![collector should not say like that: ysrcp - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/29/YSRCP-flag_2.jpg.webp?itok=O8h-8R2K)
సాక్షి, కడప: పోలీసుల రక్షణలో జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టండని జిల్లా కలెక్టర్ చెప్పడం దారుణమని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానించారు. కడప వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నేతలు సురేష్ బాబు, అమర్నాధ్ రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్ బాషా పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. గత ఏడాది జన్మభూమి నుంచి ఇప్పటి వరకు ఒక్క అర్జీని కూడా టీడీపీ నేతలు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.
ప్రజలు నిలదీస్తారనే భయంతోనే పోలీసుల రక్షణ కావాలని అంటున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్క రేషన్ కార్డుకానీ, ఇళ్ల స్థలాలు, ఫించన్లు కానీ ఇచ్చారా అని ప్రశ్నించారు. జననేత జగన్ చేస్తున్న పాదయాత్రను చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పాదయాత్రతో టీడీపీ పునాదులు కదలడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment