
ముషీరాబాద్ (హైదరాబాద్): ఢిల్లీలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈనెల 11న రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టే ధర్నాకు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రకటించారు. శనివారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రైతులు పండించిన వడ్లను, పంటను కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు.
రైతుల డిమాండ్లు సాధించేవరకు ఎమ్మార్పీఎస్ వారికి తోడుగా ఉంటుందని తెలిపారు. కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటును అందిస్తూ రైతు బాంధవుడిగా ఎల్లవేళలా అండగా ఉంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో కొల్లూరి వెంకట్, వరిగడ్డి చందు, చింతం తిరుపతి, శాగంటి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment