్పలు చెప్పారని, 2018 కేంద్ర బడ్జెట్ ప్రకటించినపుడు కూడా మాట్లాడని చంద్రబాబు 17 రోజుల తర్వాత కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపణలు చేయడం అతని దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ప్రత్యేకహోదా కోరుతూ టీడీపీ ప్రభుత్వంపై ప్రజలంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో చంద్రబాబు మాటమార్చి ప్రత్యేకహోదా కోసం కొత్త పల్లవి అందుకోవడం శోచనీయమన్నారు. ప్రత్యేకహోదా కోరుతూ ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తన పార్టీకి చెందిన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పారని, అందుకోసం గడువు కూడా విధించారన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రానికి హోదా కోరుతూ మార్చినెల 1వ తేదీన శ్రీకాకుళంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నామన్నారు. ఈ ధర్నాకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, వైఎస్సార్ అభిమానులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులంతా పాల్గొని విజయవంతం చేయాలని తమ్మినేని పిలుపునిచ్చారు. హోదాతోనే ఉజ్వల భవిష్యత్ పాతపట్నం: రాష్ట్ర ప్రజల మెరుగైన భవిష్యత్‌కు ప్రత్యేక హోదా ఒక్కటే శరణ్యమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 1న కలెక్టరేట్ వద్ద ధర్నాకు సంబంధించి నియోజకవర్గ ప్రణాళికను మంగళవారం స్ధానిక పంచాయతీ రాజ్ బంగ్లాలో సిద్దం చేశారు. అనంతరం ఆమే విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు హోదా అనే ఆకాంక్షతో బతుకుతున్నట్లు పేర్కోన్నారు. నాలుగేళ్లు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు హోదా కోసం పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. చివరి కేంద్ర బడ్జెట్ కూడా వచ్చిందున దానిలో రాష్ట్రానికి ఎలాంటి వరాలు లేనందున ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే నిరసనలు ఉధృతం చేస్తున్నాట్లు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుది రెండు నాల్కల దోరణి అని, నాలుగేళ్లుగా ప్రజలకు ఇలాగే మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కావాలని, సీఎం అయ్యాక హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అని, మళ్లీ ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుండంతో హోదా కావాలని కపట నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. రెండు నాల్కల దోరణితో ప్రజలను వంచించొద్దన్నారు. హోదా సాధించాల్సిన సమయం ఆసన్నమైందని, దానికోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనా మాలు సైతం చేస్తున్నారని, టీడీపీ ఎంపీలు మాత్రం రాష్ట్రం లో ఒకలా, డిల్లీలో ఒకలా నటిస్తున్నారని విమర్శించారు. హోదా కోసం మార్చి 1న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని, దాని విజయవంతం కోసం అందరూ పెద్ద ఎత్తు న తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ పోరాటానికి విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలవాలని ఆమే కోరారు. కార్యక్రమంలో పాతపట్నం, మెళియాపుట్టి మండల కన్వీనర్లు రెగేటి షణ్ముఖరావు, పాడి అప్పారావు, పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగపు ప్రధాన కార్యదర్శి యరుకొల వెంకటరమణ, రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శి కొండాల అర్జునుడు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి, సభ్యులు కే.జానకమ్మ, బి.వరలక్ష్మి, కే.పద్మ, మండల ప్రధాన కార్యదర్శి పీ.వి.వి కుమార్, రెడ్డి రాజు, కే.రమణ పాల్గొన్నారు. -
నిట్ వద్ద ఆందోళన
తాడేపల్లిగూడెం రూరల్ : జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్)లో ర్యాగింగ్‌కు పాల్పడి క్రమశిక్షణ చర్యలకు గురైన బాధిత విద్యార్థులు, సహచర విద్యార్థులు సంయుక్తంగా మంగళవారం పెదతాడేపల్లిలోని ఏపీ నిట్ తాత్కాలిక ప్రాంగణంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా 2వ తేదీన జరిగిన సంఘటన ర్యాగింగ్ కాదంటూ... ర్యాగింగ్‌కు గురైనట్టు పేర్కొంటున్న విద్యార్థి ఫిర్యాదు ఉపసంహరించుకున్నా బాధిత విద్యార్థులను డిబార్ చేయడం, హాస్టల్లో ఉండనివ్వకపోవడం వంటి సంఘటనలు, ర్యాగింగ్ చట్టం కింద విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం వెళ్లడంతో ఈ ఆందోళన చేపట్టారు. బాధిత విద్యార్థులకు ద్వితీయ, తృతీయ సంవత్సరం సహచర విద్యార్థులు మద్దతు పలకడంతో సుమారు 300 మంది వరకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ఉదయం 9.45 గంటల నుంచి తరగతులను బహిష్కరించి నిట్ పరిపాలనా భవనం ఎదుట ఆందోళనకు దిగారు. సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది. విద్యార్థులతో చర్చలు నిట్ రెసిడెంట్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఇతర అధ్యాపక సిబ్బంది విద్యార్థులను సముదాయించే ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో తాడేపల్లిగూడెం రూరల్ ఎస్సై బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిట్ అధికారులు మరోసారి విద్యార్థులతో భేటీ అయ్యారు. విద్యార్థులు తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా అందజేశారు. క్రమశిక్షణ చర్యల్లో మదింపు, విద్యార్థులకు న్యాయం చేసేలా వరంగల్ నిట్ ఉన్నతాధికారులతో మాట్లాడతామని భరోసా ఇవ్వడంతో పాటు ప్రత్యక్షంగా వారి విజ్ఞప్తిని ఢిల్లీలోని ఎంహెచ్ఆర్డీకి ఈ మేరకు మెయిల్ చేశారు. వి ద్యార్థులు ఆందోళన విరమించారు. ఒకానొక సమయంలో సమస్య పరి ష్కారం కాని పక్షంలో ఆత్మహత్యలకు సైతం సిద్ధమంటూ విద్యార్థులు హెచ్చరించారు. దీంతో ఓ సమయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఎట్టకేలకు చర్చలు ఫలించడంతో నిట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
దద్దరిల్లిన దేవరపల్లి
గుండుగొలను–కొవ్వూరు రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలకు నిరసనగా దేవరపల్లిలో విద్యార్థులు మంగళవారం రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. వివిధ విద్యాసంస్థలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు, అధ్యాపకులు గ్రామంలో శాంతి ర్యాలీ నిర్వహించి అనంతరం మూడు రోడ్ల కూడలిలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడకు వచ్చిన సీఐ శరత్రాజ్కుమార్ను విద్యార్థులు ప్రమాదాలపై ప్రశ్నించారు. దేవరపల్లి: గుండుగొలను–కొవ్వూరు రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలకు నిరసనగా దేవరపల్లిలో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు మంగళవారం రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. సోమవారం సాయంత్రం దేవరపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక భూపతిరాజు విద్యాసంస్థలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న జీజే విక్టర్‌బాబు దుర్మరణం చెందడాన్ని విద్యార్థులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. విక్టర్‌బాబు మృతికి సంతాపంగా భూపతిరాజు విద్యాసంస్థలతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో గ్రామంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మూడు రోడ్ల కూడలిలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో, ధర్నా చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆందోళన కొనసాగడంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విక్టర్‌బాబు కుటుంబానికి న్యాయం చేయాలని, కలెక్టర్ రావాలని, గుండుగొలను–కొవ్వూరు మధ్య భారీ వాహనాలను నిషేధించా లని, రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కొవ్వూరు రూరల్ సీఐ శరత్‌రాజ్‌కుమార్ నచ్చజెప్నేందుకు ప్రయత్నించినా ఆందోళనకారులు వినకపోవడంతో కొద్దిసేపు వీరిమధ్య వాగ్వాదం జరిగింది. న్యాయం జరిగే వరకూ కదిలేది లేదని విద్యార్థులు భీష్మించారు. సీఐ శరత్‌రాజ్‌కుమార్, తహసీల్దార్ వై.రవికుమార్, ఎస్సై పి.వాసు, ఎంపీడీఓ కె.కోటేశ్వరరావు గ్రామస్తులు, విద్యాసంస్థ చైర్మన్ సువర్ణరాజుతో చర్చలు జరిపారు. ప్రజల డిమాండ్‌ను ఉన్నతాధికారులకు వివరించామని, భారీ వాహనాల నిలుపుదలకు చర్యలు తీసుకుం టామని హామీ ఇవ్వడంతో ఆందోళన కారులు శాంతించారు. రాజకీయ పార్టీల సంఘీభావం ఆందోళనకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, టీడీపీ నాయకులు సుంకర దుర్గారావు, కరుటూరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పచ్చా గోపీ, జనసేన నాయకులు మాధవరపు వెంకటేశ్వరరావు, గంగాడ నాని, చప్పటి శివ, సొసైటీ ఉపాధ్యక్షుడు దుగ్గిన సూర్యచంద్రరావు ధర్నాలో పా ల్గొని విద్యార్థులకు సంఘీభావం తెలి పారు. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలం టే భయంగా ఉందని, ప్రాణాలకు గ్యా రంటీ లేదని తలారి వెంకట్రావు, సుంకర దుర్గారావు అన్నారు. ఈజీకే రోడ్డుపై ప్రమాదాలకు నిరసనగా కొవ్వూరు నుం చి ఏలూరు కలెక్టరేట్‌కు పాదయాత్ర చే యాలని జనసేన నాయకులు నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల వలయంలో దేవరపల్లి దేవరపల్లి పోలీసుల వలయంలో ఉంది. సుమారు 100 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. గ్రామంలో పలుచోట్ల పోలీ స్ పికెట్లు ఏర్పాటుచేశారు. రెండు రోజు లు పికెట్లు కొనసాగుతాయని పోలీసులు చెప్పారు. -
సీఆర్డీఏ కుంభకోణంపై సీపీఎం ధర్నా
-
రోడ్డెక్కిన స్కీం వర్కర్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా, ఏ అభివృద్ధి పథకాన్ని అమలు చేసినా విజయవంతం చేసేది స్కీం వర్కర్లే. పగలనక, రాత్రనక కష్టపడితేనే అవి లబ్ధిదారులకు అంది, ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుంది. ఎంతో మందికి మేలు చేస్తున్న స్కీం వర్కర్ల జీవితాలు అట్టడుగున ఉంటున్నాయి. కనీస జీతానికి, వసతులకు నోచుకోకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కనీస వేతనం ఇవ్వాలని, పింఛన్, గ్రాట్యూటీ, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మంగళవారం రోడ్డెక్కారు. ఆందోళనను భగ్నం చేసేందుకు పాలకులు కుట్ర పన్నినా వెరువక ధర్నాలు, మానవహారంతో జయప్రదం చేశారు. సాక్షి, విజయవాడ: ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు ఆందోళనకు దిగారు. నగరంలోని ధర్నా చౌక్‌లో కార్మికులు నిరసన తెలిపారు. మచిలీపట్నం కోనేరు సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. మండలాల కేంద్రాల్లో నిరసన తెలిపి అధికారులకు వినితిపత్రాలు అందజేశారు. ఆందోళనలో అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, సాక్షర భారతి, సర్వశిక్షాభియాన్, 2వ ఏఎన్ఎం, కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్‌లలో పనిచేసే వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు. మానవహారం విజయవాడ ధర్నాచౌక్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేషు, సీఐటీయు కార్యదర్శి బేబి రాణి, ఎన్సీహెచ్ సుప్రజ, ఎ.కమల పాత్రుడు ఐఎఫ్టీయు నాయకులు రామారావు ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కీమ్స్‌లో పనిచేసేవారిని కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. బందరులో.. బందరు కోనేరు సెంటర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. బస్టాండ్ నుంచి కోనేరు సెంటర్ వరకు స్కీమ్ వర్కర్లు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్క్‌ర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి.రెజీనారాణి, నాయకురాలు రమాదేవి పాల్గొన్నారు. పెడన నియోజకవర్గం బంటుమిల్లిలో విధులు బహిష్కరించి మానవహారం నిర్వహించారు. నూజీవీడు సబ్‌కార్యాలయం వద్ద వర్కర్లు ధర్నా నిర్వహించారు. కంకిపాడు, తిరువూరు, పెడన, పామర్రు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లోని మండల కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు జరిగాయి. అణచివేసేందుకు కుట్ర.. స్కీమ్ వర్కర్స్ సమ్మెను ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నించింది. రెండు రోజులు ముందు నుంచి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకంలోని యూనియన్ నాయకులను పిలిచి ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ అధికారులు హెచ్చరించారు. విజయవాడ, బందరులో కొంతమందిపై కేసులు పెడతామంటూ బెదిరించారు. అయినా కార్మికులు సమ్మెలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్మికులకు మద్దతు.. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న స్కీం వర్కర్లు, విద్యుత్ కార్మికుల ఆందోళనకు అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్టీయూ) మద్దతిస్తుందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జె.కిషోర్‌బాబు ప్రకటించారు. ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న విద్యుత్ కార్మికులు తలపెట్టిన సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తున్నామన్నారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న నిర్వహించనున్న జైల్‌భరో కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. డిమాండ్స్.. కనీస వేతనం రూ.18,000 ఇవ్వాలని, పెన్షన్ రూ.3000, పీఎఫ్, గ్రాట్యూటీ, వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్లలో ప్రధానమైనవి. ప్రభుత్వ పథకాలకు 2018–19లో నిధులు పెంచాలని, పథకాల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. -
నిత్యానంద ఆశ్రమంలో ఆ ఇద్దరిని విడిపించండి!
తిరువణ్ణామలై: తిరువణ్ణామలైలోని నిత్యానంద ఆశ్రమంలో నిర్బంధించిన తన కుమారుడు, మనవరాలిని విడిపించాలని కోరుతూ దంపతులు ఆశ్రమం ముందు ధర్నా నిర్వహించారు. వివరాలు.. తేని జిల్లా పెరియకులం వడకరై సుబ్రమణ్య వీధికి చెందిన కార్తి రైతు, ఇతని భార్య ఈశ్వరి. దంపతుల కుమారుడు మనోజ్‌కుమార్, కుమార్తె వనిత ఉన్నారు. మనోజ్‌కుమార్ మేలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం మదురైలోని నిత్యానంద ధ్యాన మండపానికి వెళ్లిన మనోజ్ తిరిగి రాలేదు. ఈ స్థితిలో మనోజ్‌కుమార్ తిరువణ్ణామలై గిరివలయం రోడ్డులోని నిత్యానంద ఆశ్రమంలో ఉన్నట్లు అందిన సమాచారం మేరకు తల్లిదండ్రులు ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. అయితే వారిని ఆశ్రమ సిబ్బంది లోనికి అనుమతించలేదు. మనోజ్‌కుమార్ బెంగళూరులోని ఆశ్రమంలో ఉన్నాడని, ధ్యానంలో ఉన్నందున చూసేందుకు వీలుకాదని అక్కడి సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. మనోజ్‌కుమార్‌తో పాటు తమ మనవరాలు నివేద(17) (వనిత కుమార్తె)ను ఆశ్రమంలో నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నట్టు ఆరోపించడంతో వారిని సిబ్బంది అక్కడినుంచి వెల్ల్లగొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్రమం వద్దకు చేరుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో ఆశ్రమ సిబ్బంది తాము ఎవ్వరినీ బలవంతంగా నిర్బంధించలేదని, భక్తులు స్వయంగా వచ్చి ధ్యానంలో పాల్గొంటున్నారని ఆధారాలతో తెలిపారు. ఇలాఉండగా మనోజ్ తల్లిదండ్రులు విలేకరులతో మాట్లాడుతూ తన కుమారుడు, మనవరాలిని ఆశ్రమంలో నిర్బంధించారని వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారనే విషయం కూడా తమకు తెలియరాలేదన్నారు. వనిత మాట్లాడుతూ మదురైలో జరిగిన నిత్యానంద ధ్యాన శిక్షణలో తాను కుమార్తె సహా పాల్గొన్నట్టు తెలిపారు. ఒక నెల ప్రత్యేక ధ్యానం అని చెప్పి తమను తిరువణ్ణామలై ఆశ్రమానికి తీసుకొచ్చారన్నారు. ఆ సమయంలో తన తండ్రికి అనారోగ్యం అని తెలియడంతో ఆశ్రమంలో రూ.3లక్షలు చెల్లించి కుమార్తెను ఇక్కడే వదిలి ఇంటికి వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం తన కుమార్తెను చూసేందుకు కూడా ఆశ్రమ నిర్వాహకులు అనుమతించడం లేదన్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఎస్టీల్లో చేర్చాలంటూ మత్స్యకారులు దర్నా
-
నేటి నుంచి మటన్ అమ్మకాలు బంద్
సీతంపేట(విశాఖ ఉత్తర): హనుమంతవాకలో ఉన్న మేకల కబేలాను నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారికవలసకు తరలించిన నేపథ్యంలో నిరసనగా ఆదివారం నుంచి మటన్ విక్రయాలు నిలిపివేస్తున్నట్టు మటన్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. అసోసియేషన్ అధ్యక్షుడు కిలాని అప్పారావు మాట్లాడుతూ తగరపువలస నుంచి పెందుర్తి, గాజువాక వరకు ఉన్న 700 మటన్ షాపులు బంద్‌లో పాల్గొంటాయన్నారు. హనుమంతవాకలో కబేలా తెరిచేలా స్పష్టమైన హామీ వచ్చే వరకు బంద్ కొనసాగిస్తామన్నారు. కబేలా తరలించడం వల్ల వ్యాపారాలు సరిగ్గా సాగక 6700 మంది గొర్రెల పెంపకం దారులు, సుమారు 10 వేల మంది మటన్ వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హనుమంతవాకలో ఉన్న స్థలంలో రెండస్తుల భవనం నిర్మించి, పార్కింగ్, వాటర్ సదుపాయాలతో అత్యాధునిక కబేలాను నిర్మించి అందుబాటులోకి తేవాలని కోరారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి హనుమంతవాక కబేలా వద్ద నిరసన చేపడతామన్నారు. మటన్ వ్యాపారులంతా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. -
కుమారుడి ఇంటివద్ద తల్లి ధర్నా
జగద్గిరిగుట్ట: కుమారుడు ఇంట్లోకి తనను రానివ్వడం లేదని ఓతల్లి ధర్నాకు దిగింది. వివరాలు.. జగద్గిరిగుట్టలోని జగద్గినగర్లో శనివారం ఆర్. రమా దేవి(60)తన కొడుకు దేవేందర్ తనను ఇంటి నుంచి వెళ్లగొట్టి ఇంట్లోకి రానివ్వడం లేదని శనివారం తన కూతుర్లు ఇందిరా, జయలతో కలిసి తన ఇంటి ముందు బైఠాయింది. సంవత్సర కాలంగా తల్లి కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రమేదేవి ఇదే ప్రాంతంలో శ్రీనివాస్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటుంది. నాయకులను సంప్రదించినా న్యాయం చేయడం లేదని రమాదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లి ఇంటి ముందు బైఠయించడంతో ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు లు సంఘటన స్థలానికి చేరుకుని «ధర్నా విరమింప జేశారు. ఈ ఇల్లు తనదని తన ఇల్లు తనకు ఇప్పించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. -
ప్రేమ పేరిట నయవంచన
తిరుత్తణి: ప్రేమ పేరిట నయవంచన చేసిన యువకుడిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. తిరుత్తణి మండలం తెక్కళూరు దళితవాడకు చెందిన యువతి(27) ఎంఏ పట్టభద్రురాలు. తిరుత్తణిలోని ప్రయివేటు కళాశాలలో బీఎడ్ చదువుతోంది. ఈమెకు అదే గ్రామానికి చెందిన ధనపాల్(28)తో పరిచయం ఏర్పడింది. ధన్పాల్ అరక్కోణంలో ప్రయివేటు బ్యాంకు ఉద్యోగి. ఒకే తెగకు చెందిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఈ స్థితిలో యువతి గర్భం దాల్చింది. తనను త్వరగా వివాహం చేసుకోవాలని యువతి ప్రియుడిపై ఒత్తిడి తెచ్చింది. వివాహం ముందు గర్భం దాల్చిన విశయం తన ఇంట్లో తెలిస్తే పెళ్లికి అనుమతించరని, అబార్షన్ చేయించుకున్న తరువాత వివాహం చేసుకుంటానని ధనపాల్ ప్రియురాలిని నమ్మించాడు. తనకు తెలిసిన నర్సు సాయంతో ఓ ఇంట్లో అబార్షన్ చేయించాడు. అనంతరం ప్రియురాలిని వావాహం చేసుకునేందుకు తిరస్కరించాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆరు నెలల గర్భం సమయంలో అబార్షన్‌తో తాను అనారోగ్యం పాలైనట్లు, ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలని తిరుత్తణి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై పోలీసులు చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం బాధితురాలు తిరుత్తణి మహిళా స్టేషన్ ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. ఆమెకు మద్దతుగా 25 మంది బంధువులు సైతం ధర్నాకు దిగారు. పోలీసులు వారితో చర్చలు జరిపి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. పరారీలో ఉన్న ధనపాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అందాల పోటీలను ఆపకుంటే ఉద్యమిస్తాం
ఒంగోలు టౌన్: మహిళలను మనుషులుగా కాకుండా వారి అందచందాలపై వ్యాపారం చేసి సొమ్ము చేసుకోవాలనుకోవడం దుర్మార్గమైన చర్య..అని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. పద్మ ధ్వజమెత్తారు. విశాఖలో బ్యూటీ కంటెస్టు పేరుతో నిర్వహించనున్న అందాల పోటీలను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. పీఓడబ్ల్యూ, పీడీఎస్‌యూ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల సాధికారిత గురించి, వారి అభివృద్ధి గురించి నిత్యం మాట్లాడే తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల వ్యాపార ప్రకటనల కోసం అందాల పోటీలను నిర్వహించడం వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనన్నారు. ప్రజా రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పదేళ్ల క్రితం ఒంగోలులో కూడా అందాల పోటీలను నిర్వహించతల పెడితే అన్ని సంఘాలు వ్యతిరేకించి ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రమలో, సంపద ఉత్పత్తిలో సగభాగంగా ఉన్న మహిళలు, వారి అస్తిత్వాన్ని గుర్తించకుండా సెక్స్ సింబల్‌గా చూసే ధోరణి మారాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు బడుగు ఇందిర మాట్లాడుతూ కారు షెడ్లో ఉంటేనే భద్రంగా ఉంటుందని, అదే మాదిరిగా మహిళలు వంటింట్లో ఉంటేనే రక్షణ ఉంటుందని మాట్లాడే నాయకులు ఉండటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో మహిళపై అత్యాచారం జరిగితే పట్టించుకోని నాయకులు, అందాల పోటీలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించి అలాంటి సంస్కృతిని ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఎస్.భారతి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావలి సుధాకరరావు, పౌరసమాజం నాయకుడు జి.నరసింహారావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణోదయ అంజయ్య, కోశాధికారి ఎన్.సామ్రాజ్యం, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, పీవైఎల్ రాష్ట్ర నాయకుడు ఎన్.నాగరాజు, ఏఐకేఎంఎస్ నాయకుడు కె. హనుమంతురావు, మహిళా నాయకులు సీహెచ్ పద్మ, సీతారావమ్మ, కాశమ్మ పాల్గొన్నారు. -
ఆర్ఎంపీలకు లైసెన్సా?
కర్నూలు(హాస్పిటల్): తాము 15 సంవత్సరాలు కష్టపడి చదివి డిగ్రీలు సంపాదిస్తున్నామని, కానీ వైద్యం చేసేందుకు ఎలాంటి అర్హత లేని ఆర్ఎంపీలకు ఎలా లైసెన్స్ ఇస్తారని సీనియర్, జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే జీవో నెం.465ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మెడికల్ కాలేజీలోని సీఎల్జీ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆసుపత్రి ఆవరణ నుంచి మెడికల్ కాలేజీ మీదుగా రాజవిహార్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ వైద్యవిద్యార్థులు మానవహారం, రాస్తారోకో నిర్వహించి, తెలుగునాడు పార మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కలెక్టరేట్ చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూడా కాసేపు రాస్తా ఆందోళన చేసి కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ రెండు రోజుల్లోగా తమ డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 52వేల మంది ఆర్ఎంపీల ఓట్ల కోసం తెలుగుదేశం ప్రభుత్వం వారు వైద్యం చేసేందుకు లైసెన్స్‌లు మంజూరు చేస్తోందని విమర్శించారు. వారు చేసే వైద్యంతో వేలాది మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. పైగా జూనియర్ డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం లేదని తమను విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల పోస్టులు కాంట్రాక్టు పద్ధతిన గాకుండా రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తే గ్రామాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు జూడాలు తెలిపారు. అనంతరం జీఓ 465ను రద్దు చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు వినతి పత్రం సమర్పించారు. వీరి ఆందోళనకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ రామకృష్ణనాయక్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శివశంకర్‌రెడ్డి, డాక్టర్ సి. మల్లికార్జున, కోశాధికారి డాక్టర్ రంగయ్య, జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు అనుదీప్, దీరజ్, శ్రీహరి, శివప్రసాద్, సతీష్ తదితరులు మద్దతు తెలిపి పాల్గొన్నారు. -
పోస్టర్ యుద్ధం
తమను మావోయిస్టులుగా చిత్రీకరించడం ద్వారా పోలీసులు, ప్రభుత్వం మహిళా ఉద్యమాలను అణదొక్కుతున్నారని ఆరోపిస్తూ మహిళా చేతన, చైతన్య మహిళా సంఘం తదితర సంఘాల ధర్నా.. అదే సమయంలో ఈ సంఘాల సభ్యుల ఫొటోలతో కూడిన బ్యానర్లతో గిరిజనులతో పోలీసులు నిర్వహించిన ర్యాలీ.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ రెండు వర్గాలు తారసపడటంతో బుధవారం అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. తమ ఫొటోలున్న బ్యానర్లను మహిళా సంఘాల ప్రతినిధులు లాక్కొని.. దహనం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రతిఘటించిన వారిని ఈడ్చుకుంటూ వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా పలువురు మహిళా సంఘాల ప్రతినిధులను అరెస్టు చేయడంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల చర్యలను నిరసిస్తూ పలు సంఘాలు పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా చేశారు. ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): మహిళలని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకుంటూ వ్యాన్ ఎక్కించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని దౌర్జన్యంగా లాక్కెళ్లారు. ధర్నా టెంట్లను పడగొట్టారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఒకానొక సమయంలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. తమ సభ్యులు మవోయిస్టులకు అనుకూలంగా పనిచేస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వం పోస్టర్ల ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ బుధవారం జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) పలు మహిళా సంఘాలు, వామపక్ష నాయకులతో కలిసి ధర్నా నిర్వహించింది. అదే సమయంలో అరుకు, పాడేరు మండలాల నుండి వచ్చిన కొంత మంది గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వారు పట్టుకున్న బ్యానర్లపై మావోయిస్టులుగా సీఎంఎస్ నేతలు రాజేశ్వరి, అన్నపూర్ణ, లలిత, పద్మ, రాధ ఫొటోలు ఉండటంతో సీఎంఎస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. మావోయిస్టులతో తమకు సంబంధం ఉందని నిరూపించగలరా అని సవాల్‌చేశారు. వారికి వ్యతిరేకంగా ముద్రించిన ప్లెక్సీలను తగలబెట్టారు. సీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ తమకు వ్యతిరేకంగా పోలీసులే కొందమంది గిరిజనులను తీసుకువచ్చారని, ప్లెక్సీలు, బ్యానర్లు ముద్రించారని పేర్కొన్నారు. హింసకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ మహిళల్ని చైతన్య పరుస్తున్న సీఎంఎస్ నాయకులను నిర్బంధించడానికే ‘ఆదివాసీ విద్యార్థి సంఘం, విద్యార్థినీ చైతన్య పేరు మీద తమ కార్యకర్తలపై మావోయిస్టులనే ప్రచారం చంద్రబాబు ప్రభుత్వం చేయిస్తోందన్నారు. తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులు ఇలాంటి చౌకబారు పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు, విజయవాడ తదితర చోట్ల కూడా తమ గురించి పోస్టర్లు వేయడంతో అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా విశాఖలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఇక్కడ కూడా పోలీసులు రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా ఉద్యమాలను అణచడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.మావోయిస్టులకు వ్యతిరేకంగా అరుకు నుంచి వచ్చిన భవానీ అనే మహిళ మాట్లాడుతూ పోలీసులకు సమాచారం ఇస్తున్నారనే నేపంతో తమ గిరిజనులను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు కోసం పోరాడుతున్నామని చెప్పే మావోలు ఆ ప్రజలనే దండిస్తున్నారన్నారు.ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి ఎం.లక్ష్మి తదితరులు మాట్లాడారు. అనంతరం మహిళా సంఘం చేస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. వారిని ఈడ్చుకుంటూ వ్యాన్ ఎక్కించారు. ధర్నాలో పలు మహిళా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్లెక్సీలు తగలబెడుతున్న మహిళా సంఘాల ప్రతినిధులు మహిళా సంఘాల నిరసన అల్లిపురం: మహిళా సంఘాల ప్రతినిధుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మహిళా సంఘాల నాయకులు బుధవారం సాయంత్రం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళా చేతన కార్యదర్శి కత్తి పద్మ, ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి ఎం.లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రతినిధి ఎ.విమల, చైతన్య మహిళా సంఘం ప్రతినిధి ఎస్.అనిత, విరసం ప్రతినిధి కృష్ణబాబు, పౌర హక్కుల సంఘం ప్రతినిధి పి.అప్పారావులు మాట్లాడుతూ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తున్న శిబిరంపై దాడిచేశారని ఆరోపించారు. అక్రమంగా అరెస్ట్‌లు చేశారన్నారు. -
సెక్స్ వర్కర్ల ధర్నా
బెంగళూరు(బనశంకరి) : ప్రభుత్వానికి ఎమ్మెల్సీ జయమాల అందించిన నివేదికను వ్యతిరేకిస్తూ కర్ణాటక సెక్స్‌వర్కర్లు శనివారంటౌన్హాల్ వద్ద ధర్నాకు దిగారు. ఆందోళనకారులు మాట్లాడుతూ ప్రభుత్వానికి అందించిన నివేదికలో సెక్స్వర్కర్లును కించపరిచే అంశాలున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం జయమాల నివేదికను అమలు చేయరాదని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. -
అధికార మదం.. అధికారులపై అదే అహం
సాక్షి, రాజమహేంద్రవరం : టీడీపీ నేతలు చేస్తున్న ఘనకార్యాలు, ఆ కార్యాలను సజావుగా నడిపేందుకు పోలీసులను ఎలా వాడుకుంటోంది పై రెండు ఘటనలు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఆదెమ్మదిబ్బ ఆక్రమణలపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇస్తున్నా అధికారం అండతో ముందుకే పోతున్నారు. అధికారులు కూడా ప్రేక్షకపాత్రనే పోషిస్తున్నారు. ఆ ఘటన మరిచిపోకముందే 8వ తేదీన రాజమహేంద్రవరంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ ఓ ట్రాఫిక్ మహిళా ఎస్పై విధుల్లో భాగంగా ఓ వ్యక్తికి రూ.100 జరిమానా విధిస్తే చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అధికారం మాది ... మాకే జరిమానా వేస్తావా అంటూ ఎదురు తిరగడమే కాకుండా ‘నేనెవరో తెలియదా’ అంటూ చిందులు తొక్కారు. ఆ పోలీసు అధికారి ‘మీరు ఎవరో నాకు తెలియదు’ అనడంతో నానా రచ్చ చేశారు. అధికార పార్టీ నేతనైన తనను ఎవరో తలియదంటుందా అంటూ సదరు నేత ఘటన జరిగిన ప్రాంతమైన కంబాల చెరువు నుంచి రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి జాంపేటలోని ట్రాఫిక్ డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఆదెమ్మదిబ్బ ఆక్రమణ విషయంలో ‘తమ ఇళ్లు తొలగిస్తున్నారు.. మా ఆస్తిని కాజేశారు’.. అని పేదలు మొరపెట్టుకున్నా పట్టించుకోని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు ఈ విషయంలో మాత్రం ‘తమ నేతకు అవమానం జరిగిందం’టూ పోలీస్ స్టేష¯ŒS వద్దకు చేరుకున్నారు. స్టేష¯ŒS ముందు భారీ ధర్నా చేశారు. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని’ డిమాండ్ చేశారు. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు నగరంలోని నాలుగు స్టేషన్ల సీఐలు, ఎస్పైలు తమ విధులను మధ్యలోనే ఆపేసి అక్కడకు చేరుకుని దాదాపు మూడు గంటల పాటు అక్కడే ఉన్నారంటే టీడీపీ నేతలు ఏ స్థాయిలో రచ్చ చేశారో అర్థం చేసుకోవచ్చు. రూ. 5000 లంచం తీసుకుంటున్నా రంటూ ఫిర్యాదు... అంతటితో ఆగకుండా మరుసటి రోజు అంటే 9వ తేదీన అర్బ¯ŒS ఎస్పీని కలసి మొత్తం ట్రాఫిక్ విభాగంపై ఫిర్యాదు చేశారు. మీ సిబ్బంది తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులు లంచాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ÐÜఎం చంద్రబాబు రోజుకు 18 గంటలు కష్ట పడుతుంటే ఇలాంటి అధికారుల చర్యల వల్ల తమ ప్రభుత్వం పట్ల చులకన భావం ఏర్పడుతోందని అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారిని ముందు లబలబలాడారు. జరిమానాకు... లంచానికీ తేడా తెలియని వైనం నగరంలో రోజుకు నాలుగైదు మద్యం తాగి వాహనం నడిపిన కేసులు నమోదవుతున్నాయి. ఏ రోజుకారోజు ఈ కేసులను రాజమహేంద్రవరం సెంకడ్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారిస్తున్నారు. మెజిస్ట్రేట్ జరిమానా విధించిన తర్వాత పోలీసులు ఆ వాహనాలను వదిలేస్తున్నారు. నవంబర్‌లో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ పదవీ విరమణ చేశారు. ఈ బాధ్యతలు ఐదో మెజిస్ట్రేట్‌కు అదనంగా అప్పగించారు. తన విధులతోపాటు ఈ కేసులను విచారించడానికి న్యాయమూర్తి సోమ, శుక్రవారాలను పోలీసుల వినతి మేరకు కేటాయించారు. అయితే నవంబర్ ఐదున అనారోగ్యం కారణంగా న్యాయమూర్తి సెలవుపెట్టారు. రెండు, ఐదో మెజిస్ట్రేట్ బాధ్యతలను ఆరోక్లాస్ మెజిస్ట్రేట్‌కు ఇచ్చారు. దీంతో పని ఎక్కువ కావడంతో కేసులు పరిష్కారానికి నోచుకోవడంలేదు. మరో పక్క డ్రంక్ డ్రైవ్ కేసుల్లో దొరికిన వారు తమ వాహనాల కోసం ట్రాఫిక్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా వాహనాలను వెంటనే ఇచ్చే విధంగా నిందితులు రూ.5 వేలు బ్యాంకుల్లో ఎఫ్డీఆర్ చేసి ఆ పత్రాన్ని పోలీసులకు ఇచ్చి వాహనం విడిపించుకు వెళ్లేవిధంగా ఓ విధానాన్ని అమలు చేశారు. కేసు విచారించిన తర్వాత జరిమానా కట్టి ఎఫ్డీఆర్ పత్రాన్ని తీసుకెళ్లి రూ. ఐదు వేలు వాహనదారులు తీసుకోవచ్చు. అయితే నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ ఎఫ్‌డీఆర్‌ను బ్యాంకు సిబ్బంది కట్టించుకోవడం మానేశారు. కేసులు పెండింగ్ పడిపోతుండడంతో ఉన్నతాధికారుల సూచన మేరకు ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల నుంచి రూ.5వేలు నగదు తీసుకుని వాహనాన్ని ఇస్తున్నారు.దీన్ని లంచమ నుకొని ఫిర్యాదు చేయడం పట్ల పలువురు నవ్వుకుంటున్నారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్లు కలెక్టరేట్ ముట్టడి
వైఎస్సార్ సీపీతో పాటు పలు సంఘాలు సంఘీభావం కాకినాడ సిటీ : సమస్యల పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జాయింట్ యాక్ష¯ŒS కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముట్టడించారు. మందుగా కలెక్టరేట్ వద్ద నిరసన శిబిరంలో మధ్యాహ్నం వరకు డిమాండ్లతో కూడిన ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ గేటు మందు బైఠాయించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదించారు. శిబిరాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, సీఐటీయూ నాయకులు అజయ్‌కుమార్, ఏఐటీయూసీ నాయకులు తోకల ప్రసాద్, మాలమహానాడు జాతీయ అధ్యక్షులు ధనరాశి శ్యామ్‌సుందర్ తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆర్అండ్బీ అతిథిగృహంలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకి వినతిపత్రం ఇచ్చేందుకు జేఏసీ నాయకులు యార్లగడ్డ రాజచౌదరి, పి.వీరబాబు, కె.లక్ష్మిదేవి, దడాల శ్రీనివాస్, వాగు మాధవ్, కనకరాజు ఆద్వర్యంలోకాంట్రాక్ట్ లెక్చరర్లు వెళ్ళగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మంత్రికి విషయం చెప్పగా ఆయన కాంట్రాక్ట్ లెక్చరర్ల వద్దకు వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఈసందర్బంగా ఎమ్మెల్సీ సూర్యారావు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించక పోతే ప్రోగసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరుపున ఆమరణదీక్ష చేపడతానన్నారు. మానవతా దృక్పథం లేదు : కన్నబాబు కాంట్రాక్ట్ లెక్చరర్లపై ప్రభుత్వానికి కనీస సానేభూతి, మానవతా దృక్పథ ఆలోచనలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళనలో పాల్గొని మద్దతు పలికారు. ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్్సపై ఎలాంటి ఆందోళనలు చేసినా వైఎస్సార్ సీపీ వెన్నంటి ఉంటుందన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి దృష్టికి తీసుకువెళ్ళతానన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధానకార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్ధుల్ బషీరుద్ధీ¯ŒS తదితరులు పాల్గొన్నారు. -
గర్భస్థ మృతశిశువు తొలగింపులో జాప్యం
వైద్య సిబ్బందిపై గర్భిణి బంధువుల ఆగ్రహం ఆస్పత్రి ముందు ఆందోళన సరైన పరికరాలు లేవని కాకినాడ తరలింపు రాజమహేంద్రవరం క్రైం : మూడు రోజుల క్రితం కడుపులో మృతి చెందిన శిశువుతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యానికి నిరసనగా బందువులు ఆందోళన నిర్వహించారు. వివరాల ప్రకారం రాజమహేంద్రవరం రూరల్ నామవరం డి బ్లాక్‌కు చెందిన వంగలపూడి మంజు గర్భిణి. ఈమె కడుపులో ఉన్న శిశువుకు మూడు రోజులుగా కదలికలు ఆగిపోయాయి. దీంతో బంధువులు ఆదివారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని గైనకాలజీ వార్డుకు తీసుకువచ్చారు. ఉదయం 10 గంటలకు తీసుకువచ్చినప్పటికీ వైద్యం అందకపోవడంతో ఆ మహిళ నొప్పితో విలవిలలాడింది. మూడు గంటల ప్రాంతంలో ఇక్కడ ఆమెకు శస్త్రచికిత్స చేసేందుకు పరికరాలు లేవని, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సందర్భంలో కూడా వైద్యుని సంతకం కోసం, అంబలెన్స్ లేదని సిబ్బంది జాప్యం చేశారు. దీంతో గర్భిణి బంధువులు వైద్యునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరో గర్భిణితో పాటు అంబులె¯Œ్సలో కాకినాడ తరించారు. సకాలంలో వైద్యం అందించాలి : జక్కంపూడి విజయలక్ష్మి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో మాతా, శిశు భవనం నిర్మించినప్పటికీ సౌకర్యాలు కల్పించడంలో అశ్రద్ధవహిస్తున్నారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణికి వైద్యం అందడం లేదని తెలుసుకున్న ఆమె ఆస్పత్రికి చేరుకుని వైద్యునితో మాట్లాడి రోగులకు మెరుగైన వైద్యం కల్పించాలని సూచించారు. అంబులె¯Œ్సలో కాకినాడ తరలించిన గర్భిణికి సకాలంలో వైద్యం అందేలా కాకినాడ ఆస్పత్రి సూపరిటెండెంట్‌కు ఫో¯ŒS చేసి మాట్లాడారు. రోగుల పట్ల దయతో వ్యవహరించాలన్నారు. మాజీ కార్పొరేటర్ చోడిశెట్టి సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
14న ఆర్డీవో కార్యాలయం ముట్టడి
జగ్గంపేట : రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశమైన జిల్లాలోని కోస్టల్ ప్రాంతమైన తొండంగి మండల పరిధిలో దివీస్ ఫార్మాçస్యూటికల్స్ ఏర్పాటుకు జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా పోరును ఉధృతం చేసేందుకు ఆదివారం వామపక్ష పార్టీలు జగ్గంపేటలో భేటీæ అయ్యాయి. స్థానిక ట్రావెలర్స్ బంగ్లా వద్ద సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ (ఎంఎల్) జనశక్తి, సీపీఐ (ఎంఎల్) లిబరేష¯ŒS నాయకులు సమావేశమై ఉద్యమ కార్యచరణను రూపొందించారు. జనశక్తి నేత కర్నాకుల వీరాంజనేయులు అధ్యక్షత వహించగా న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్, జిల్లా నాయకుడు జె.వెంకటేశ్వర్లు, లిబరేష¯ŒS జిల్లా కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు, ఏగుపాటి అర్జునరావు, లచ్చబాబు, రైతుకూలీ సంఘ నేత రామలింగేశ్వరరావు, జనశక్తి నాయకుడు రమేష్, త్రిమూర్తులు పాల్గొన్నారు. జనశక్తి నేత కర్నాకుల మాట్లాడుతూ దివీస్ బాధితులకు అండగా ఉండేందుకు వామపక్షాలు నిర్ణయించుకున్నాయని దీనిలో భాగంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 14న పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామన్నారు. ఆందోళనలో దివీస్ బాధిత గ్రామాల ప్రజలు పాల్గొంటారన్నారు. ఇప్పటి వరకు 400 తప్పుడు కేసులు బనాయించారని వాటిని ఎత్తివేయాలన్నారు. దివీస్ వల్ల మత్స్య సంపద హరించిపోవడమే కాకుండా మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతారన్నారు. -
జీఓ 58 అమలు చేయాలి
-
మల్లంపల్లిని మండలం చేయాలి
1500 మందితో భారీ ధర్నా, రాస్తారోకో గంటన్నర పాటు స్తంభించిన ట్రాఫిక్ ములుగు : మల్లంపల్లిని మండలం చేయాలనే డిమాండ్‌తో 10 గ్రామాల ప్రజలు, అఖిలపక్షం, మండల సాధన సమితి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు సుమారు 1500 మం ది జాతీయ రహదారిపై గురువారం భారీ ధర్నా నిర్వహిం చారు. మహిళలు కోలాటం ఆడుతూ నిరసన తెలిపారు. సుమారు గంటన్నర పాటు వర్షంలోనే కార్యక్రమం కొనసాగింది. 369 జాతీయ రహదారిపై నాయకులు బైఠాయిం చారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. మొదట ఎస్సైలు మల్లేశ్‌యాదవ్, సూర్యనారాయణ అడ్డుకున్నా ఆందోళనకారులు వెనకడుగు వేయలేదు. సీఐ శ్రీనివాస్‌రావు వచ్చి నాయకులతో మాట్లాడినా.. ఆర్డీవో వచ్చేంత వరకు రాస్తారోకో విరమించేది లేదని పట్టుబట్టారు. చివరికి ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి రంగప్రవేశం చేశారు. నాయకులతో మాట్లాడినా వినకపోవడంతో స్థానిక సమస్యను తమ వంతు బాధ్యతగా ఉన్నతాధికారుల ముందు ఉంచుతామని హామీ ఇచ్చా రు. దీంతో నాయకులు రాస్తారోకో విరమించారు. అంతకు ముందు మల్లంపల్లిని మండలం చేయాలని నాగుల నర్సయ్య అనే వ్యక్తి వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు అతన్ని కిందికి దింపారు. ఈ సందర్భంగా అఖిలపక్షం , మండల సాధన సమితి నాయకులు మాట్లాడుతూ మల్లంపల్లిని మండలంగా చేయాలని చుట్టు పక్కల 40 గ్రామాలకు చెందిన 35వేల మంది ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. నల్లబెల్లి మండలంలోని నాలుగు గ్రామపంచాయతీలు, శాయంపేట మండలంలోని రెండు గ్రామపంచాయతీలు మల్లంపల్లిలో కలిసేందుకు తీర్మానం చేశాయని అన్నారు. మండల ఏర్పాటు విషయంలో అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక అందించారని ఆరోపించారు. మల్లంపల్లికి మండలం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని, నూతన మండలంగా ఏర్పాటు చేసి వరంగల్ జిల్లాలో కొనసాగేలా చూడాలని కోరారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా కేంద్రం మల్లంపల్లికి 30 కిలో మీటర్లు మాత్రమే ఉంటుందని, అదే భూపాలపల్లికి వెళ్లాలంటే 70 కిలోమీటర్లకు పైగా వెళ్లాలని చెప్పారు. మండలంగా ఏర్పాటు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండలసాధన సమితి నాయకులు చంద కుమారస్వామి, పీఏసీఎస్ చైర్మె¯ŒS గుగులోతు కిషన్, టీఆర్ఎస్ నాయకుడు రుద్రోజు ద్రోణాచారి, సర్పం చ్‌లు గోల్కొండ రవి, విష్ణువర్థ¯ŒSరెడ్డి, శంకర్‌నాయక్, రమేశ్, బొక్క సత్తిరెడ్డి, ఎంపీటీసీ సుమలత, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజ¯ŒS కార్యదర్శి కోడి సోమన్న, నాయకులు హరి నాథ్, మాచర్ల ప్రభాకర్, శ్యాంరావు, డాక్టర్ రవిబాబు, కొంగరి నరేందర్, కొమ్మాలు, కుమార్, గుండ కుమార్, కరుణాకర్‌రెడ్డి, మొర్రి రాజు, బోయిని రవి, శంకర్ పాల్గొన్నారు. -
జనాగ్రహాన్ని చూసైనా కళ్లు తెరవండి
బంద్‌కు అన్నివర్గాల స్వచ్ఛంద సహకారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కన్నబాబు కాకినాడ: ప్రజాగ్రహాన్ని చూసైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో దగా చేసిన టీడీపీ, బీజేపీలను నిరసిస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శనివారం నిర్వహించిన బంద్ అనంతరం ఆయన కాకినాడలో విలేకర్లతో మాట్లాడారు. బంద్‌కు అన్ని వర్గాలూ స్వచ్ఛందంగా సహకరించి విజయవంతం చేయడాన్ని చూస్తే ప్రజల్లో ప్రత్యేక హోదా ఆకాంక్ష ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందన్నారు. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల అభీష్టానికి విరుద్ధంగా పనిచేస్తున్న పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలను స్వాగతిస్తున్నానంటూ ముఖ్యమంత్రి ప్రకటించడంపై మండిపడ్డారు. విభజన చట్టంలోని అంశాలే తప్ప కొత్తగా ఏపీకి ఆ ప్యాకేజీలో ఏమీ లేవన్నారు. ప్రత్యేక ప్యాకేజీలో పన్నుల రాయితీలు, కొత్త పరిశ్రమలు, కొత్త నిధులు లేకుండా కేంద్రం ఏమిచ్చిందని చంద్రబాబు సరిపెట్టుకున్నారని నిలదీశారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ప్రజలను భ్రమల్లోపెట్టి అధికారంలోకి వచ్చాక ఏరుదాటాక తెప్పతగలేసిన చందాన వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజల మనోభావాలను గుర్తించి ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పనిచేయకపోతే అదే ప్రజల ఛీత్కారాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. -
కదంతొక్కిన గొర్రెల కాపరులు
సమస్యల పరిష్కారంపై సర్కారు వివక్ష సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి గొర్రెల పెంపకందారుల ధర్నాలో రాష్ట్ర నేతలు డోలు, గొంగళ్లతో భారీ ర్యాలీ ముకరంపుర : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. గొర్రెలపెంపకందారులు కదంతొక్కారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన గొర్రెల పెంపకందారులు.. గొర్రెలు, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. అంతకుముందు డోలుచప్పుళ్లు, గొంగళ్లతో సర్కస్‌గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్రెలు, మేకల పెంపకంవృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వెంకట్రాములు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాల్వనర్సయ్య యాదవ్, అఖిల భారత యాదవమహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారాం యాదవ్ మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న గొర్రెలు, మేకల పెంపకందారుల పట్ల సర్కారు వివక్ష చూపుతోందని ఆరోపించారు. బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని, నాబార్డు ద్వారా ఎలాంటి షరతులు లేకుండా 80 శాతం సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు దాటిన గొల్ల, కుర్మలకు నెలకు రూ.3వేల పింఛన్ ఇవ్వాలన్నారు. వారి సంక్షేమానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించి ఫెడరేషన్ ద్వారా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. గొర్రెల కొనుగోలు, షెడ్ల నిర్మాణానికి 50 శాతం సబ్సిడీపై రుణాలు ఇవ్వాలన్నారు. గొర్రెల విక్రయానికి మండలాలవారీగా మార్కెట్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి ప్రాథమిక సంఘానికి 25 ఎకరాల భూమి కేటాయించాలని, ఎక్స్‌గ్రేషియాను రూ.6లక్షలకు పెంచాలని సూచించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ నీతూ ప్రసాద్‌కు అందించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కడారి అయిలయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నూనె అంజయ్య, జిల్లాప్రధాన కార్యదర్శి కటికరెడ్డి బుచ్చన్న, కన్నెబోయిన ఓదెలు, మహిళా సంఘ అధ్యక్షురాలు చెర్ల పద్మ, బీర్ల కనకయ్య, మేకల నర్సయ్య, పలుమారు మల్లేశ్, పొట్టాల హన్మంతు, సాయిల్ల రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆందోళన
కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కాకినాడ సిటీ : తొండంగి మండలంలో దివీస్ ఫార్మా కంపెనీ నిర్వాసిత రైతుల పోరాటానికి అండగా నిలిచిన నాయకులను అక్రమ అరెస్టు చేయడంపై సీపీఎం కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు, జిల్లా కార్యదర్శి దువ్వ శేషుబాబ్జిలతోపాటు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసన వ్యక్తం చేస్తూ సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు, శ్రామిక మహిళా నేత ఎం.వీరలక్ష్మి మాట్లాడుతూ నెల రోజులుగా తొండంగి మండలంలో ఐదు గ్రామాల రైతులు పోరాడుతున్నారన్నారు. వారి పోరాటానికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లిన నాయకులను అక్రమంగా అరెస్టు చేసి వివిధ ప్రాంతాల్లో తిప్పి చివరగా అన్నవరం పోలీస్‌స్టేçÙన్లో నిర్బంధించారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలలో రైతులపై నిర్బంధానికి వందలాది మంది పోలీసులను మోహరించారంటే రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన కాకుండా పోలీసురాజ్యం నడుపుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిర్వాసిత రైతులకు న్యాయం చేయకపోతే ఇతర వామపక్షాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అరెస్టు చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
మూడో రోజూ కొనసాగిన ఆందోళన
గొల్లపాలెం (మలికిపురం) : పలు డిమాండ్లతో మలికిపురం మండలం గొల్లపాలెంలో ఓఎన్జీసీ జీజీఎస్ వద్ద గ్రామస్తులు చేపట్టిన ఆందోళన మూడో రోజైన బుధవారం కూడా కొనసాగింది. గ్రామస్తులు అనేక మంది రిలే నిరాహార దీక్షల్లో కూర్చొన్నారు. గ్రామ పెద్దలు గుండుమేను నాగేశ్వరరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నల్లి దాసు, ముస్కూడి ఏసురత్నం, గుండుమేను సూరిబాబు, తోపాటి శ్రీనివాస్, నాగళ్ల సత్యనారాయణ సహా అనేక మంది ఆందోళనలో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి హైడ్రామా గొల్లపాలెం జీజీఎస్ వద్ద మంగళవార రాత్రి ఓఎన్జీసీ, అధికారులు హైడ్రామా సృష్టించారు. గ్రామస్తులను భయపెట్టేందుకు యత్నించారు. ఆందోళన వల్ల జీజీఎస్‌లో ఆయిల్ ట్యాంకులు క్రూడాయిల్‌తో నిండిపోయాయని, అవి పేలిపోయే ప్రమాదం ఉందని ఓఎన్జీసీఅధికారులు పోలీసుల ద్వారా గ్రామస్తులకు సమాచారం పంపించారు. వెంటనే ఆందోళన విరమించకుంటే తలెత్తే సంఘటనలకు బాధ్యులను చేస్తూ గ్రామస్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మూడు రోజులుగా ఆందోళన చేస్తుంటే, ఆయిల్ ట్యాంకులు నిండిపోయి పేలిపోతాయా అంటూ మండిపడ్డారు. గతంలో ఆయిల్ ట్రాన్స్పోర్ట్ ట్యాంకర్ల యజమానులు నెలల తరబడి సరఫరా నిలిపివేస్తే ఎందుకు పేలలేదని ప్రశ్నించారు. గత ఏడాది నగరంలో విస్ఫోటం జరిగి అనేక మంది చనిపోతే నెలకు పైగా ఆయిల్ సరఫరా నిలిచిపోయినప్పడు ఎందుకు పేలిపోలేదని నిలదీశారు. జీజీఎస్‌లో సిబ్బంది వేతనాలు పెంచాలని ధర్నా చేసిన ప్పుడు, సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలోను ఆయిల్ సరఫరా నిలిచిపోయినప్పుడు జీజీఎస్‌లో ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులు ఎందుకు నిండిపోలేదని ప్రశ్నించారు. తమ గ్రామాభివృద్ధి కోసం ప్రశాంతంగా ఆందోళన చేస్తుంటే, అమాయకులను బెదిరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో పోలీసులు, ఓఎన్జీసీ అధికారులు.. రాజమహేంద్రవరంలోని ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. దీంతో గురువారం చర్చలకు వచ్చేందుకు ఓఎన్జీసీఅధికారులు అంగీకరించారు. -
అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ ఆందోళన
కాకినాడ సిటీ : తొండంగి మండలంలో దివీస్ ఫార్మా కంపెనీ నిర్వాసిత రైతుల పోరాటానికి అండగా నిలిచిన నాయకులను అక్రమ అరెస్ట్ చేయడంపై సీపీఎం కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు, జిల్లా కార్యదర్శి దువ్వ శేషుబాబ్జిలతోపాటు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసన వ్యక్తం చేస్తూ సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు, శ్రామిక మహిళా నేత ఎం.వీరలక్ష్మి మాట్లాడుతూ నెల రోజులుగా తొండంగి మండలంలో ఐదు గ్రామాల రైతులు పోరాడుతున్నారన్నారు. వారి పోరాటానికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లిన నాయకులను అక్రమంగా అరెస్ట్‌చేసి వివిధ ప్రాంతాల్లో తిప్పి చివరగా అన్నవరం పోలీస్‌స్టేçÙన్లో నిర్బంధించారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలలో రైతులపై నిర్బంధానికి వందలాది మంది పోలీసులను మోహరించారంటే రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన కాకుండా పోలీసురాజ్యం నడుపుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిర్వాసిత రైతులకు న్యాయం చేయకపోతే ఇతర వామపక్షాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అరెస్ట్ చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
అంగన్వాడీల ఆందోళన బాట
41 మంది కార్యకర్తల తొలగింపుపై భగ్గుమన్న కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట ధర్నా సీడీపీవోలకు వినతిపత్రాలు ఆసిఫాబాద్/ముథోల్/తాండూర్/చెన్నూర్ : జిల్లాలోని 41 మంది అంగన్వాడీ కార్యకర్తలను అక్రమంగా తొలగిం^è డం..కొందరికి షోకాజు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం అంగన్వాడీలు ఆందోళన బాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీడీపీవోలకు వినతిపత్రాలు అందజేశారు. – ఆసిఫాబాద్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు శనివారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లూరి లోకేశ్ మాట్లాడుతూ గత నెల 22,23 తేదీల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన బృందాలు వాస్తవ పరిస్థితులు పరిగణలోకి తీసుకోకుండానే కార్యకర్తలపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. కొన్ని కేంద్రాలను విజిట్ చేయకుండా డోర్‌లాక్ ఉన్న వారిని సైతం టర్మినేట్ చేశారన్నారు. అనంతరం సీడీపీవోకు వినతిపత్రం అందజేశారు. కార్యకర్తలు వనిత, సువర్ణ, చంచులక్ష్మి, విజయలక్ష్మి, పుష్పకుమారి పాల్గొన్నారు. – ముథోల్ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పరిధిలోని తానూర్, లోకేశ్వరం, కుభీర్, భైంసా, ముథోల్ మండలాల కార్యకర్తలు ధర్నా చేశారు. సీఐటీయూ నాయకుడు సుకేంట మహేశ్‌బాబు మాట్లాడుతూ కక్షపూరితంగా కార్యకర్తలను తొలగించడం అన్యాయమన్నారు. ఐసీడీఎస్ సీడీపీవో సుగుణకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వనతి, రేఖ, సవిత్రి, మనీశ ఉన్నారు. – చెన్నూర్ సీడీపీవో కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. తెలంగాణ వర్కర్స్,హెల్పర్ యూనియన్ నాయకురాళ్లు రాజమణి ఆధ్వర్యంలో సీడీపీవో మనోరమకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు పద్మావతి, రాజేశ్వరి విజయలక్ష్మి, శారద, సీఐటీయూ నాయకుడు కృష్ణమాచారి పాల్గొన్నారు. – తాండూర్ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. ప్రాజెక్టు పరిధిలో రెబ్బెన, తాండూర్ మండలాలకు చెందిన నలుగురు అంగన్వాడీ కార్యకర్తలను విధుల నుంచి తొలగించడం, మరో ఐదుగురికి షోకాజు నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. సీడీపీవో మమతకు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా నాయకుడు దాగం రాజారాం, మండల నాయకురాళ్లు సత్యవతి, విజయలక్ష్మి, లీల, పద్మ పాల్గొన్నారు. అంగన్వాడీల కార్యకర్తలు, ధర్నా, anganvadi employees, Darna, Adilabad dist -
కొబ్బరి కొనుగోలుకు రైతుల ధర్నా
అంబాజీపేట : నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాల్లో 18 రోజులుగా కొబ్బరి కొనుగోలు చేయడం లేదంటూ రైతులు సోమవారం సాయంత్రం ధర్నాకు దిగారు. ఈ నెల 5 నుంచి నాఫెడ్ కేంద్రంలో కొబ్బరిని కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాఫెడ్ కేంద్రాల నుంచి కొబ్బరిని కొనుగోలు చేయాలంటూ మార్కెట్ యార్డు గేటు వద్ద, రహదారిపై ధర్నా నిర్వహించారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న రోజుల్లో కొబ్బరిని కొనుగోలు చేయకుండా తాత్సారం చేశారన్నారు. కొబ్బరి సరకులు నాణ్యత ఉన్నా కొబ్బరిని ఎందుకు కొనుగోలు చేయలేదంటూ నిలదీశారు. నాఫెడ్ కేంద్రానికి సెలవు వస్తే ముందుగా ప్రకటించాలన్నారు. ఆందోళనకారులతో ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ అరిగెల బలరామమూర్తి, స్థానిక నాయకుడు సుంకర బాలాజీ చర్చించారు. నాఫెడ్ కేంద్రం నుంచి కొబ్బరిని కొనుగోలు చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తే మినహా ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. దాంతో ఇక్కడ జరుగుతున్న విషయాన్ని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఆయిల్‌ఫెడ్, నాఫెడ్ అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులు ఫోన్లో వివరించారు. నాఫెడ్‌లో కొబ్బరిని కొనుగోలు చేసేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో స్థానిక నాయకుల సూచనలతో ఆందోళన విరమింపజేశారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డులో కొబ్బరి రైతులు సమావేశమయ్యారు. రైతుల సమస్యలను చైర్మన్‌తో పాటు సొసైటీ అధ్యక్షుడు గణపతి వీర రాఘవులు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికి, నాఫెడ్, ఆయిల్ ఫెడ్ అధికారులకు వివరించారు. ఆయిల్ ఫెడ్ డిప్యూటీ మేనేజర్ సుధాకరరావు, నాఫెడ్ అధికారి రామచంద్రారెడ్డి, క్వాలిటీ కంట్రోల్ అధికారులు మార్కెట్ యార్డుకు చేరుకుని రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. నిబంధనల మేరకు మంగళవారం నుంచి కనీసం రోజుకు వెయ్యి బస్తాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. -
రేపు కలెక్టరేట్ ఎదుట ధర్నా
బసంత్‌నగర్: సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట సోమవారం నిర్వహించే ధర్నాను మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు విజయవంతం చేయాలని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పర్శవేని శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో ఈవోపీఆర్డీ జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాలని, వీటిలో 30 శాతం విద్యుత్ బిల్లుల చెల్లింపు, పది శాతం సీసీ ఆపరేటర్సు చార్జీలు రద్దు చేసి వాటిని ప్రభుత్వమే భరించాలని, ఎస్ఎఫ్సీ నిధులు వెంటనే విడుదల చేయాలని, సర్పంచుల జీతాల చెల్లింపులు, ఇతర అధికారాల కోసం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు వివరించారు. -
వీఆర్ఏల ధర్నా
పెగడపల్లి : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం వీఆర్ఏలు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం నాయకులు మాట్లాడుతూ ఇతర ఉద్యోగుల మాదిరిగానే తాము పనిచేస్తున్నా.. ప్రభుత్వం వేతనాలను సక్రమంగా చెల్లించడంలేదన్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. 010 పద్దు కింద ప్రతినెలా వేతనాలు అందించాలని, అర్హులకు పదోన్నతి కల్పించాలని, కనీన వేతనం రూ.15000కు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ రాఘవచార్యకు వినతిప్రతం అందించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాజమహ్మద్, మహ్మద్ రజాక్, ప్రవీణ్, భాస్కర్, మల్లయ్య, స్వామి, నాగరాజు, పోచయ్య, సర్పయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేడు కుందనపల్లిలో ధర్నా
గోదావరిఖని : ఎల్లంపల్లి నీటిని స్థానిక ప్రజల అవసరాలకు కేటాయించకుండా ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని నిరసిస్తూ శుక్రవారం కుందనపల్లి చౌరస్తాలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లింగమూర్తి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రధాన చౌరస్తాలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్, మానకొండూర్, హుస్నాబాద్ తదితర నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించకుండా సిద్దిపేట, గజ్వేల్ తదితర ప్రాంతాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పైపులైన్ల ద్వారా నీటిని తరలించుకుపోతోందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పార్టీ నగర అధ్యక్షుడు కాల్వ లింగస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బడికెల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, మహంకాళి స్వామి, బొంతల రాజేష్, సుతారి లక్ష్మణ్‌బాబు, ఎండీ ముస్తాఫా, తిప్పారపు శ్రీనివాస్, భైరిమల్ల రాజ్‌కుమార్, ఫయాజ్‌అలీ, అమలేశ్వర్‌రావు, దార కుమార్, గట్ల రమేశ్, బుర్ర సుధీర్‌గౌడ్, వీరబోయిన రవియాదవ్, గుండేటి రాజేష్, కేశవులు, ఈదునూరి హరిప్రసాద్, గోలివాడ ప్రసన్నకుమార్, బొమ్మక రాజేష్, పెద్దెల్లి ప్రకాశ్, నమిండ్ల ఎల్లేశ్, గడ్డం రమేశ్, తాళ్లపెల్లి యుగేంధర్, నారాయణగౌడ్, పర్శ శ్రీనివాస్, యాట్ల మధు, చరణ్, పోషం, ప్రవీణ్, బూడిద మహేందర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
