
ధర్నా చేస్తున్న రమాదేవి
జగద్గిరిగుట్ట: కుమారుడు ఇంట్లోకి తనను రానివ్వడం లేదని ఓతల్లి ధర్నాకు దిగింది. వివరాలు.. జగద్గిరిగుట్టలోని జగద్గినగర్‌లో శనివారం ఆర్. రమా దేవి(60)తన కొడుకు దేవేందర్ తనను ఇంటి నుంచి వెళ్లగొట్టి ఇంట్లోకి రానివ్వడం లేదని శనివారం తన కూతుర్లు ఇందిరా, జయలతో కలిసి తన ఇంటి ముందు బైఠాయింది. సంవత్సర కాలంగా తల్లి కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం రమేదేవి ఇదే ప్రాంతంలో శ్రీనివాస్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటుంది. నాయకులను సంప్రదించినా న్యాయం చేయడం లేదని రమాదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లి ఇంటి ముందు బైఠయించడంతో ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు లు సంఘటన స్థలానికి చేరుకుని «ధర్నా విరమింప జేశారు. ఈ ఇల్లు తనదని తన ఇల్లు తనకు ఇప్పించాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment