ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం దారుణం
ఆగస్టు 5న చర్చల్లోనైనా మద్దతు ఇవ్వలంటూ ధర్నా
డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం సిటీ : ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకు పార్లమెంట్‌లో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లుకు టీడీపీ, బీజేపీలు మద్దతు తెలపక పోవడడం దారుణమని, ఇప్పటికైనా స్పందించి ప్రత్యేక హోదా సాధనకు పార్టీలకు అతీతంగా కృషి చేయాల్చి ఉందని డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ డిమాండ్ చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కంబాలచెరువు సెంటర్‌లో చేపట్టిన ఆందోళనలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఇప్పటికైనా హోదా తెచ్చేందుకు సానుకూలంగా ఉంటే ఆగస్టు 5న మరోసారి పార్లమెంట్‌లో బిల్లు చర్చకు రానుందని, అప్పుడైనా ఇరుపార్టీలు దాటవేత ధోరణిమాని మద్దతు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాయుడు సతీష్, దాసి వెంటకరావు, కొళ్ళి మళ్ల రఘు, ముళ్ళ మాధవ్, గోలిరవి ,చిక్కాల బాబు తదితరులు పాల్గొన్నారు.