భర్త మోసం చేశాడని భార్య ఆందోళన
♦ 23 రోజుల వ్యవధిలో ఇద్దరిని పెళ్లాడిన యువకుడు ♦ విషయం వెలుగులోకి వచ్చి ఓ భార్య ఆందోళన ♦ రంగంలోకి దిగిన పోలీసులు శ్రీకాకుళం సిటీ: ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడు.. పెళ్లి చేసుకొని జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటానని ఓ యువతిని నమ్మించాడు. పెద్దవాళ్లు ఎవరూ లేరని చెప్పి ఆ యువతికి గుడిలో మూడు ముళ్లు వేశాడు. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేశాడు. పెళ్లయిన 23 రోజులకే మరో పెళ్లి చేసుకున్నాడు. ఎవరికీ అనుమానం కలగకుండా ఈ మూడు నెలలల్లో నాలుగు ఇళ్లు మార్చాడు. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఆ యువతి చివరికి తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు గురువారం ఆందోళన చేసింది. వివరాల్లోకి వెళ్తే... నగరంలోని నానుబాలవీధికి చెందిన లొట్ల కళ్యాణి, ఎల్.వెంకటరమణ అన్నాచెళ్లెళ్లు. వీరికి తల్లిదండ్రులు లేరు. వెంకటరమణ ఓ షాపులో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కల్యాణి బీఎస్సీ కంప్యూటర్స్ వరకు చదువుకుని ఓ ఫెక్లీ షాపులో పని చేస్తోంది. ఈ క్రమంలో స్థానిక రెల్లివీధి దరి నివాసం ఉంటున్న వి.దుర్గాప్రసాద్ కల్యాణిని ప్రేమిస్తున్నానంటూ ఆరు నెలలుగా వెంటపడడం ప్రారంభించాడు. తాను ఓ హోటల్లో హెల్పర్‌గా పని చేస్తున్నానని, తాను ఒంటరిగా ఉంటున్నానని, తల్లి ఉన్నా తన సంరక్షణ బాధ్యతలను ఏనాడు చూడలేదని నమ్మించాడు. పెళ్లికి ఇరువైపులా పెద్దవాళ్లు ఎవరూ లేకపోవడంతో స్థానిక కమ్యూనిస్టు పార్టీకి చెందిన కొందరి సహాయంతో ఈ ఏడాది మార్చి 3వ తేదీన పాలకొండ శివాలయంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన 23 రోజులకే... పెళ్లయిన 23 రోజులకే మరో పెళ్లికి సిద్దపడ్డాడు దుర్గాప్రసాద్. అదే నెలలో 26వ తేదీ రాత్రి 1 గంటకు నగరంలో ఓ ఆలయంలో హిరమండలానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే ఇద్దరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు నగరంలో ఇద్దరికి వేర్వేరు చోట్ల ఇళ్లు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో కొంత కాలంగా తనను పట్టించుకోకపోవడం, ఇంటికి రావడం మానేసిన దుర్గాప్రసాద్‌పై కల్యాణి అనుమానం వ్యక్తం చేయడమే కాకుండా స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో తన భర్త దుర్గాప్రసాద్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నగరంలో దుర్గాప్రసాద్ తన తల్లి ఇంటివద్ద ఉంటున్నాడన్న సమాచారం మేరకు గురువారం కల్యాణి తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. ఇరు కుటుంబాల మధ్య చాలాసేపు వాగ్వివాదం చోటుచేసుకోగా, విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు దుర్గాప్రసాద్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చారు. బాధితురాలి కల్యాణి నుంచి లిఖిత పూర్వకంగా వివరాలను తీసుకున్నారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. -
పోలవరం నిర్వాసితుల రాస్తారోకో
రెండు గంటలు స్తంభించిన రాకపోకలు నెల్లిపాకను ముంపుగా ప్రకటించాలని డిమాండ్ నెల్లిపాక : తమ గ్రామాన్ని పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నెల్లిపాక వాసులు రోడ్డెక్కారు. 30వ నంబర్ జాతీయరహదారిపై రెండుగంటల సేపు వారు రాస్తారోకో నిర్వహించారు. దాంతో రాకపోకలు స్తంభించాయి. పోలవరం నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈకార్యక్రమానికి సీపీఎం, వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు వలన ఎటపాక మండలంలో అనేక గ్రామాలు ముంపునకు గురవుతున్నా ప్రభుత్వం తప్పుడు సర్వేలు చేసి కేవలం కొన్ని గ్రామాలనే ముంపు ప్రాంతాలుగా గుర్తించటం అన్యాయమని వారు పేర్కొన్నారు. తమ గ్రామాన్ని ముంపుగా గుర్తించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని నినాదాలు చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ ముంపు బాధితులకు టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. రైతులకు, నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో వివక్షచూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమ నిర్వాసితులకు పరిహారం చెల్లించిన విధంగానే కొత్త భూసేకరణ చట్టప్రకారం పోలవరం ముంపు బాధితులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఎటపాక సీఐ వీరయ్యగౌడ్, ఎస్సై నాగరాజు నెల్లిపాక చేరుకుని రాస్తారోకో విరమింపజేశాక ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి కొవ్వూరి రాంబాబు, నెల్లిపాక ఎంపీటీసీ సభ్యుడు దుద్దుకూరి సింహాద్రి, సర్పంచ్ కొర్సా రుక్మిణమ్మ, సీపీఎం మండల కార్యదర్శి ఐ. వెంకటేశ్వర్లు, కాక అర్జున్, గద్దల రమణయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు 4న కార్మిక మంత్రి కార్యాలయం ముట్టడి
సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 4న కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యాలయాన్ని ముట్టడించేందుకు సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్, డి.గోవిందరావులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణం ఇందిరానగర్ కాలనీలోని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా హామీ అమలు చేయలేదన్నారు. వేతన సవరణ గడువు పూర్తయి ఐదేళ్లు గడిచినా సవరించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేట్ యాజమాన్యాలు కుమ్మక్కై కార్మికుల కష్టాన్ని దోపిడీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. జిల్లాలో పరిశ్రమలు మూతపడడం వల్ల వేలాది మంది కార్మికులు రోడ్డున పడినా కార్మిక మంత్రికి పట్టడం లేదని విమర్శించారు. మూసివేసిన పరిశ్రమలు తెరిపించకుండా అణువిద్యుత్ ప్లాంట్ వస్తే ఉపాధి కలుగుతుందని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని, వేతన అమలు సలహా బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని, 65వ షెడ్యూల్ పరిశ్రమలలో కనీస వేతనాలు పెంచాలని, కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, కార్మిక చట్టాలు సవరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కార్యాలయం ముట్టడికి పరిశ్రమలు, షాపులు, హోటళ్లు, ఇంటి పనివారు, జీడి, కొబ్బరి హమాలీ, మోటారు కార్మికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్మికుల డిమాండ్ల సాధనకు సంతకాల సేకరణ చేయాలని కోరారు. ఈ మేరకు గోడ పత్రికను ఆవిష్కరించారు. -
క్రమబద్ధీకరించకపోతే ఆమరణ దీక్ష
కాంట్రాక్టు అధ్యాపకుల మహాధర్నాలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించకపోతే ఆమరణ దీక్ష చేపడతానని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు అన్నారు. జోన్–1, 2 పరిధిలోని ఆరు జిల్లాలకు చెందిన ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న 400 మంది కాంట్రాక్టు అధ్యాపకులు తమను క్రమబద్ధీకరించాని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద సోమవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సూర్యారావు మాట్లాడుతూ, కళాశాలలు ప్రారంభమై రెండు నెలల గడుస్తున్నప్పటికీ కాంట్రాక్టు అధ్యాపకుల కొనసాగింపునకు ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. ‘కార్పొరేట్ల’ కోసం మంత్రుల తహతహ : రాజా వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, కళాశాలల ప్రారంభానికి ముందే లెక్చరర్లను కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కాలేజీలైన చైతన్య, నారాయణ కాలేజీలను అభివృద్ధి చేసుకోవడంలో భాగంగానే మంత్రి నారాయణ, తన వియ్యంకుడు విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుట్రపూరితంగా ప్రభుత్వ కాలేజీలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పార్టీ అ«ధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తానని హమీ ఇచ్చారు. అనంతరం ఆర్జేడీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ, జిల్లా అధ్యక్షుడు వి.కనకరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం దారుణం
ఆగస్టు 5న చర్చల్లోనైనా మద్దతు ఇవ్వలంటూ ధర్నా డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం సిటీ : ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకు పార్లమెంట్లో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లుకు టీడీపీ, బీజేపీలు మద్దతు తెలపక పోవడడం దారుణమని, ఇప్పటికైనా స్పందించి ప్రత్యేక హోదా సాధనకు పార్టీలకు అతీతంగా కృషి చేయాల్చి ఉందని డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ డిమాండ్ చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కంబాలచెరువు సెంటర్లో చేపట్టిన ఆందోళనలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఇప్పటికైనా హోదా తెచ్చేందుకు సానుకూలంగా ఉంటే ఆగస్టు 5న మరోసారి పార్లమెంట్లో బిల్లు చర్చకు రానుందని, అప్పుడైనా ఇరుపార్టీలు దాటవేత ధోరణిమాని మద్దతు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాయుడు సతీష్, దాసి వెంటకరావు, కొళ్ళి మళ్ల రఘు, ముళ్ళ మాధవ్, గోలిరవి ,చిక్కాల బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఈ హెడ్మాస్టర్ మాకొద్దు...
