- వైద్య సిబ్బందిపై గర్భిణి బంధువుల ఆగ్రహం
- ఆస్పత్రి ముందు ఆందోళన
- సరైన పరికరాలు లేవని కాకినాడ తరలింపు
గర్భస్థ మృతశిశువు తొలగింపులో జాప్యం
Published Mon, Nov 28 2016 12:00 AM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
రాజమహేంద్రవరం క్రైం :
మూడు రోజుల క్రితం కడుపులో మృతి చెందిన శిశువుతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యానికి నిరసనగా బందువులు ఆందోళన నిర్వహించారు. వివరాల ప్రకారం రాజమహేంద్రవరం రూరల్ నామవరం డి బ్లాక్‌కు చెందిన వంగలపూడి మంజు గర్భిణి. ఈమె కడుపులో ఉన్న శిశువుకు మూడు రోజులుగా కదలికలు ఆగిపోయాయి. దీంతో బంధువులు ఆదివారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని గైనకాలజీ వార్డుకు తీసుకువచ్చారు. ఉదయం 10 గంటలకు తీసుకువచ్చినప్పటికీ వైద్యం అందకపోవడంతో ఆ మహిళ నొప్పితో విలవిలలాడింది. మూడు గంటల ప్రాంతంలో ఇక్కడ ఆమెకు శస్త్రచికిత్స చేసేందుకు పరికరాలు లేవని, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సందర్భంలో కూడా వైద్యుని సంతకం కోసం, అంబలెన్స్ లేదని సిబ్బంది జాప్యం చేశారు. దీంతో గర్భిణి బంధువులు వైద్యునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరో గర్భిణితో పాటు అంబులె¯Œ్సలో కాకినాడ తరించారు.
సకాలంలో వైద్యం అందించాలి : జక్కంపూడి విజయలక్ష్మి
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో మాతా, శిశు భవనం నిర్మించినప్పటికీ సౌకర్యాలు కల్పించడంలో అశ్రద్ధవహిస్తున్నారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణికి వైద్యం అందడం లేదని తెలుసుకున్న ఆమె ఆస్పత్రికి చేరుకుని వైద్యునితో మాట్లాడి రోగులకు మెరుగైన వైద్యం కల్పించాలని సూచించారు. అంబులె¯Œ్సలో కాకినాడ తరలించిన గర్భిణికి సకాలంలో వైద్యం అందేలా కాకినాడ ఆస్పత్రి సూపరిటెండెంట్‌కు ఫో¯ŒS చేసి మాట్లాడారు. రోగుల పట్ల దయతో వ్యవహరించాలన్నారు. మాజీ కార్పొరేటర్ చోడిశెట్టి సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement