at collectorate
-
కాపులను బీసీల్లో చేరిస్తే ఉద్యమిస్తాం
– బీసీ సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరిక – కలెక్టరేట్ ముట్టడికి యత్నం, అరెస్టు చేసిన పోలీసులు అనంతపురం అర్బన్ : బీసీల హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తోందని, కాపులను బీసీల్లోకి చేర్చుతామని పదే పదే చెబుతోందని, అదే జరిగితే పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరించారు. బీసీ హక్కులను పరిరక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సి.రమేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడికి నాయకులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అంతకు ముందు కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జాతీయ కార్యదర్శి బోరంపల్లి ఆంజనేయులు, ఎస్.ఆర్.నాగభూషణం, మహిళ అధ్యక్షురాలు కృష్ణవేణి, మైనార్టీ నాయకులు సి.జాఫర్, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గాల నాయకులు మాట్లాడారు. బీసీల హక్కులను కాలరాసేలా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు. బీసీ సంక్షేమాన్ని విస్మరించే పార్టీలకు పుట్టగతులుండవన్నారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీ సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం కేటాయించాలన్నారు. బ్యాంకులు, జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండా బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అర్హులైన బీసీలకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు జోగి రాజేంద్ర, అనిల్‌కుమార్, ముట్టాల శ్రీనివాసులు, దాసరి శ్రీనివాసులు, సంపంగి గోవర్ధన్, కోటకొండ కిష్టప్ప, జయపాల్ యాదవ్, నియోజకవర్గాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
కదంతొక్కిన అంగన్వాడీలు
అనంతపురం అర్బన్ : అంగన్వాడీలు తమ సమస్యలపై కదం తొక్కారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బి.కె.ఉషారాణి అధ్యక్షతన జరిగిన ఆందోళనకు ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జి.ఓబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడమే తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాలకూ ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా వేసవి సెలవులు వర్తింపజేయాలన్నారు. కేంద్రాల అద్దెలు, టీఏ, డీఏ, కూరగాయలు, గ్యాస్‌కు సంబంధించిన డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదన్నారు. అంగన్వాడీ వర్కర్లకు వేతనం రూ.10,500, హెల్పర్లకు రూ.6,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన అంగన్వాడీ వర్కర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష ఇవ్వడంతోపాటు, ఆఖరి నెల వేతనంలో సగం మొత్తం పెన్షన్‌గా ఇవ్వాలన్నారు. చనిపోయిన వారికి బీమా డబ్బు చెల్లించాలన్నారు. అంగన్వాడీలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ జి.వీరపాండియన్‌కి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వనజ, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి, శ్రామిక మహిళ కన్వీనర్ దిల్షాద్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఎస్.వెంకటేశ్, అంగన్వాడీ సంఘం నాయకురాళ్లు నక్షత్ర, నాగేశ్వరమ్మ, శ్యామల, సత్యలక్ష్మి, శకుంతలమ్మ, కళావతి, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమంపై ఉక్కుపాదం!
– నేడు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తల ధర్నా – సీఎం రాక నేపథ్యంలో అప్రమత్తమైన మంత్రి సునీత – తన నివాసంలో ఐసీడీఎస్ అధికారులతో భేటీ – యూనియన్ నేతలను పిలిపించి పరోక్ష హెచ్చరికలు? – కార్యకర్తలను పంపొద్దంటూ సీడీపీఓలకు ఉన్నతాధికారుల ఆదేశాలు – తీవ్ర ఒత్తిళ్లతో ధర్నా వాయిదా వేసుకున్న వైనం! నెలల తరబడి జీతాల్లేవ్.. కేంద్రాలు నిర్వహిస్తున్న భవన యజమానులకు చెల్లించేందుకు అద్దెలూ రావడం లేదు.. టీఏ, డీఏల్లేవ్.. కూరగాయలు, వంట గ్యాస్ డబ్బులు సక్రమంగా అందడం లేదు.. అప్పు చేసి ఇంతకాలం సెంటర్లను నిర్వహించుకుంటూ వచ్చిన అంగన్వాడీలు ఇకపై తమవల్ల కాదంటూ ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 20 (నేడు)న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాల్సిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత.. అందుకు విరుద్ధంగా అంగన్వాడీల ఉద్యమంపై ఉక్కుపాద మోపారు. పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తూ బెదిరింపులకు దిగి ధర్నా వాయిదా వేసుకునేలా చేశారు. - అనంతపురం టౌన్ జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద 17 ప్రాజెక్టుల్లో 5,126 మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటన్నింటిలో కలిసి 4,082 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 3,698 మంది ఆయాలు పని చేస్తున్నారు. ప్రతి నెలా వీరికి జీతాల కష్టాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి జీతాలు అందలేదు. సుమారు రూ.18 కోట్ల వరకు బకాయిలు అందాల్సి ఉంది. గర్భిణులు, చిన్నారుల ట్రాకింగ్ ఖర్చుల భారం మొత్తం అంగన్వాడీ కార్యకర్తలపైనే పడుతోంది. తీవ్రమైన పని ఒత్తిడితో పాటు హెల్పర్ లేని చోట వర్కర్లకు, వర్కర్ లేని చోట హెల్పర్, మినీ అంగన్వాడీ వర్కర్లకు వేసవి సెలవులూ మంజూరు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా సెంటర్ అద్దెలు, టీఏ, డీఏ, కూరగాయలు, గ్యాస్‌కు సంబంధించిన డబ్బులు కూడా అందకపోవడంతో సెంటర్ల నిర్వహణ భారంగా మారుతోంది. తాజాగా తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్ విధానం వల్ల కూడా సమస్యలు ఎదుర్కొంటున్నామన్నది అంగన్వాడీల వాదన. ఈ సమస్యలపై గతంలోనే ఐసీడీఎస్ అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఏపీ అంగన్వాడీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 20న (నేడు) అనంతపురం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిర్ణయించింది. ఈ విషయంపై ఈ నెల 17వ తేదీనే ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగంకు సమాచారం కూడా ఇచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. పామిడి, అనంతపురంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో అప్రమత్తమైన మంత్రి సునీత బుధవారం నేరుగా రంగంలోకి దిగారు. ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, అదనపు పీడీ ఉషాఫణికర్ను తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలోనే అంగన్వాడీ వర్కర్లు ఆందోళన చేస్తే తన పరువుపోతుందని గ్రహించిన మంత్రి.. తొలుత ఉపశమన చర్యలకు దిగారు. ఫలితంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను జిల్లా కేంద్రానికి రాకుండా చూసుకోవాలని సీడీపీఓలకు ఐసీడీఎస్ అధికారులు ఫోన్లు చేసి హెచ్చరించారు. అనంతరం నేరుగా మంత్రి నివాసానికే యూనియన్ నేతలను పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా ధర్నా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని వారికి మంత్రి సునీత సూచించారు. ఆ తర్వాత ఐసీడీఎస్ అధికారులు కూడా యూనియన్ నేతలకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. గతంలో అంగన్వాడీలు ఆందోళన చేసిన నేపథ్యంలో ఉద్యోగాల్లోంచి తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో సదరు యూనియన్ నేతలు ప్రాజెక్టుల్లోని నాయకులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఉన్న ఉద్యోగం ఊడితే తాము బజారున పడాల్సి వస్తుందని భావించి వారు కూడా సరేనన్నట్లు సమాచారం. అనంతరం మంత్రి నివాసం నుంచే రాష్ట్ర కమిటీ నేతల దృష్టికి కూడా ఇక్కడి పరిస్థితిని యూనియన్ జిల్లా కమిటీ నేతలు వివరించారు. చివరకు ఈనెల 24న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. వాయిదా నిర్ణయాన్ని యూనియన్ నేతలు ధ్రువీకరించగా... 24న కూడా ఉద్యమించే పరిస్థితి కన్పించడం లేదు. రోడ్డెక్కడం మంచిదికాదు : మంత్రి సునీత చిన్న చిన్న సమస్యలకు అంగన్వాడీలు రోడ్డెక్కడం మంచిది కాదని మంత్రి సునీత తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు చేయడం వల్ల సమస్యలు తీరవన్నారు. సమస్యల్ని తన దృష్టికి తెస్తే అధికారులు, ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. బకాయిలు చెల్లించడానికి ఉత్తర్వులు ఇచ్చామని, చెల్లింపులు జరుగుతున్నట్లు తెలిపారు. -
రూ.5 వేల కోట్లివ్వాలి
-కరువు నివారణకు రైతుసంఘం డిమాండ్ – కలెక్టరేట్ ఎదుట ధర్నా – రాగి గంజి తాగి నిరసన అనంతపురం అర్బన్ : జిల్లాలో కరువు నివారణకు తక్షణమే రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం (సీపీఎం అనుబంధం) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నాయకులు రాగి గంజి తాగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ జిల్లాలో వరుస కరువులతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. 63 మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం.. సహాయక చర్యలు చేపట్టడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. ఉపాధి కరువై లక్షలాది మంది రైతులు, కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నా.. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. ఖరీఫ్‌లో పంట నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.19,500 పరిహారం ఇవ్వాలని, వేరుశనగకు ఫసల్ బీమా వర్తింపజేయాలని, పాడి రైతులను ఆదుకునేందుకు పాల ధరలు పెంచాలని డిమాండ్ చేశారు. కరువు దృష్ట్యా లీటరుపై రూ.5 ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. పంట రుణాలు రీషెడ్యూల్ చేసి.. 4 శాతం వడ్డీతో కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు నిబంధనలతో పని లేకుండా రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. ప్రతి రైతుకు నెలకు రూ.5 వేల పింఛన్ చెల్లించాలన్నారు. కార్యక్రమలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తరిమెల నాగరాజు, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు నాగేశ్, పెద్దన్న, వినోద్, శ్రీనివాసులు, జయచంద్రారెడ్డి, రామాంజినేయులు, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు. -
‘ఆరోగ్యశ్రీ’ అంటే అంత నిర్లక్ష్యం దేనికీ..?
– 9న కలెక్టర్ ఎదుట ధర్నాను విజయవంతం చేయండి – వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ పిలుపు అనంతపురం : పేద వర్గాలకు వరంగా మారిన ఆరోగ్యశ్రీని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దీన్ని నిరసిస్తూ ఈనెల 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తెలిపారు. ప్రతి ఒక్కరూ ధర్నాకు హాజరై విజయవంతం చేయాలని ఓ ప్రకటనలో పిలుపుఽనిచ్చారు. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్పు చేసినా నిధులు మాత్రంమంజూరు చేయడం లేదని వాపోయారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేదలు పైసా ఖర్చు లేకుండా చేయించుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం చాలా ఆస్పత్రుల్లో గుండె, కిడ్నీ తదితర చికిత్సల కోసం అనుమతులకు పంపితే తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఇప్పటికే వైద్య చికిత్సలు చేసిన కార్పొరేట్ ఆస్పత్రులకు లక్షలాది రూపాయలు బిల్లులు బకాయిలు ఉన్నారని చెప్పారు. ఆదాయం తెచ్చిపెట్టె వివిధ ప్రాజెక్టులకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేదలకు ఆరోగ్య చికిత్సలు చేయించేందుకు నిధులు లేమి అంటూ మాట్లాడుతోందని ఇంతకంటే దుర్మార్గమేముందని ప్రశ్నించారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్లు కలెక్టరేట్ ముట్టడి
వైఎస్సార్ సీపీతో పాటు పలు సంఘాలు సంఘీభావం కాకినాడ సిటీ : సమస్యల పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జాయింట్ యాక్ష¯ŒS కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముట్టడించారు. మందుగా కలెక్టరేట్ వద్ద నిరసన శిబిరంలో మధ్యాహ్నం వరకు డిమాండ్లతో కూడిన ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ గేటు మందు బైఠాయించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదించారు. శిబిరాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, సీఐటీయూ నాయకులు అజయ్‌కుమార్, ఏఐటీయూసీ నాయకులు తోకల ప్రసాద్, మాలమహానాడు జాతీయ అధ్యక్షులు ధనరాశి శ్యామ్‌సుందర్ తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆర్అండ్బీ అతిథిగృహంలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకి వినతిపత్రం ఇచ్చేందుకు జేఏసీ నాయకులు యార్లగడ్డ రాజచౌదరి, పి.వీరబాబు, కె.లక్ష్మిదేవి, దడాల శ్రీనివాస్, వాగు మాధవ్, కనకరాజు ఆద్వర్యంలోకాంట్రాక్ట్ లెక్చరర్లు వెళ్ళగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మంత్రికి విషయం చెప్పగా ఆయన కాంట్రాక్ట్ లెక్చరర్ల వద్దకు వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఈసందర్బంగా ఎమ్మెల్సీ సూర్యారావు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించక పోతే ప్రోగసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరుపున ఆమరణదీక్ష చేపడతానన్నారు. మానవతా దృక్పథం లేదు : కన్నబాబు కాంట్రాక్ట్ లెక్చరర్లపై ప్రభుత్వానికి కనీస సానేభూతి, మానవతా దృక్పథ ఆలోచనలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళనలో పాల్గొని మద్దతు పలికారు. ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్్సపై ఎలాంటి ఆందోళనలు చేసినా వైఎస్సార్ సీపీ వెన్నంటి ఉంటుందన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి దృష్టికి తీసుకువెళ్ళతానన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధానకార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్ధుల్ బషీరుద్ధీ¯ŒS తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ వద్ద ధర్నాల హోరు
కాకినాడ సిటీ : సమస్యలపై వివిధ సంఘాలు చేపట్టిన ఆందోళనలతో సోమవారం కలెక్టరేట్ హోరెత్తింది. కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట ధర్నా అనంతరం ఆయా సంఘాల నాయకులు అధికారులకు తమ డిమాండ్లను వివరిస్తూ వినతిపత్రాలు అందజేశారు. తొండంగి మండలంలో దివీస్ ఫార్మా కంపెనీ నిర్మాణ పనులు తక్షణం నిలిపివేయాలని కోరుతూ దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆ ప్రాంత ప్రజలు ధర్నా నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కంపెనీ వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డునపడే పరిస్థితి ఉందని, భూములు కోల్పోవడంతో తమ జీవితాలు అగమ్యగోచరంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్ 144ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు మద్ధతు తెలిపిన సీపీఎం నాయకులు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయ్యాక ప్రభుత్వ అనుమతి, పర్యావరణశాఖ అనుమతి కూడా రాలేదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు జి.బేబిరాణి, బాధిత ప్రజలు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థుల సమస్యలపై.. కాకినాడ పీఆర్ ఆర్ట్స్ జూనియర్ కళాశాల, ఒకేషనల్ కలాశాలల్లో సమస్యలపై ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆందోళన నిర్వహించింది. ఆర్ట్స్ కళాశాలకు రూ.5 కోట్లు, ఒకేషనల్ కళాశాలకు రూ.3 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలని, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, 2015–16 సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థుల ఉపకార వేతన బకాయిలు విడుదల చేయాలని, లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బి.సిద్ధు, నాయకులు శివాజీ, వంశీ, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి కాకినాడ పర్లోవపేట శివారు మహాత్మాజ్యోతిరావుఫూలే కాలనీలోని అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ధర్నా నిర్వహించింది. బాధితులకు నేటికీ సహాయం అందలేదదని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు అన్నారు. బాధితులందరికీ పట్టాలు పంపిణీ చేసి పక్కాగృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ నాయకులు వి.రామన్న, రాజబాబుతో పాటు బాధిత కుటుంబాలు పాల్గొన్నాయి. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగుల ధర్నా వివిధ డిమాండ్లతో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. హెచ్ఐవీ నిరోధించానికి ప్రచారం చేస్తున్న తమ పరిస్థితి దయనీయంగా ఉందని ఎయిడ్స్ నియంత్రణ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు పేర్కొన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా ఒకటవ తేదీన వేతనాలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్‌కుమార్, కార్యదర్శి రాంబాబు, నాయకులు ఎ.గిరిబాబు, డి.నాగమణి పాల్గొన్నారు. నిర్బంధ కాండను మానుకోవాలి ప్రజాస్వామ్యవాదులపై కేంద్రం అవలంబిస్తున్న నిర్బంధకాండను మానుకోవాలని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఉన్నత విద్యాలయాలపైన, జర్నలిస్ట్‌లు, విద్యార్థులు, లౌకికవాదులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వంటి హిందుత్వ మూకలు దాడులు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అసోసియేషన్ నాయకులు జె.నాగేశ్వరరావు, పి.శ్రీనివాస్, జె.అచ్చిరాజు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా
ఆదిలాబాద్ అర్బన్ : నిత్యావసర వస్తువుల అధిక ధరలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, తదితర అంశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం కలెక్టరేట్ ఎదుట సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎస్. విలాస్ మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో పేద ప్రజలు ఒక పూట భోజనం చేయకుండానే నిద్రిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ రంగానికి దాసోహమంటూ రాయితీలపై రాయితీలు ఇస్తుందని మండిపడ్డారు. అధిక ధరలతో సతమతకావడమే కాకుండా నిరుద్యోగం, ఆకలి, పేదరికం బారిన పడడం జరుగుతుందని పేర్కొన్నారు. అధిక ధరలను తగ్గించాలని, సార్వత్రిక ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని, ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దొంగ నిల్వదారులు, బ్లాక్ మార్కెట్‌దారులు, కల్తీ వ్యాపారులను కఠినంగా శిక్షించాలని, ఆహార పదార్థాల దిగుమతులు ఆపాలని డిమాండ్ చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిలువరించాలని, గుత్త సంస్థల నియంత్రణ చట్టాన్ని పునరుద్దరించాలని, నల్లధనాన్ని జప్తు చేసి దేశానికి తిరిగి తీసుకురావాలని అనంతరం కలెక్టర్ ఎం.జగన్మోహన్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నళినిరెడ్డి, సీపీఐ ఆదిలాబాద్ పట్టణ కార్యదర్శి అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శి లక్ష్మయ్య, నాయకులు దేవేందర్, భాస్కర్, కుంటాల రాములు, గంగారెడ్డి, నందయ్య, నర్సింగ్‌రావు, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ రిప్‌లకు గుర్తింపుకార్డులివ్వాలి
ఏలూరు(సెంట్రల్) : మెడికల్ అండ్ సెల్స్ రిప్రజెంటేటివ్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని సీఐటీయూ నాయకుడు పి.కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ అండ్ సెల్స్ రిప్రజెంటేటివ్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.దక్షిణమూర్తి మాట్లాడుతూ మెడికల్ రిప్లు ప్రజల రోగాల నివృత్తిలో కీలకపాత్ర పోషిస్తున్నారని, వారిని అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులుగా గుర్తించి వారికి కార్మిక శాఖ గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. అలానే కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు వారికి వేజ్‌బోర్డును ఏర్పాటు చేసి, సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల చట్టాలను యాజమాన్యాలు ఖచ్చితంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దీక్షకు సీఐటీయూ, ఐఎన్టీయూసీ సంఘలతో పాటు పలువురు డాక్టర్లు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ సెల్స్ రిప్రజెంటేటివ్స్ సంఘం నాయకులు వీవీవీఎన్ ప్రసాద్, ఎల్.మోహన్‌మురళీ, ఎ.మహేష్‌కుమార్, జి.ఫణేంద్ర, పి.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
జీవో 43ను ఉపసంహరించాలంటూ ధర్నా
ఏలూరు (సెంట్రల్) : పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం విడుదల చేసి జీవో నంబర్ 43ను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏపీ అర్బన్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నానుద్దేశించి యూనియన్ జిల్లా కార్యదర్శి బి.సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేట్ వారికి అప్పగించేందుకు ప్రయత్నం చేస్తుందని దాని కోసం తెచ్చి జీవో 43ను ఇచ్చిందన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని యధావిధిగా కొనసాగించాలని లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో యూనియన్ నాయకులు బి.బెనర్జీ, ఎన్.అంజలి, ఎండీ రిజియాన్, ఆర్.వెంకటేశ్వరరావు, సీహెచ్.రత్నం పాల్గొన్నారు. జూట్ కార్మికుల ధర్నా జూట్ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద జూట్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర కార్యదర్శి పి.కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది జూట్ కార్మికులు పనిచేస్తారని, వారికి కనీసవేతనం అమలు కావడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా జూట్ కార్మికులకు వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని, కనీసవేతనం రూ.18 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బి.జగన్నాధం, వి.సాయిబాబు, డి.దుర్యోదన. పి.మాణిక్యలరావు, పి.సత్తిరాజు పాల్గొన్నారు.