
సూర్యారావుపాలెంలో అత్తింటి వద్ద ధర్నాచేస్తున్న సులోచన
ఉండ్రాజవరం: ప్రేమించి పెళ్లి చేసుకున్న నెలరోజులకే భర్త తన వద్దకు రావడం లేదని, అత్తవారింటికి వెళ్తే తనను రానివ్వకుండా తలుపులు వేసుకుంటున్నారని ఒక మహిళ అత్తవారింటి ముందు గురువారం రాత్రి నుంచి ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామానికి చెందిన పెదప్రోలు సురేష్ అదే గ్రామానికి చెందిన ఎమ్.సులోచన ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరు మే5న గౌరీపట్నంలోని చర్చిలో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే తన భర్త తనవద్దకు రావడం మానేశాడని ఆరోపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment