shankar narayana
-
జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలపై అఖిలపక్ష నేతల ఆగ్రహం
సాక్షి, అనంతపురం : జిల్లాలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఎస్పీ కార్యాలయంలోకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్రించిన అఖిలపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రిలో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసులను ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించినా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యమని అఖిల పక్ష నేతలు మండిపడ్డారు. అంతేకాదు సాక్షి విలేకరిపై జేసీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని, జేసి బ్రదర్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిల పక్ష నేతలు ప్రెస్ క్లబ్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు. ఇందులో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి వైఎస్ఆర్సీపీ సమన్వయ కర్త పెద్దారెడ్డి, హిందూపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఆధ్యక్షులు శంకర్ నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ పాల్గొన్నారు. -
హామీలను హరించిన 420 చంద్రబాబు
– హంద్రీనీవా దివగంత నేత వైఎస్సార్ పుణ్యమే – విలేకరులతో జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ రొద్దం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను హరించిన 420 చంద్రబాబునాయుడు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన రొద్దం మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకుడు ఆర్ఏ రవిశేఖరరెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. హంద్రీనీవాకు తానే శంకుస్థాపన చేశానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో 2004 వరకు హంద్రీనీవా పునాది రాళ్లకే పరిమితమైన సంగతి ప్రజలకు తెలుసని చెప్పారు. దివగంత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనీవా పథకానికి శంకుస్థాపన చేసి రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్ చొరవతోనే జీడిపల్లి, గొల్లపల్లి ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. ఇప్పుడు కృష్ణాజలాలు అనంతకు వస్తుంటే వాటిని తానే తెచ్చానంటూ చంద్రబాబు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాజుల కాలంలో కట్టించిన చెరువులు వర్షం నీటితో నిండుతుంటే వర్షాలను తానే కురిపించానని సీఎం, మంత్రులు పక్కా ప్రణాళికతో జలహారతి పేరుతో ప్రజా సమస్యలను తప్పదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మారుతిరెడ్డి, జిల్లా అధికారి ప్రతినిధి చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు వజీర్‌బాషా, లక్ష్మీనారాయణరెడ్డి, కాటిమ తిమ్మారెడ్డి, సీనియర్ నాయకుడు రంగయ్య, మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు. -
అర్హులకు రాయితీ అందకుంటే ఉద్యమం
చిలమత్తూరు : అర్హులైన రైతులందరికీ పంట రాయితీ అందకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన చిలమత్తూరులో ముస్లిం సోదరుల వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పంట రాయితీ ఏకపక్షంగా జమ అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కడ స్థాపించారో చెప్పాలని ప్రశ్నించారు. రాగ మయూరి ఎల్సీనా పరిశ్రమ, సెంట్రల్ ఎక్సైజ్ అకాడమీ తదితర పరిశ్రమలు ఏర్పాటు కాలేదని విమర్శించారు. పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి తక్కువ నష్టపరిహారం రైతులకు ఇచ్చి టేకులోడు, నల్లబొమ్మనపల్లి, ఆరుమాకులపల్లి గ్రామాల రైతులతో 210 ఎకరాల భూములు సేకరించారని ఎద్దేవా విమర్శించారు. పెనుకొండ, గొల్లపల్లి, అమ్మవారిపల్లి గ్రామాల సమీపంలో కార్ల పరిశ్రమ ఏర్పాటుకు కూడా అధికార పార్టీ నేతల రియల్ ఎస్టేట్‌కు అనుకూలంగా మారిందని మండిపడ్డారు. ఆయనతో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కన్వీనర్లు వెంకటరత్నం, సుధాకర్‌రెడ్డి, కొండలరాయుడు, రాజగోపాల్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, యాసీన్, తుంగోడు నారాయణరెడ్డి, స్థానిక నాయకులు జబీవుల్లా, లక్ష్మీనారాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా పోరాటాలకు సిద్ధం
- ప్రభుత్వ పెద్దల అవినీతిపై ప్రజలను చైతన్య పరుస్తాం - కరువుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు - పెనుకొండ వైఎస్సార్సీపీ ప్లీనరీలో జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ పెనుకొండ (అనంతపురం) : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జనాన్ని చైతన్యపరుస్తూ.. పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. కరువుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కరువు కాటకాలతో ప్రజల జీవితాలు ఛిద్రమవుతున్నాయని అన్నారు. పెనుకొండ పట్టణంలోని వన్షికా గ్రాండ్ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. సీఎంగా గద్దెనెక్కిన తర్వాత తన హామీలను మాఫీ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అనైతిక పాలనతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. పట్టిసీమ, హంద్రీ-నీవా ప్రాజెక్ట్‌లలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు కోసం సేకరించిన భూములకు ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున రైతులకు పరిహారం చెల్లిస్తే.. అదే ఎకరా భూమిని చదును చేయడానికి రూ. 29.75 లక్షలు కేటాయించారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. బెల్, నాసన్ పరిశ్రమల ఏర్పాటు శిలాఫలకాలకే పరిమితమయ్యాయన్నారు. ఎమ్మెల్యే బీకే పార్థ«సారథి, ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇసుకను అక్రమంగా కర్ణాటకలోని బెంగళూరు, తుమకూరుకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ అక్రమాన్ని ప్రశ్నించిన వారిపై దాడులకు ఉసిగొల్పుతున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు దోపిడీ పాలనకు ముగింపు పలికేలా ప్రజలను చైతన్యపరుస్తూ, వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... మరో 365 రోజులు గడిస్తే ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని, ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇటీవల జిల్లాలో జరిగిన టీడీపీ మహానాడులో జిల్లా కరువు గురించి గానీ, రైతు ఆత్మహత్యలు, కష్టాల గురించి గానీ చర్చించిన పాపాన పోలేదన్నారు. విశాఖలో జరిగిన మహానాడులోనూ ప్రజాసమస్యలపై చర్చించడంలో సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, ఇతర నాయకులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. టీడీపీ మూడేళ్ల పాలన మొత్తం అవినీతిమయమన్నారు. వైఎస్ పాలనలో వలసలు, రైతు ఆత్మహత్యలకు అవకాశం ఉండేది కాదన్నారు. వేరుశనగ చెట్లకు కాయలు కాయకపోయినా డబ్బులు కాయిస్తామంటూ రైతన్నలకు భరోసా ఇచ్చిన మహా మనిషి వైఎస్సార్ అని కొనియాడారు. ప్రస్తుతం కరువు నివారణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా టీడీపీ అడ్డుకుందన్నారు. దీనివల్ల నిరుద్యోగ సమస్య పెరిగి, యువతతో పాటు భావితరాలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. టీడీపీ అవినీతిని కాలరాయాలంటే జగన్‌ను సీఎం చేయాలన్నారు. పార్టీ పరిశీలకులు నర్సేగౌడ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితమై జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పెనుకొండ మండల కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, సోమందేపల్లి కన్వీనర్ వెంకటరత్నం, గోరంట్ల కన్వీనర్ ఫకృద్దీన్, రొద్దం కన్వీనర్ నారాయణరెడ్డి, పరిగి కన్వీనర్ జయరాం, టౌన్ కన్వీనర్ ఏనుగుల ఇలియాజ్, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, సరస్వతమ్మచంద్రారెడ్డి, రాజగోపాలరెడ్డి, లక్ష్మానాయక్, పద్మావతమ్మ, ఎంపీటీసీ సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, ఉమర్ ఫరూక్, మురళి, రహంతుల్లా, బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, లీగల్‌సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, సెంట్రల్‌బ్యాంక్ డైరెక్టర్ శంకరరెడ్డి, జిల్లా నాయకులు గంపల వెంకటరమణారెడ్డి, బూదిలి వేణుగోపాలరెడ్డి, ఎస్బీశీనా, నియోజకవర్గంలోని సింగిల్ విండో అధ్యక్షులు, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. -
నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్యే
అనంతపురం : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదుగుతుండడంతో వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో ఓర్వలేక ప్రభుత్వమే ఈ ఘాతుకానికి ప్రోత్సహించిందంటూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హత్యారాజకీయాలకు అండగా నిలుస్తున్నారని ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నారాయణరెడ్డి హత్యకేసు దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని, అసలు దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. -
కరువు సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం
- ఇన్పుట్ సబ్సిడీ, బీమా వెంటనే ఇవ్వాలి - వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ డిమాండ్ - సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా సోమందేపల్లి : ‘రాష్ట్రంలో 1965 తర్వాత అంతటి పెద్దకరువు ఈ ఏడాది వచ్చింది. కనిష్ట వర్షపాతం నమోదు కావడంతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. రైతాంగం కుదేలయ్యే పరిస్థితులు దాపురించాయి. కరువు సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైంద’ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ విమర్శించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రైతుధర్నాలో ఆయన మాట్లాడారు. గత ఏడాది జిల్లాలో రూ.4 వేల కోట్ల పంట పెట్టుబడులను రైతులు నష్టపోయారన్నారు. బీమా రూ.450 కోట్లు మాత్రమే మంజూరైందని, అది కూడా రైతులకు సకాలంలో ఇవ్వడం లేదని తెలిపారు. గత ఖరీఫ్‌లో జిల్లాలో వేరుశనగను కాపాడతామని రెయిన్గన్ల కోసం రూ.160 కోట్లు ఖర్చు చేసిన పాలకులు.. కనీసం ఎకరా కూడా కాపాడలేకపోయారని విమర్శించారు. ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమాలో అర్హులైన రైతులకు అన్యాయం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. పంటలు లేక, ఉపాధి భారమై జిల్లా రైతులు కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి భిక్షాటన చేస్తున్నారని, ఈ దుస్థితి బాబు పాలనలోనే వచ్చిందని అన్నారు. ఎన్నికల ముందు రుణమాఫీ అని మభ్యపెట్టిన చంద్రబాబు జిల్లా రైతులను నిలువునా ముంచారన్నారు. పది లక్షల రైతు ఖాతాలు ఉంటే రెండు లక్షల మందికి కూడా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. తాగుబోతు, తిరుగుబోతులను జన్మభూమి కమిటీలలో నియమించి వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు రాకుండా చేశారన్నారు. టీడీపీ నేతలు ఇసుక, మట్టిని అక్రమంగా కర్ణాటకకు తరలించి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించుకుంటున్నారని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కాంట్రాక్ట్ పనులు, కమీషన్లపై ఉన్న మక్కువ ప్రజా సమస్యలపై లేకుండా పోయిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తిపోయారని, ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు వెంకటరత్నం, శ్రీకాంత్‌రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌లు నారాయణరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాబు నీతులు చెబుతారే గానీ పాటించరు
పెనుకొండ : ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సీఎం చంద్రబాబు నీతులు చెబుతారేగానీ పాటించరనే విషయం ప్రజలకు బాగా అర్థమయ్యిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అన్నారు. సోమవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని టీఆర్ఎస్లో చేరినప్పుడు ఇది రాజ్యాంగ వ్యతిరేకమని, తలసాని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు గవర్నర్, రాష్ట్రపతి భవన్ చుట్టూ తిరిగారన్నారు. దమ్ముంటే తలసాని శ్రీనివాసయాదవ్ విసిరిన సవాల్‌ను చంద్రబాబు స్వీకరించాలన్నారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమేకాక మంత్రి పదవులు కూడా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుకు చీము, నెత్తురూ ఉంటే వైఎస్సార్సీపీ తరఫున గెలిచి మంత్రి పదవులు పొందిన ఎమ్మెల్యేలను వెంటనే రాజీనామా చేయించి గెలిపించుకోవాలన్నారు. టీడీపీ పాలనలో మైనార్టీలు, ఎస్టీలకు మంత్రి పదవులు దక్కకుండా పోయాయని, బడుగుల పార్టీ అని చెప్పుకునే బాబు దానిని బడాబాబుల పార్టీగా మార్చేశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ను దూషించిన, అవినీతిపరులైన ఎమ్మెల్యేలకు తన ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పి తీరుతారన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్‌సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్‌రెడ్డి, మురళి, అనితాశ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, రాజగోపాలరెడ్డి, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, కొండలరాయుడు, ప్రసాద్, బోయనరసింహ, సోమశేఖరరెడ్డి, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ని చేసినా.. గెలుపు వెన్నపూసదే!
పెనుకొండ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడ్డారని, అయినప్పటికీ ఓటర్లు ప్రలోభాలకు తలొగ్గకుండా వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డికి ఓటు వేశారని పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల వద్ద పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తీరును పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రెండు మూడు రోజులుగా పల్లెలు, పట్టణాల్లో గ్రాడ్యుయేట్ల ఇళ్ల వద్దకు వెళ్లిన టీడీపీ నాయకులు త్వరలో నిరుద్యోగ భృతి ఇచ్చేది తామేనని, ఓటు వేయకపోతే నష్టపోతారని బెదిరించారన్నారు. దీనితోపాటు అందినకాడికి తాయిలాలు ఎరచూపి ఓటు వేయాల్సిందేనని ఒత్తిడి తెచ్చారన్నారు. అయినా ఓటర్లు తమ పార్టీ వైపే మొగ్గు చూపారని, గోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వెంట కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, పట్టణ కన్వీనర్ ఇలియాజ్, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి న్యాయవాది భాస్కరరెడ్డి, సర్పంచులు సుధాకరరెడ్డి, రాజగోపాలరెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్‌రెడ్డి, మురళి, అనితా శ్రీనివాసరెడ్డి, ఉమర్‌ఫారూక్, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరుబాబు తదితరులు ఉన్నారు. -
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
– వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పరిగి (పెనుకొండ రూరల్) : ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండలం పైడేటి గ్రామంలో జరిగిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో వారు విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు తదితర ఎన్నో లాభాలు రాష్ట్రానికి ఉంటాయన్నారు. తమిళనాడులో జల్లికట్టు కోసం నాలుగే రోజులు నిరసనలతో అక్కడి జనం దాన్ని సాధించుకున్నారన్నారు. 5 కోట్ల మంది జనాభా ఉన్న మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధించుకోలేమా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పార్టీలకతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాలు, మహిళలకు సెల్ఫోన్లు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించాడన్నారు. వచ్చే ఎన్నికల్లో బంగారు గాజులు చేయిస్తామని అంటాడు.. దాన్ని మీరు నమ్ముతారా అని మహిళలను ప్రశ్నించారు. అందుకు వారు ఇక జీవితంలో చంద్రబాబును నమ్మమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రామరాజ్యం కావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. హంద్రీనీవాకు తామే నీరు తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే బీకే పార్థసారథి అంటున్నారని, వారి అబ్బసొత్తు పెట్టి తెచ్చారా? అని శంకరనారాయణ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ జయరాం, జిల్లా బీసీ సెల్ నాయకులు రమణ, ప్రభు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు మారుతీశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. -
పోలవరం వ్యతిరేకి చంద్రబాబే
- వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ గోరంట్ల (సోమందేపల్లి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.5 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టుకు అనుమతి తీసుకొస్తే అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఒడిస్సా, చత్తీస్గడ్ ముఖ్యమంత్రులను కలిసి ప్రాజెక్టును ముందుకు కదలకుండా కోర్టులో వేయించారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అన్నారు. శనివారం గోరంట్లలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ హయాంలో జల ప్రాజెక్టులు ప్రారంభించి, దాదాపు 80 శాతం పూర్తయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 20 శాతం పనులు చేసి, అంతా తానే చేసినట్లు ఆర్భాటం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడన్నారు. ఎన్నికలకు ముందు పింఛన్లు, రేషన్‌కార్డులు, పేదలకు గృహాలతోపాటు అనేక హామీలు ఇచ్చిన టీడీపీ.. అధికారం చేపట్టిన తర్వాత దగా చేసిందని గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజలు తమ వద్ద వాపోతున్నారన్నారు. ప్రజావ్యతిరేకి టీడీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరపడ్డాయన్నారు. పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి అభివృద్ధిని పక్కన పెట్టి, అక్రమాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. పరిగి మండలం బీచుగానిపల్లిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై సర్పంచు బాలాజీ ప్రశ్నిస్తే ఒక ప్రజాప్రతినిధి స్థానంలో ఉండి కూడా చేయిచేసుకునేంత వరకు వెళ్లారన్నారు. చిన్నమంతూరులో ఇసుక అక్రమంగా తరలిస్తూ గ్రామస్తులకు పట్టుబడితే ఎమ్మెల్యే అండ ఉందని ఆయన అనుచరులు బెదిరించడాన్ని బట్టి చూస్తే బీకే ఆగడాలు నియోజకవర్గంలో ఏవిధంగా ఉన్నాయో అర్థమవుతుందన్నారు. తనకు మంత్రి పదవి వస్తుందని గొప్పలు చెప్పుకుంటూ అధికారులను సైతం భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ప్రజా సమస్యలపై పోరాడటానికి వైఎస్సార్సీపీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు ఫకృద్దీన్, బూదిలి వేణుగోపాల్‌రెడ్డి, శేషాద్రిరెడ్డి, గంపల రమణారెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులపై న్యాయ పోరాటం
పెనుకొండ : పెనుకొండ మండలం దుద్దేబండ పంచాయతీ కేంద్రంలో వైఎస్సార్సీపీ సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డిలతో పాటు ఇతరులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే పోలీసులు అక్రమ కేసును బనాయించారని విమర్శించారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసు వ్యవహారంపై ఎస్ఐ లింగన్నతో చర్చించడానికి శంకరనారాయణ పార్టీ శ్రేణులతో కలిసి గురువారం పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లారు. అయితే ఎస్ఐ అందుబాటులో లేకపోవడంతో కాసేపు వేచిచూశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని అడిగిన శ్రీకాంత్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలపై పెద్దిరెడ్డి, శీనా, కేశవయ్య, రాజులు పక్కా ప్రణాళికతో దాడి చేశారన్నారు. తమ పంచాయతీ కేంద్రంలో ఇతర పంచాయతీకి చెందిన వ్యక్తులు రావడమే కాకుండా దాడి చేశారని సర్పంచ్, ఎంపీటీసీ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. ఫిర్యాదు చేసిన వ్యక్తులపైనే కేసులు బనాయించడం అన్యాయమన్నారు. దాడి చేసిన వారికి నేరచరిత్ర ఉందని తెలిపారు. ఎమ్మెల్యే బీకే.పార్థ«సారథి ఒత్తిడి చేసి కేసులు పెట్టించారన్నారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి, తమ పార్టీ నాయకులు ఫిర్యాదు చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను కలవనున్నట్లు తెలిపారు. -
పాలకులకు మంచి బుద్ధి కలగాలి
పెనుకొండ : సంక్షేమ పథకాలను టీడీపీ నాయకులే దోచుకుంటున్నారని, పేదవాడికి అన్యాయం జరుగుతోందని, ఈ ఏడాదైనా పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. ఆదివారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో 2017 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు టీడీపీవారే దోచుకుంటున్నారని, పేదవాడికి అందని పరిస్థితి నెలకొందన్నారు. ఈ ఏడైనా టీడీపీ ప్రజాప్రతినిథులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆయన కోరుకున్నారు. రెండున్నరేళ్లలో టీడీపీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రజల ఆశలను అడియాశలు చేసిందన్నారు. గడపగడపకూ వైఎస్సార్సీపీలో ఎక్కడకెళ్లినా పింఛన్లు, రేషన్‌కార్డులు, ఉపాధి బిల్లులు అందలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు సంక్రాంతికి నియోజకవర్గానికి 2 వేల పింఛన్లు ఇస్తామంటున్నారని, నిజమైన పేదలకు పింఛన్లు అందించాలన్నారు. పోలవరం జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు అని దానికి రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కోసం నిర్మాణ భారాన్ని మీద వేసుకుని బినామీ కాంట్రాక్ట్ సంస్థల ద్వారా దోపిడీకి కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు.రూ.16 వేల కోట్ల అంచనా వ్యయం ఉన్న ప్రాజెక్టును రూ.40 వేల కోట్లకు ఎందుకు పెంచినట్లో ప్రజలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్ఆర్ చలువతోనే ప్రారంభమైందన్నారు. -
‘ఆరోగ్యశ్రీ’ అంటే అంత నిర్లక్ష్యం దేనికీ..?
