రేపు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా | tommarow Darna at collectarate | Sakshi
Sakshi News home page

రేపు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

Published Sat, Aug 20 2016 6:10 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

tommarow Darna at collectarate

బసంత్‌నగర్‌: సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ ఎదుట సోమవారం నిర్వహించే ధర్నాను మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు విజయవంతం చేయాలని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పర్శవేని శ్రీనివాస్‌ శనివారం ఒక ప్రకటనలో కోరారు. 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో ఈవోపీఆర్డీ జాయింట్‌ చెక్‌ పవర్‌ రద్దు చేయాలని, వీటిలో 30 శాతం విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, పది శాతం సీసీ ఆపరేటర్సు చార్జీలు రద్దు చేసి వాటిని ప్రభుత్వమే భరించాలని, ఎస్‌ఎఫ్‌సీ నిధులు వెంటనే విడుదల చేయాలని, సర్పంచుల జీతాల చెల్లింపులు, ఇతర అధికారాల కోసం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement