అన్నదాతంటే అలుసా..!
- నిలిచిన మొక్కజొన్న కొనుగోళ్లు
- ఆగ్రహించిన రైతులు జాతీయరహదారి దిగ్భంధం
అలంపూర్ / కల్వకుర్తి రూరల్ : జిల్లాలో మొక్కజొన్న రైతుల పరి స్థితి నానాటికి దారుణంగా మారుతోంది. పంట కొనుగోలుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనూ గిట్టుబాటు ధర లభించక, గన్నీ బ్యాగ్‌లు లేక కొనుగోళ్లు నిలిచిపోయాయి. దాదాపు పది రోజులుగా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా మార్కెఫెడ్ అధికారులు పట్టిం చుకోకపోడవంతో ఆగ్రహించిన రైతు లు సోమవారం అలంపూర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై, కల్వకుర్తి వద్ద శ్రీశైలం రహదారిపై ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళితే అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మా ర్కెట్ యార్డులో కలుగోట్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో మార్కెఫెడ్ మొ క్కజొన్న కొనుగోళ్లను చేపట్టింది. అరుు తే డిమాండ్‌కు తగినట్లుగా గన్నీ బ్యాగ్ లు సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు పది రోజులుగా ఇదే సమస్య పునరావృతమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
కేంద్రం నిర్వాహకులు సైతం గన్నీ బ్యాగ్‌లు సరఫరా చేయాలని కోరినా స్పందించకపోవడంతో సోమవారం కొనుగోళ్లను నిలిపివేశారు. దీనికితోడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాంలకు తరలించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు పంటను అమ్ముకున్నా మార్కెట్‌లోనే పడిగాపులు కాయూల్సి వస్తోంది. దీం తో ఆగ్రహించిన అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి, ఇటిక్యాల మండలాల కు చెందిన రైతులు జాతీయరహదారిని దిగ్భంధించారు. అరగంటపాటు రోడ్డు పై బైఠాయించి, మార్కెఫెడ్ డీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చే యాలని, గన్నీ బ్యాగ్‌లు సరఫరా చే యూలని, కొన్న ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించాలని డిమాండ్ చేశారు. అరుుతే ఆందోళన చేస్తున్న రైతు ల వద్దకు అధికారులెవరూ రాకపోవడం గమనార్హం. దీంతో జాతీయరహదారిపై వాహనాలు బారులు తీరాయి. ప్రయాణీకులు, వాహనదారులు వేడుకోవడంతో రైతులు ఆందోళన విరమించారు.
రాష్ట్ర ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది: ఆచారి
బంగారు తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తూ, రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి అన్నారు. కల్వకుర్తి మార్కెట్ యూర్డులో మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేయడంతో కల్వకుర్తి, మిడ్జిల్ మండలాలకు చెందిన రైతులు దాదాపు 10 గంటల పాటు ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. రైతులు మార్కెట్‌కు తెచ్చిన కొనుగోలు చేయకుండా తిరస్కరించడం దారుణమన్నారు.
పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై మొక్కజొన్నలకు నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్ వైఖరిని నిరసిస్తూ వ్యవసాయ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో స్థానిక సీఐ వెంకట్, ఎస్సై మగ్దూంఅలీ అక్కడికి చేరుకొని మార్కెఫెడ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడగా, మార్కెట్‌కు వచ్చిన మొక్కజొన్న ను పూర్తిగా కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన ధర్నా విరమించారు.