పోటెత్తిన కలెక్టరేట్లు | YSR Congress party darna at AP districts collectorates | Sakshi
Sakshi News home page

పోటెత్తిన కలెక్టరేట్లు

Published Sat, Dec 6 2014 2:20 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

పోటెత్తిన కలెక్టరేట్లు - Sakshi

పోటెత్తిన కలెక్టరేట్లు

 సాక్షి నెట్‌వర్క్: తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా... ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం చేపట్టిన ధర్నాలతో రాష్ట్రంలోని కలెక్టరేట్లు దద్దరిల్లాయి. వైఎస్సార్ కాంగ్రెస్ సారథ్యంలో 13 జిల్లాల్లోనూ కలెక్టరేట్ల ఎదుట జరిగిన మహాధర్నాల్లో ప్రజలు, రైతులు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. విశాఖ ధర్నాలో జగన్‌మోహన్ రెడ్డి పాల్గొనగా, అనంతపురం జిల్లా ధర్నాకు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ప్రతి చోటా సాయంత్రం 4 గంటల వరకూ కట్టు కదలకుండా రైతులు ధర్నాలో కూర్చున్నారు. కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ధర్నాల అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వటానికి వెళ్లినా అధికారులు అందుబాటులో లేరు. దీంతో కార్యాలయ తలుపులకే వినతిపత్రాలు అతికించారు.

 చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తిరుపతి మహాధర్నాలో పాల్గొన్నారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి పాల్గొన్నారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మహా ధర్నాలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో పార్టీ సీజీసీ సభ్యుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు ఎస్‌వీ మోహన్‌రెడ్డి, గౌరుచరిత, మణిగాంధీ, గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, అఖిలప్రియ, ఐజయ్య, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా విజయవంతమైంది. పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొనగా ధర్నా కోసం కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేసిన షామియానాలు పూర్తిగా నిండిపోయాయి.

మండుటెండలో వందల సంఖ్యలో రైతులు, కార్యకర్తలు నిలిచి నినాదాలు చేశారు. గుంటూరు ధర్నాలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మొహమ్మద్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.  కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, కె.రక్షణనిధి, మేకా ప్రతాప్ అప్పారావు సహా అగ్రనేతలు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ధర్నా ప్రాంతానికి నలువైపులా పోలీసులు బ్యారికేడ్లు, ఇనుపముళ్ల కంచెల్ని ఏర్పాటు చేసినా జనం పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు అన్ని మండల కేంద్రాల నుంచి  ర్యాలీగా కార్యకర్తలు, రైతులు తరలివచ్చారు. ఎమ్మెల్యే, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా తదితరులు పాల్గొన్నారు. ఎండ తీవ్రతకు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు సొమ్మసిల్లి పడిపోగా ఆస్పత్రికి తరలించారు.

విజయనగరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి నివాసం నుంచి కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ  నిర్వహించారు. ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ చేశారు. కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ఇసుక దుకాణం అందర్నీ ఆకట్టుకుంది. బీల ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయవద్దంటూ ధర్నా ప్రాంతంలో సోంపేట వాసులు బ్యానర్ కట్టారు. ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, కంబాల జోగులు, కళావతి పాల్గొన్నారు.

 కడప కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహా ధర్నాకు మహిళలు, వృద్ధులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ నాయకులు చేసిన ప్రసంగాలకు జనం భారీగా స్పందించారు. ఎండలోనూ కదలకుండా కూర్చున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, జయరాములు, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, అంజాద్‌బాషా, శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, దేవగుడి నారాయణరెడ్డి పాల్గొని ప్రసంగించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement