అధికార మదం.. అధికారులపై అదే అహం
సాక్షి, రాజమహేంద్రవరం :
టీడీపీ నేతలు చేస్తున్న ఘనకార్యాలు, ఆ కార్యాలను సజావుగా నడిపేందుకు పోలీసులను ఎలా వాడుకుంటోంది పై రెండు ఘటనలు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఆదెమ్మదిబ్బ ఆక్రమణలపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇస్తున్నా అధికారం అండతో ముందుకే పోతున్నారు. అధికారులు కూడా ప్రేక్షకపాత్రనే పోషిస్తున్నారు. ఆ ఘటన మరిచిపోకముందే 8వ తేదీన రాజమహేంద్రవరంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ ఓ ట్రాఫిక్ మహిళా ఎస్పై విధుల్లో భాగంగా ఓ వ్యక్తికి రూ.100 జరిమానా విధిస్తే చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అధికారం మాది ... మాకే జరిమానా వేస్తావా అంటూ ఎదురు తిరగడమే కాకుండా ‘నేనెవరో తెలియదా’ అంటూ చిందులు తొక్కారు. ఆ పోలీసు అధికారి ‘మీరు ఎవరో నాకు తెలియదు’ అనడంతో నానా రచ్చ చేశారు. అధికార పార్టీ నేతనైన తనను ఎవరో తలియదంటుందా అంటూ సదరు నేత ఘటన జరిగిన ప్రాంతమైన కంబాల చెరువు నుంచి రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి జాంపేటలోని ట్రాఫిక్ డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఆదెమ్మదిబ్బ ఆక్రమణ విషయంలో ‘తమ ఇళ్లు తొలగిస్తున్నారు.. మా ఆస్తిని కాజేశారు’.. అని పేదలు మొరపెట్టుకున్నా పట్టించుకోని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు ఈ విషయంలో మాత్రం ‘తమ నేతకు అవమానం జరిగిందం’టూ పోలీస్ స్టేష¯ŒS వద్దకు చేరుకున్నారు. స్టేష¯ŒS ముందు భారీ ధర్నా చేశారు. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని’ డిమాండ్ చేశారు. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు నగరంలోని నాలుగు స్టేషన్ల సీఐలు, ఎస్పైలు తమ విధులను మధ్యలోనే ఆపేసి అక్కడకు చేరుకుని దాదాపు మూడు గంటల పాటు అక్కడే ఉన్నారంటే టీడీపీ నేతలు ఏ స్థాయిలో రచ్చ చేశారో అర్థం చేసుకోవచ్చు.
రూ. 5000 లంచం తీసుకుంటున్నా
రంటూ ఫిర్యాదు...
అంతటితో ఆగకుండా మరుసటి రోజు అంటే 9వ తేదీన అర్బ¯ŒS ఎస్పీని కలసి మొత్తం ట్రాఫిక్ విభాగంపై ఫిర్యాదు చేశారు. మీ సిబ్బంది తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులు లంచాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ÐÜఎం చంద్రబాబు రోజుకు 18 గంటలు కష్ట పడుతుంటే ఇలాంటి అధికారుల చర్యల వల్ల తమ ప్రభుత్వం పట్ల చులకన భావం ఏర్పడుతోందని అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారిని ముందు లబలబలాడారు.
జరిమానాకు...
లంచానికీ తేడా తెలియని వైనం
నగరంలో రోజుకు నాలుగైదు మద్యం తాగి వాహనం నడిపిన కేసులు నమోదవుతున్నాయి. ఏ రోజుకారోజు ఈ కేసులను రాజమహేంద్రవరం సెంకడ్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారిస్తున్నారు. మెజిస్ట్రేట్ జరిమానా విధించిన తర్వాత పోలీసులు ఆ వాహనాలను వదిలేస్తున్నారు. నవంబర్‌లో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ పదవీ విరమణ చేశారు. ఈ బాధ్యతలు ఐదో మెజిస్ట్రేట్‌కు అదనంగా అప్పగించారు. తన విధులతోపాటు ఈ కేసులను విచారించడానికి న్యాయమూర్తి సోమ, శుక్రవారాలను పోలీసుల వినతి మేరకు కేటాయించారు. అయితే నవంబర్ ఐదున అనారోగ్యం కారణంగా న్యాయమూర్తి సెలవుపెట్టారు. రెండు, ఐదో మెజిస్ట్రేట్ బాధ్యతలను ఆరోక్లాస్ మెజిస్ట్రేట్‌కు ఇచ్చారు. దీంతో పని ఎక్కువ కావడంతో కేసులు పరిష్కారానికి నోచుకోవడంలేదు. మరో పక్క డ్రంక్ డ్రైవ్ కేసుల్లో దొరికిన వారు తమ వాహనాల కోసం ట్రాఫిక్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా వాహనాలను వెంటనే ఇచ్చే విధంగా నిందితులు రూ.5 వేలు బ్యాంకుల్లో ఎఫ్‌డీఆర్ చేసి ఆ పత్రాన్ని పోలీసులకు ఇచ్చి వాహనం విడిపించుకు వెళ్లేవిధంగా ఓ విధానాన్ని అమలు చేశారు. కేసు విచారించిన తర్వాత జరిమానా కట్టి ఎఫ్‌డీఆర్ పత్రాన్ని తీసుకెళ్లి రూ. ఐదు వేలు వాహనదారులు తీసుకోవచ్చు. అయితే నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ ఎఫ్‌డీఆర్‌ను బ్యాంకు సిబ్బంది కట్టించుకోవడం మానేశారు. కేసులు పెండింగ్ పడిపోతుండడంతో ఉన్నతాధికారుల సూచన మేరకు ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల నుంచి రూ.5వేలు నగదు తీసుకుని వాహనాన్ని ఇస్తున్నారు.దీన్ని లంచమ నుకొని ఫిర్యాదు చేయడం పట్ల పలువురు నవ్వుకుంటున్నారు.