purchase of crop
-
రైతన్నకు ‘మద్దతు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోంది. ఏటా ఇన్పుట్ సబ్సిడీ అందించడంతోపాటు, ఉచిత పంటల బీమా వంటి పలు సదుపాయాలు కల్పించింది. ఆర్బీకేల ద్వారా నిరంతరం వారికి అవసరమైన సేవలు అందిస్తోంది. మార్కెట్లో రైతు పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించేలా చూస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా కనీస మద్దతు ధర దక్కని ఖరీఫ్ ఉత్పత్తుల కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. ధాన్యంతో పాటు అన్ని రకాల ఉత్పత్తులకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపడుతోంది. ధాన్యం కాకుండా ఈ మూడేళ్లలో ప్రభుత్వం 4.27 లక్షల మంది రైతుల నుంచి రూ. 7,157 కోట్ల విలువైన 20.18 లక్షల టన్నుల వివిధ రకాల పంట ఉత్పత్తులను వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో మార్కెఫెడ్ ద్వారా 3.76 లక్షల మంది రైతుల నుంచి రూ.5,023 కోట్ల విలువైన 16.34 లక్షల టన్నుల ఉత్పత్తులను సేకరించింది. ప్రధానంగా 2019–20 సీజన్లో 2.24 లక్షల మంది రైతుల నుంచి రూ. 2,231 కోట్ల విలువైన 8.56 లక్షల టన్నులు, 2020–21 సీజన్లో 1.20 లక్షల మంది రైతుల నుంచి రూ.2,255 కోట్ల విలువైన 6.46 లక్షల టన్నులు సేకరించింది. 2022–23లో ఇప్పటివరకు 32 వేల మంది నుంచి రూ. 537 కోట్ల విలువైన 1.32 లక్షల టన్నుల విలువైన ఉత్పత్తులను సేకరించింది. గత సీజన్లో మాదిరిగానే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మొక్కజొన్న, సజ్జలు, వేరుశనగ కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖరీఫ్‌లో వేరుశనగ 13.34 లక్షల ఎకరాల్లో సాగవగా, 4.87 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. మొక్కజొన్న 3.21లక్షల ఎకరాల్లో సాగవగా, 6.60 లక్షల టన్నులు, సజ్జలు 52 వేల ఎకరాల్లో సాగవగా, 50 వేల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా. మొక్కజొన్నకు టన్నుకు రూ.1,962, సజ్జలకు రూ.2,350, వేరుశనగకు రూ.5,850 చొప్పున కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్లో వీటి ధరలు ప్రస్తుతం ఆశాజనకంగానే ఉన్నాయి. సజ్జలు మినహా మిగిలిన రెండింటి ధరలు ఎమ్మెస్పీకి దీటుగానే ఉన్నాయి. నాణ్యమైన (ఫైన్న్క్వాలిటీ) సజ్జలు, మొక్కజొన్నకు మార్కెట్లో టన్నుకు రూ.2 వేలకు పైగా ధర పలుకుతోంది. వేరుశనగ రూ.6 వేల నుంచి రూ.6,500 వరకు పలుకుతోంది. పంట చేతికొచ్చే సమయానికి ధరలు ఏమాత్రం తగ్గినా వెంటనే మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద జోక్యం చేసుకొని ధరలు పడిపోకుండా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం మార్క్‌ఫెడ్ ద్వారా ఈ మూడు ఉత్పత్తుల కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. 12వేల టన్నులు సజ్జలు, 66 వేల టన్నుల మొక్కజొన్న, 1.21 లక్షల టన్నుల వేరుశనగ కొనాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల ద్వారా రైతుల వివరాల నమోదు ప్రక్రియ చేపట్టింది. -
రూ.6,903 కోట్లతో పంటల కొనుగోలు
విద్యుత్ మోటార్ల విషయంలో టీడీపీ, చంద్రబాబుతో కూడిన దుష్టచతుష్టయం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నాయి. మోటార్లకు మీటర్లు పెట్టడం ద్వారా ఏ ఒక్క రైతు నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేసే ప్రసక్తే లేదు. మీటర్ల వల్ల మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు. నాణ్యమైన విద్యుత్‌ను ప్రతి రైతుకు అందించగలుగుతాం. ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ సరిపోతుందా.. లేదా.. తెలుసుకుని మార్పులు చేసుకోవచ్చు. డిస్కంలను ప్రశ్నించే హక్కు రైతులకు వస్తుంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మనందరి ప్రభుత్వంలో రైతులు నష్టపోకుండా వారు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ రూ.6,903 కోట్లతో 20.10 లక్షల టన్నుల పంటలు కొనుగోలు చేశామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కష్టపడి పండించిన పంటకు ధర పడిపోతే.. రైతులు ఎంతగా నష్టపోతారో తెలిసిన ప్రభుత్వమని స్పష్టం చేశారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి అండగా నిలిచామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన బుధవారం ఆయన వ్యవసాయం–అనుబంధ రంగాలపై స్వల్ప కాలిక చర్చలో మాట్లాడారు. ఆర్బీకే స్థాయిలో సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్) తీసుకొచ్చి, దీని ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. పంటల వారీగా మద్దతు ధరల వివరాలతో ఆర్బీకేల్లో పోస్టర్లు ప్రదర్శిస్తున్నామని చెప్పారు. రేటు పడిపోయినప్పుడు రైతులు ఆర్బీకే దృష్టికి తీసుకొస్తే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మార్కెటింగ్ డిపార్ట్మెంట్.. జేసీలను అప్రమత్తం చేసి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో ధాన్యానికి సంబంధించి ఏటా రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తే మన ప్రభుత్వం రూ.14 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. చనిపోయిన రైతుల కుటుంబాలకు భరోసా ► గత ప్రభుత్వంలో వరుస కరువుల ప్రభావం, బాబు హామీలు నమ్మి అప్పు కట్టకుండా వడ్డీలు, చక్రవడ్డీలు పెరగడం, ఇతరత్రా కారణాల వల్ల ఆత్మహత్య చేసుక్ను రైతన్న కుటుంబాలను గతంలో ఎన్నడూ లేని విధంగా మానవతా దృక్పథంతో అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. పరిహారాన్ని రూ.7 లక్షలకు పెంచాం. ఇందుకోసం ప్రతి కలెక్టర్ వద్ద రూ.కోటి పెట్టాం. గత ప్రభుత్వం తరహాలో కాకుండా రైతు ఆత్మహత్యలు కచ్చితంగా నమోదయ్యేలా చూస్తున్నాం. కౌలు రైతులకు కూడా పరిహారం ఇస్తున్నాం. ► చంద్రబాబు హయాంలో 473 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతో వారిని పట్టించుకోలేదు. ఆ కుటుంబాలకు కూడా మనం వచ్చాక రూ.5 లక్షల చొప్పున రూ.23.65 కోట్లు ఇచ్చాం. ► 2019 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 308 రైతు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున రూ.21.56 కోట్లు ఇచ్చాం. 2020లో 260 రైతు కుటుంబాలకు రూ.18.20 కోట్లు ఇచ్చాం. 2021లో రైతు ఆత్మహత్యలు తగ్గాయి. ఆ ఏడాది 126 మంది చనిపోతే, వారి కుటుంబాలకు రూ.8.82 కోట్లు ఇచ్చాం. ఇలా ఇప్పటి వరకు రూ.72.14 కోట్లు పరిహారంగా ఇచ్చాం. 2021–22లో రూ.20 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ.15.34 కోట్లు పరిహారంగా ఇచ్చాం. కౌలు రైతులకు వెన్నుదన్నుగా నిలిచాం ► కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు, బ్యాంకుల నుంచి రుణాలు అందించడం కోసం 2019లో పంటల సాగుదారుల హక్కు చట్టం (సీసీఆర్ఏ)తీసుకొచ్చాం. భూ యజమానులకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో రైతులతో సమానంగా పథకాలు, రుణాలు అందేలా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు అందిస్తున్నాం. ► వ్యవసాయానికి పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఇందుకోసం రూ.1700 కోట్లు ఖర్చు చేసి ఫీడర్లు, సబ్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేశాం. ఏటా రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తూ 18.70 లక్షల పంపుసెట్లకు ఉచితంగా పగటి పూట విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. మూడేళ్లలో రూ.27 వేల కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన విద్యుత్ బకాయిలు రూ.9 వేల కోట్లు చెల్లించాం. ఆక్వా రైతులకు కరెంట్ సబ్సిడీ కింద రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రైతులను నిలువునా మోసగించిన బాబు ► 2014 ఎన్నికలకు ముందు బేషరుతుగా రూ.87,612 కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన బాబు.. తీరా గద్దెనెక్కాక రూ.15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు. బాబు హామీని నమ్మిన రైతుల అప్పులకు వడ్డీలు, చక్రవడ్డీలు పెరిగి, సున్నా వడ్డీ పథకం ఎగిరిపోయి.. మరో రూ.87 వేల కోట్ల మేర నష్టానికి గురయ్యారు. బాబు ఎలా మోసం చేశారో ఈ వీడియో ద్వారా చూద్దాం. (వీడియో ప్రదర్శించారు) ► 2014 ఎన్నికల ముందు ‘రైతులు తీసుకున్న అన్ని రుణాలను పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది’ అని చంద్రబాబు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక ‘రుణమాఫీ ఇచ్చేశాం. అంతా మాఫీ చేస్తానని నీకు ఎవరు చెప్పారు? ’ అంటూ మాట మార్చారు. రుణ మాఫీ ఒక్కటే కాదు. సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ ఇలా అన్నింటికి సున్నా చుట్టిన ఘనత ఈ పెద్దమనిషి చంద్రబాబుదే. ► మనందరి ప్రభుత్వం వచ్చాక విప్లవాత్మక చర్యలతో రైతన్నలకు అన్ని విధాలా అండగా నిలిచి వ్యవసాయాన్ని పండుగగా మార్చాం. వ్యవసాయ రంగంలో మనం అమలు చేస్తున్న ప్రతి పథకం 87 శాతం రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తోంది. దళారీ వ్యవస్థ నిర్మూలన, నాణ్యమైన ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు.. పంటల కొనుగోలు, యంత్ర పరికరాలు, పాల సేకరణ ధర పెంపు, పశువుల కోసం అంబులెన్స్‌లు, ఉచిత బోర్లు.. ఇలా పలు విధాలా అన్నదాతలకు అండగా నిలిచాం. ఇవి కాకుండా అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు.. ఇళ్లు, విద్యా దీవెన, వసతి దీవెన.. తదితర నవరత్నాలూ అందజేయడం ద్వారా వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఊతమిచ్చాం. అయితే ఇవన్నీ చంద్రబాబు, ఎల్లో మీడియాకు మాత్రం కనిపించడం లేదు. -
Andhra Pradesh: దరికి రారు దళారులు
‘పంట చేతికందింది.. కొనుగోలుకు ఎవరైనా వస్తారో రారో.. మనమే మార్కెట్‌కు ఎలా తీసుకెళ్లాలో.. అక్కడ మనకేమీ తెలీదు.. వాళ్లు (దళారులు) చెప్పిన మాటే శాసనం.. కాదు కూడదంటే పంట కొనుగోలు చేయరు.. గట్టిగా మాట్లాడితే దిక్కున్న చోట చెప్పుకోమంటారు.. వారు చెప్పిన ధరకే తెగనమ్మినా, డబ్బులెప్పుడిస్తారో చెప్పరు.. చేతికందినప్పుడు హమ్మయ్యా.. అనుకోవాలి’ అని రాష్ట్రంలోని రైతులు ఇకపై దిగులు పడాల్సిన పని లేదు. దళారుల ఆటలకు చెక్ పెడుతూ నేరుగా ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేస్తుంది. సాక్షి, అమరావతి: పంటను విక్రయించేందుకు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదన్న గట్టి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పంటల కొనుగోలుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. దళారులు, మధ్యవర్తులకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా వాస్తవ సాగుదారుల నుంచే ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను నేరుగా సేకరించేలా చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ క్రాప్‌లో నమోదైన వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా రైతు భరోసా కేంద్రాల్లో శనివారం నుంచి ప్రదర్శనకు ఉంచబోతోంది. (చదవండి: జన్యుమార్పిడి బియ్యం కలకలం) రైతులు లేవనెత్తే అభ్యంతరాలను అక్కడికక్కడే పరిష్కరించి పంట వివరాలను అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంది. ‘మీ పేర్లు ఈ క్రాప్‌లో నమోదు కాలేదు.. అందువల్ల మీ పంటను కొనుగోలు చేయలేం’ అంటూ కొన్ని సందర్భాల్లో శాఖల మధ్య సమన్వయ లోపంతో ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలు (పంటను సేకరించేవి) ఇబ్బంది పెట్టకుండా కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆరు గాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునే దారి లేక రైతులు పడుతున్న ఇక్కట్లను పరిగణనలోకి తీసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. నేరుగా పంటల కొనుగోలుకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని మరింత ఆధునికీకరిస్తూ తాజాగా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ ఫాం రైతు భరోసా (యూడీపీఆర్బీ) యాప్ సాయంతో పక్కాగా పంట నమోదు చేస్తూ కొనుగోలు వేళ రైతులకు మరింత మేలు జరిగేలా చర్యలు చేపట్టింది. యుద్ధ ప్రాతిపదికన ఈకేవైసీ యూడీపీఆర్బీ యాప్ ద్వారా ఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణంలో.. ఏ రైతు.. ఏ రకం పంట సాగు చేశారు.. ఎప్పుడు కోత కొస్తుంది.. ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందనే వివరాలను ప్రభుత్వం ఇప్పటికే నమోదు చేయించింది. రైతులకు వారు సాగు చేసిన పంట వివరాలతో కూడిన రసీదు (డిజిటల్ ఎక్నాలెడ్జ్మెంట్)లను కూడా అందజేసింది. ఆర్బీకేల్లో పంట వివరాలు నూరు శాతం నమోదు కాగా, 10–20 శాతం మేర మిగిలి ఉన్న క్షేత్ర స్థాయి పరిశీలనతో పాటు ఈ కేవైసీ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. మరోపక్క ఈ క్రాప్‌లో నమోదైన పంట వివరాలను తొలిసారిగా ధాన్యం సేకరణ కోసం పౌర సరఫరాల సంస్థ రూపొందించిన యాప్‌తో అనుసంధానిస్తోంది. తద్వారా రైతుల వివరాలన్నీ ఈ యాప్‌లోనూ కనిపిస్తాయి. గతంలో శాఖల వారీగా ఎవరి జాబితాలు వాళ్ల దగ్గరుండేవి. అందువల్ల సాంకేతిక సమస్య కారణంగా ఈ క్రాప్ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, పంట నమోదులో దొర్లిన పొరపాట్లు రైతులకు నష్టం కలిగించేవి. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇక నుంచి ఈ పరిస్థితి ఉండదు. 50 లక్షల టన్నుల కొనుగోలుకు ఏర్పాట్లు సామాజిక తనిఖీలో భాగంగా ఈ–పంట వివరాలను శనివారం నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించబోతున్నారు. రైతులు వీటిని పరిశీలించి పంట వివరాల నమోదులో తప్పులు చోటుచేసుకుని ఉంటే వీఏఏల దృష్టికి తీసుకెళ్తే మార్పులు, చేర్పులు చేస్తారు. అనంతరం కొనుగోలు కేంద్రాలు తెరిచే సమయానికి ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీల వద్ద సమాచారం పక్కాగా ఉంటుంది. కాగా, ఖరీఫ్ సీజన్లో సాగైన 39,35,798 ఎకరాల్లో వరి పంట వివరాలను నమోదు చేయగా, 37,43,649 ఎకరాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేశారు. వరి సాగు చేసిన 21,71,708 మంది రైతుల్లో ఇప్పటి వరకు 15,37,269 మంది వివరాలను ఈ కేవైసీ పూర్తి చేశారు. రికార్డు స్థాయిలో గడిచిన ఖరీఫ్ సీజన్లో 2,500 కేంద్రాల ద్వారా 5.15 లక్షల మంది రైతుల నుంచి రూ.8,868 కోట్ల విలువైన 47.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఈసారి ఆర్బీకే స్థాయిలో 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ రెండో వారం నుంచి 8,774 ఆర్బీకేల్లో పంటల కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మార్పులన్నింటి వల్ల రైతులకు ఒక్క పంటల కోనుగోలులో మాత్రమే కాకుండా పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ విషయంలోనూ మేలు జరుగుతుంది. (చదవండి: అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా యువతి.. బిక్కుబిక్కుమంటూ..) అభ్యంతరాలుంటే మార్పులు తథ్యం వాస్తవ సాగుదారుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరించాలన్న ఆలోచనతో ఆర్బీకేల్లో పంట నమోదు వివరాలను ప్రదర్శిస్తున్నాం. వాటిని పరిశీలించి.. రైతులకు అభ్యంతరాలుంటే వీఏఏలకు చెబితే పక్కాగా నమోదు చేస్తారు. అవసరమైతే మరోసారి క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. తొలిసారిగా ఈ పంట వివరాలను పౌరసరఫరాల సంస్థ యాప్‌తో అనుసంధానం చేస్తుండటం వల్ల సాగుతో సంబంధం లేని వారు, మధ్యవర్తులు, దళారులు వేరే ప్రాంతాల నుంచి ధాన్యం తీసుకొచ్చి ఆర్బీకేల్లో విక్రయించేందుకు ఆస్కారం ఉండదు. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
పల్లెల్లో పంట కొనుగోలు కుదరదు!
లాభాలొచ్చే చోట అమ్ముకోవచ్చు... ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దని ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసింది. ప్రతిసారీ ఇలా చేయడం సాధ్యంకాదు. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు పంటలను లాభమొచ్చే చోట ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. సర్కారుకు రూ.7,500 కోట్ల నష్టం తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రభుత్వం చేపట్టిన ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, శనగలు తదితర పంటల కొనుగోళ్లతో దాదాపు రూ.7,500 కోట్ల నష్టం వచ్చింది. రైతులకు మద్దతు ధర చెల్లించి కొన్నా, ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్ లేక తక్కువ ధరకు అమ్మాల్సి రావడంతో నష్టం వాటిల్లింది. సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వివిధ రకాల పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో సర్కార్ భారీగా నష్టపోయిందని, వచ్చే ఏడాది నుంచి ఇలా కొనడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. నియంత్రిత సాగు విధానం సైతం ఇకపై అవసరం లేదని నిర్ణయం తీసుకుంది. రైతుబంధు పంపిణీతో సహా వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రగతి భవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో పాల్గొన్న వారందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు–కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు–ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగిందని వెల్లడించింది. లాభాలొచ్చే చోట అమ్ముకోవాలి... ‘ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దని ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసింది. ప్రతీసారి ఇలా చేయడం సాధ్యంకాదు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. కొనుగోళ్లు–అమ్మకాలు ప్రభుత్వ బాధ్యత కాదు. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు పంటలను లాభమొచ్చే చోట ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం గ్రామా ల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. వ్యవసాయ మార్కెట్లలో అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా, పద్ధతి ప్రకారం నిర్వహించాలి. రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, వ్యవసాయ విస్తరణాధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏ గ్రామానికి చెందిన రైతులు ఎప్పుడు మార్కెట్‌కు పంట తీసుకురావాలో నిర్ణయించాలి. దాని ప్రకారం రైతులకు టోకెన్లు ఇవ్వాలి. ఈ పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలి ’అని సమావేశంలో పాల్గొన్న వారంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: (మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి) సర్కారుకు రూ.7,500 కోట్ల నష్టం... తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రభుత్వం చేపట్టిన ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, శనగలు, పొద్దు తిరుగుడు, మినుములు తదితర పంటల కొనుగోళ్లతో ఇప్పటివరకు దాదాపు రూ.7,500 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు నివేదించారు. రైతులకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసినా, ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్ లేక ప్రభుత్వం తక్కువ ధరకు అమ్మాల్సి రావడంతో నష్టం వాటిల్లినట్లు చెప్పారు. ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతున్నదని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ శాఖపై ఇతర బాధ్యతలు.. ‘వ్యవసాయ అధికారులపై ఇతర బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. రైతు బీమా ప్రారంభించిన నాడు కేవలం రూ.630 కోట్ల కిస్తీ చెల్లించాల్సి వచ్చేది. రైతులు తమ కుటుంబ సభ్యులందరికీ బీమా వర్తింపజేయాలనే ఉద్దేశంతో తమకున్న భూమిని వారి పేర రిజిస్టర్ చేయించడంతో రైతుల సంఖ్య పెరిగింది. ప్రీమియం దాదాపు రెట్టింపైంది. కిస్తీ ఏడాదికి రూ.1,144 కోట్లు కట్టాల్సి వస్తోంది. అయినా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనే నిర్ణయించుకుంది. సాగుకు 24 గంటల ఉచి త విద్యుత్ సరఫరా, సకాలంలో నాణ్యమైన, కల్తీలేని విత్తనాలు, ఎరువులు, పురుగు మం దులు రైతులకు అందేట్లు చూడాలి. కల్తీలను, నకిలీలను గుర్తించి అరికట్టాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మరిన్ని పరిశోధనలు జరగాలి. కొత్త వంగడాలను సృష్టిం చాలి. వ్యవసాయదారులకు ఆధునిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలి’అని అంతా అభిప్రాయపడ్డారు. నియంత్రిత సాగు అవసరం లేదు... ‘రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతు ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదు. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలి. ఈ విధానం ఉత్తమం. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతోంది. ఈ వేదికల్లో రైతులు, అధికారులు సమావేశం కావాలి. స్థానిక, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేయాలనేది నిర్ణయించాలి. మద్దతు ధర వచ్చేందుకు అనువైన వ్యూహం ఎక్కడికక్కడ రూపొందించుకోవాలి’అనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. 28 నుంచి రైతుబంధు పంపిణీ నేటి నుంచి వచ్చే నెల (జనవరి–2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు కింద ఆర్థిక సాయం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు, ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 రబీ సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్లను పెట్టుబడి సాయంగా అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంక్‌లో జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీ రామారావు, ఎస్.నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. -
అన్నదాతంటే అలుసా..!