– 9న కలెక్టర్ ఎదుట ధర్నాను విజయవంతం చేయండి – వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ పిలుపు అనంతపురం : పేద వర్గాలకు వరంగా మారిన ఆరోగ్యశ్రీని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దీన్ని నిరసిస్తూ ఈనెల 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తెలిపారు. ప్రతి ఒక్కరూ ధర్నాకు హాజరై విజయవంతం చేయాలని ఓ ప్రకటనలో పిలుపుఽనిచ్చారు. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్పు చేసినా నిధులు మాత్రంమంజూరు చేయడం లేదని వాపోయారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేదలు పైసా ఖర్చు లేకుండా చేయించుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం చాలా ఆస్పత్రుల్లో గుండె, కిడ్నీ తదితర చికిత్సల కోసం అనుమతులకు పంపితే తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఇప్పటికే వైద్య చికిత్సలు చేసిన కార్పొరేట్ ఆస్పత్రులకు లక్షలాది రూపాయలు బిల్లులు బకాయిలు ఉన్నారని చెప్పారు. ఆదాయం తెచ్చిపెట్టె వివిధ ప్రాజెక్టులకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేదలకు ఆరోగ్య చికిత్సలు చేయించేందుకు నిధులు లేమి అంటూ మాట్లాడుతోందని ఇంతకంటే దుర్మార్గమేముందని ప్రశ్నించారు. -
కురుబలు అన్ని రంగాల్లో రాణించాలి
- కనకదాసు జయంతి ఉత్సవంలో శంకరనారాయణ పెనుకొండ (పరిగి) : కురుబలు అన్ని రంగాల్లో రాణించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. పరిగి మండలం కొడిగెనహళ్లిలో ఆదివారం కురుబ కులస్థులు పెద్దఎత్తున కనకదాసు జయంతి ఉత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శంకరనారాయణ మాట్లాడుతూ కురుబలు విద్య, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరంగా చైతన్యవంతం కావాలన్నారు. ఐక్యతతో ముందుకు సాగినప్పుడే లక్ష్యాలను చేరుకోగలమన్నారు. అనంతరం ఆయన కనకదాసు చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున జ్యోతులతో ర్యాలీ నిర్వహించగా ఆయన వారితో కలిసి నడిచారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ప్రభాకర్, చిరంజీవి, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. -
రేపటి హర్తాళ్‌కు వైఎస్సార్సీపీ మద్దతు
అనంతపురం : పెద్దనోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా సామాన్యులు పడుతున్న ఇబ్బందులను తీర్చడంలో ప్రభుత్వ వైఫల్యంపై ప్రతిపక్ష పార్టీలు ఈ నెల 28న తలపెట్టిన హర్తాళ్ (స్వచ్ఛంద బంద్)కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి వేర్వేరు ›ప్రకటనలు విడుదల చేశారు. నల్లధనాన్ని వెలికి తీయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఎలాంటి చర్యలనైనా వైఎస్సార్సీపీ సమర్థిస్తుందని పేర్కొన్నారు. అయితే.. ప్రభుత్వం ముందస్తు కసరత్తు చేయకుండానే రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేయడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు, రైతులు, కార్మికులు, మహిళలు కొన్ని రోజులుగా డబ్బు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.ఈ పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు 28వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
