- వైఎస్సార్ సీపీతో పాటు పలు సంఘాలు సంఘీభావం
కాంట్రాక్ట్ లెక్చరర్లు కలెక్టరేట్ ముట్టడి
Published Tue, Nov 29 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
కాకినాడ సిటీ :
సమస్యల పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జాయింట్ యాక్ష¯ŒS కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముట్టడించారు. మందుగా కలెక్టరేట్ వద్ద నిరసన శిబిరంలో మధ్యాహ్నం వరకు డిమాండ్లతో కూడిన ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ గేటు మందు బైఠాయించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదించారు. శిబిరాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, సీఐటీయూ నాయకులు అజయ్‌కుమార్, ఏఐటీయూసీ నాయకులు తోకల ప్రసాద్, మాలమహానాడు జాతీయ అధ్యక్షులు ధనరాశి శ్యామ్‌సుందర్ తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకి వినతిపత్రం ఇచ్చేందుకు జేఏసీ నాయకులు యార్లగడ్డ రాజచౌదరి, పి.వీరబాబు, కె.లక్ష్మిదేవి, దడాల శ్రీనివాస్, వాగు మాధవ్, కనకరాజు ఆద్వర్యంలోకాంట్రాక్ట్ లెక్చరర్లు వెళ్ళగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మంత్రికి విషయం చెప్పగా ఆయన కాంట్రాక్ట్ లెక్చరర్ల వద్దకు వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఈసందర్బంగా ఎమ్మెల్సీ సూర్యారావు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించక పోతే ప్రోగసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరుపున ఆమరణదీక్ష చేపడతానన్నారు.
మానవతా దృక్పథం లేదు : కన్నబాబు
కాంట్రాక్ట్ లెక్చరర్లపై ప్రభుత్వానికి కనీస సానేభూతి, మానవతా దృక్పథ ఆలోచనలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళనలో పాల్గొని మద్దతు పలికారు. ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్‌్సపై ఎలాంటి ఆందోళనలు చేసినా వైఎస్సార్ సీపీ వెన్నంటి ఉంటుందన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి దృష్టికి తీసుకువెళ్ళతానన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధానకార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్ధుల్ బషీరుద్ధీ¯ŒS తదితరులు పాల్గొన్నారు.
Advertisement