- నిలిచిన మొక్కజొన్న కొనుగోళ్లు - ఆగ్రహించిన రైతులు జాతీయరహదారి దిగ్భంధం అలంపూర్ / కల్వకుర్తి రూరల్ : జిల్లాలో మొక్కజొన్న రైతుల పరి స్థితి నానాటికి దారుణంగా మారుతోంది. పంట కొనుగోలుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనూ గిట్టుబాటు ధర లభించక, గన్నీ బ్యాగ్‌లు లేక కొనుగోళ్లు నిలిచిపోయాయి. దాదాపు పది రోజులుగా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా మార్కెఫెడ్ అధికారులు పట్టిం చుకోకపోడవంతో ఆగ్రహించిన రైతు లు సోమవారం అలంపూర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై, కల్వకుర్తి వద్ద శ్రీశైలం రహదారిపై ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మా ర్కెట్ యార్డులో కలుగోట్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో మార్కెఫెడ్ మొ క్కజొన్న కొనుగోళ్లను చేపట్టింది. అరుు తే డిమాండ్‌కు తగినట్లుగా గన్నీ బ్యాగ్ లు సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు పది రోజులుగా ఇదే సమస్య పునరావృతమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కేంద్రం నిర్వాహకులు సైతం గన్నీ బ్యాగ్‌లు సరఫరా చేయాలని కోరినా స్పందించకపోవడంతో సోమవారం కొనుగోళ్లను నిలిపివేశారు. దీనికితోడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాంలకు తరలించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు పంటను అమ్ముకున్నా మార్కెట్లోనే పడిగాపులు కాయూల్సి వస్తోంది. దీం తో ఆగ్రహించిన అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి, ఇటిక్యాల మండలాల కు చెందిన రైతులు జాతీయరహదారిని దిగ్భంధించారు. అరగంటపాటు రోడ్డు పై బైఠాయించి, మార్కెఫెడ్ డీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చే యాలని, గన్నీ బ్యాగ్‌లు సరఫరా చే యూలని, కొన్న ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించాలని డిమాండ్ చేశారు. అరుుతే ఆందోళన చేస్తున్న రైతు ల వద్దకు అధికారులెవరూ రాకపోవడం గమనార్హం. దీంతో జాతీయరహదారిపై వాహనాలు బారులు తీరాయి. ప్రయాణీకులు, వాహనదారులు వేడుకోవడంతో రైతులు ఆందోళన విరమించారు. రాష్ట్ర ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది: ఆచారి బంగారు తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తూ, రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి అన్నారు. కల్వకుర్తి మార్కెట్ యూర్డులో మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేయడంతో కల్వకుర్తి, మిడ్జిల్ మండలాలకు చెందిన రైతులు దాదాపు 10 గంటల పాటు ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. రైతులు మార్కెట్‌కు తెచ్చిన కొనుగోలు చేయకుండా తిరస్కరించడం దారుణమన్నారు. పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై మొక్కజొన్నలకు నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్ వైఖరిని నిరసిస్తూ వ్యవసాయ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో స్థానిక సీఐ వెంకట్, ఎస్సై మగ్దూంఅలీ అక్కడికి చేరుకొని మార్కెఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడగా, మార్కెట్‌కు వచ్చిన మొక్కజొన్న ను పూర్తిగా కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన ధర్నా విరమించారు.