చండూరు: అదనంగా ఉపాధ్యాయులను నియమించేందుకు తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడమేకాకుండా, విద్యార్థులను చేర్చుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు తమకు వద్దంటూ నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తిలోని మంచికంటి గోపమ్మ మెమోరియల్ ట్రస్ట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు శనివారం రోడ్డెక్కారు. పాఠశాల గేట్‌కు తాళం వేసి రెండుగంటలకు పైగా రోడ్డుపైనే బైఠాయించారు. హెచ్ఎంను తొలగించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ అదనంగా ఉపాధ్యాయులను నియమించాలని చెప్పి ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.50 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు వస్తే ఎంట్రెన్స్ టెస్ట్ పేరుతో 15 రోజులుగా తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హెచ్ఎం తన కూతురుకు ఎలాంటి టెస్ట్ పెట్టకుండానే ఇదే స్కూల్లో పదోతరగతిలో చేర్పించారన్నారు. ట్రిపుల్‌ఐటీలో సీటుకోసమే తన కూతురును చేర్పించారని ఆరోపించారు. ఒక వేళ నిజాయితీగానే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అనుకుంటే తను నివాసముండే నల్లగొండ జిల్లా కేంద్రంలోనే చేర్పించ వచ్చుగా అని వారన్నారు. హెచ్ఎంను తొలగించే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కక్ష సాధించడానికే: హెచ్ఎం వివరణ ప్రభుత్వ పాఠశాలలో తన కూతురును చేర్పించి ఆదర్శంగా నిలిచానని హెచ్ఎం రాములు తెలిపారు. కావాలనే కొంత మంది తనపై కక్ష సాధిస్తున్నారన్నారు. అదనంగా ఉపాధ్యాయులను నియమించడం కోసం విద్యార్థులనుంచి కొంత నగదు వసూలు చేసిన మాట వాస్తవమేనని అన్నారు. -
ధర్నాకు దిగిన రైతు కుటుంబాలు
-
అన్నదాతంటే అలుసా..!
- నిలిచిన మొక్కజొన్న కొనుగోళ్లు - ఆగ్రహించిన రైతులు జాతీయరహదారి దిగ్భంధం అలంపూర్ / కల్వకుర్తి రూరల్ : జిల్లాలో మొక్కజొన్న రైతుల పరి స్థితి నానాటికి దారుణంగా మారుతోంది. పంట కొనుగోలుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనూ గిట్టుబాటు ధర లభించక, గన్నీ బ్యాగ్‌లు లేక కొనుగోళ్లు నిలిచిపోయాయి. దాదాపు పది రోజులుగా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా మార్కెఫెడ్ అధికారులు పట్టిం చుకోకపోడవంతో ఆగ్రహించిన రైతు లు సోమవారం అలంపూర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై, కల్వకుర్తి వద్ద శ్రీశైలం రహదారిపై ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మా ర్కెట్ యార్డులో కలుగోట్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో మార్కెఫెడ్ మొ క్కజొన్న కొనుగోళ్లను చేపట్టింది. అరుు తే డిమాండ్‌కు తగినట్లుగా గన్నీ బ్యాగ్ లు సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు పది రోజులుగా ఇదే సమస్య పునరావృతమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కేంద్రం నిర్వాహకులు సైతం గన్నీ బ్యాగ్‌లు సరఫరా చేయాలని కోరినా స్పందించకపోవడంతో సోమవారం కొనుగోళ్లను నిలిపివేశారు. దీనికితోడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాంలకు తరలించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు పంటను అమ్ముకున్నా మార్కెట్లోనే పడిగాపులు కాయూల్సి వస్తోంది. దీం తో ఆగ్రహించిన అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి, ఇటిక్యాల మండలాల కు చెందిన రైతులు జాతీయరహదారిని దిగ్భంధించారు. అరగంటపాటు రోడ్డు పై బైఠాయించి, మార్కెఫెడ్ డీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చే యాలని, గన్నీ బ్యాగ్‌లు సరఫరా చే యూలని, కొన్న ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించాలని డిమాండ్ చేశారు. అరుుతే ఆందోళన చేస్తున్న రైతు ల వద్దకు అధికారులెవరూ రాకపోవడం గమనార్హం. దీంతో జాతీయరహదారిపై వాహనాలు బారులు తీరాయి. ప్రయాణీకులు, వాహనదారులు వేడుకోవడంతో రైతులు ఆందోళన విరమించారు. రాష్ట్ర ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది: ఆచారి బంగారు తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తూ, రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి అన్నారు. కల్వకుర్తి మార్కెట్ యూర్డులో మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేయడంతో కల్వకుర్తి, మిడ్జిల్ మండలాలకు చెందిన రైతులు దాదాపు 10 గంటల పాటు ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. రైతులు మార్కెట్‌కు తెచ్చిన కొనుగోలు చేయకుండా తిరస్కరించడం దారుణమన్నారు. పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై మొక్కజొన్నలకు నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్ వైఖరిని నిరసిస్తూ వ్యవసాయ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో స్థానిక సీఐ వెంకట్, ఎస్సై మగ్దూంఅలీ అక్కడికి చేరుకొని మార్కెఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడగా, మార్కెట్‌కు వచ్చిన మొక్కజొన్న ను పూర్తిగా కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన ధర్నా విరమించారు. -
పోటెత్తిన కలెక్టరేట్లు
సాక్షి నెట్వర్క్: తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా... ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం చేపట్టిన ధర్నాలతో రాష్ట్రంలోని కలెక్టరేట్లు దద్దరిల్లాయి. వైఎస్సార్ కాంగ్రెస్ సారథ్యంలో 13 జిల్లాల్లోనూ కలెక్టరేట్ల ఎదుట జరిగిన మహాధర్నాల్లో ప్రజలు, రైతులు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. విశాఖ ధర్నాలో జగన్మోహన్ రెడ్డి పాల్గొనగా, అనంతపురం జిల్లా ధర్నాకు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ప్రతి చోటా సాయంత్రం 4 గంటల వరకూ కట్టు కదలకుండా రైతులు ధర్నాలో కూర్చున్నారు. కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ధర్నాల అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వటానికి వెళ్లినా అధికారులు అందుబాటులో లేరు. దీంతో కార్యాలయ తలుపులకే వినతిపత్రాలు అతికించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తిరుపతి మహాధర్నాలో పాల్గొన్నారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి పాల్గొన్నారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మహా ధర్నాలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో పార్టీ సీజీసీ సభ్యుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరుచరిత, మణిగాంధీ, గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, అఖిలప్రియ, ఐజయ్య, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా విజయవంతమైంది. పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొనగా ధర్నా కోసం కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేసిన షామియానాలు పూర్తిగా నిండిపోయాయి. మండుటెండలో వందల సంఖ్యలో రైతులు, కార్యకర్తలు నిలిచి నినాదాలు చేశారు. గుంటూరు ధర్నాలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మొహమ్మద్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, కె.రక్షణనిధి, మేకా ప్రతాప్ అప్పారావు సహా అగ్రనేతలు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ధర్నా ప్రాంతానికి నలువైపులా పోలీసులు బ్యారికేడ్లు, ఇనుపముళ్ల కంచెల్ని ఏర్పాటు చేసినా జనం పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు అన్ని మండల కేంద్రాల నుంచి ర్యాలీగా కార్యకర్తలు, రైతులు తరలివచ్చారు. ఎమ్మెల్యే, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా తదితరులు పాల్గొన్నారు. ఎండ తీవ్రతకు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు సొమ్మసిల్లి పడిపోగా ఆస్పత్రికి తరలించారు. విజయనగరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి నివాసం నుంచి కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ చేశారు. కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ఇసుక దుకాణం అందర్నీ ఆకట్టుకుంది. బీల ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయవద్దంటూ ధర్నా ప్రాంతంలో సోంపేట వాసులు బ్యానర్ కట్టారు. ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, కంబాల జోగులు, కళావతి పాల్గొన్నారు. కడప కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహా ధర్నాకు మహిళలు, వృద్ధులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ నాయకులు చేసిన ప్రసంగాలకు జనం భారీగా స్పందించారు. ఎండలోనూ కదలకుండా కూర్చున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, జయరాములు, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, అంజాద్‌బాషా, శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, దేవగుడి నారాయణరెడ్డి పాల్గొని ప్రసంగించారు. -
విశాఖలో వైఎస్ఆర్ సీపీ మహాధర్నా ఆరంభం
-
VNR కాలేజ్ ఎదుట బాధిత తల్లిదండ్రుల అందోళన
-
మంగళగిరిలో టీడీపీ రాస్తారోకో
మంగళగిరి రూరల్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మంగళగిరి నియోజకవర్గంలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై విచారణ చేపట్టాలని కోరుతూ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గంజి చిరంజీవి ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ సెంటర్లోని గౌతమబుద్ధారోడ్పై ఆదివారం రాస్తారోకో చేశారు. తొలుత నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకుని పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి అంబేద్కర్ సెంటర్‌కు చేరుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి మాట్లాడుతూ పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు సంబంధించి మొత్తం 14 ఓట్ల తేడా వుందని తాము గుర్తించి, శనివారం రాత్రి లెక్కింపు కేంద్రమైన ఆచార్య నాగార్జునయూనివర్సిటీకి వెళ్లి ఆర్వో ఝాన్సీలక్ష్మిని కలసి వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. రాస్తారోకోలో టీడీపీ నాయకులు నందం అబద్దయ్య, ఆరుద్ర అంకవరప్రసాద్, గుత్తికొండ ధనుంజయరావు, సంకా బాలాజీగుప్తా, వల్లూరి సూరిబాబు, కోనంకి శ్రీనివాసరావు, అవ్వారు కృష్ణ, బీజేపీ నాయకులు జగ్గారపు రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.