– 9న కలెక్టర్ ఎదుట ధర్నాను విజయవంతం చేయండి
– వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ పిలుపు
అనంతపురం : పేద వర్గాలకు వరంగా మారిన ఆరోగ్యశ్రీని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దీన్ని నిరసిస్తూ ఈనెల 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తెలిపారు. ప్రతి ఒక్కరూ ధర్నాకు హాజరై విజయవంతం చేయాలని ఓ ప్రకటనలో పిలుపుఽనిచ్చారు. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్పు చేసినా నిధులు మాత్రంమంజూరు చేయడం లేదని వాపోయారు.
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేదలు పైసా ఖర్చు లేకుండా చేయించుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం చాలా ఆస్పత్రుల్లో గుండె, కిడ్నీ తదితర చికిత్సల కోసం అనుమతులకు పంపితే తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఇప్పటికే వైద్య చికిత్సలు చేసిన కార్పొరేట్ ఆస్పత్రులకు లక్షలాది రూపాయలు బిల్లులు బకాయిలు ఉన్నారని చెప్పారు. ఆదాయం తెచ్చిపెట్టె వివిధ ప్రాజెక్టులకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేదలకు ఆరోగ్య చికిత్సలు చేయించేందుకు నిధులు లేమి అంటూ మాట్లాడుతోందని ఇంతకంటే దుర్మార్గమేముందని ప్రశ్నించారు.
‘ఆరోగ్యశ్రీ’ అంటే అంత నిర్లక్ష్యం దేనికీ..?
Published Tue, Dec 6 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
Advertisement