∙వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పెనుకొండ రూరల్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని లాంటిదని, హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎ స్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అన్నారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా సోమ వారం ఆయన పరిగి మండలంలోని టీడీపల్లి,ఎర్రగుంట గ్రామాల్లో పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హోదా వస్తే పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత జగన్మోహహన్ రెడ్డి ఒక్కరే ఉద్యమం చేస్తున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడడానికే చంద్రబాబు ప్రత్యేక హోదా పై నోరు మెదపడం లేదన్నారు. ప్రత్యేక హోదా ఆందోళనలో పాల్గొనేం దుకు విద్యార్థులు వెళ్తుండగా వారి తల్లిదండ్రులపై పీడీ యాక్ట్ పెట్టి కేసులు నమోదు చేస్తామని అధికార పార్టీ నాయకులు భయపెడ్తున్నారన్నారు. అధికారపార్టీ నాయకులు ప్రజలకు ఏమి చేశారని జనచైతన్య యాత్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గొళ్లపల్లికి హంద్రీ నీవా జలాలను తీసుకొస్తున్నామని మభ్య పెడ్తున్నారన్నారు. జిల్లాకు సాగు, తాగునీరు తీసుకురావడంలో జిల్లా మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎంపీలు దద్దమ్మలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పెనుకొండ నియోజక వర్గానికి వచ్చిన పరిశ్రమలు శిలాఫలాకాలకే పరిమితమయ్యాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి ఆర్భాటాలే తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెన్నపూసగోపాల్రెడ్డిని గెలిపించి అధికార పార్టీకి కనువిప్పు గావించాలని పట్టభద్రులకు ఆయన పిలుపునిచ్చారు. -
పరిటాల అనుచరుల దాడిపై సర్వత్రా చర్చ
అనంతపురం: అనంతపురం జ్లిలాలో పరిటాల అనచరుల దౌర్జాన్యాలు మితిమీరిపోతున్నాయని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆరోపించారు. రాప్తాడు నియోజక వర్గంలో ఆటవిక న్యాయం యథేచ్ఛగా జరుగుతోందన్నారు. పట్టపగలు ఓ వ్యక్తిపై అమానుషంగా ప్రవర్తించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. బోయ ఓబులేషు పై దాడికి పాల్పడ్డ పరిటాల అనుచరులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా పరిటాల అనచరుల దౌర్జన్యాలు కలకలం రేపుతున్నాయి. రాప్తాడు లో బయటపడ్డ పరిటాల అనుచరుల దాడి దృశ్యాలపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఈ ఘటనపై అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ విచారణ చేపట్టారు. ఓబులేషు పై దాడిని చూసిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ అనుచరుడు నగేష్‌చౌదరి యల్లనూరు మండల కేంద్రానికి చెందిన చిన్న ఓబులేసు అనే యువకుడిపై శుక్రవారం మధ్యాహ్నం ఒళ్లు గగుర్పొడిచేలా సాగించిన దాష్టీకం వీడియో శనివారం బయటకు వచ్చింది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత పదడుగుల గుంతలో పడిన ఓబులేసు బట్టలూడదీసి.. కిందపడేసి.. బెల్టుతోను.. చెప్పుకాలుతో కసితీరా చావబాదాడు. ముఖంపై పదేపదే తన్నాడు. క్షమించమని, వదిలేయమని ప్రాధేయపడుతున్నా వినకుండా విచక్షణారహితంగా దాడిచేయడం చూసి అటువైపు వెళుతున్న కొంతమంది పోలీసులకు సమాచారమందించారు. దాదాపు గంటపాటు దాడి కొనసాగించినట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. -
‘ప్రాజెక్టుల పేరిట ప్రజాధనం లూటీ’
సోమందేపల్లి : ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల నీటి ప్రాజెక్టుల పేరుతో వందల కోట్లు లూటీ చేసిన అధికార పార్టీ నాయకులు తాజాగా జిల్లాలో కూడా నీటి ప్రాజెక్టులలో భారీగా అక్రమాలకు యత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఆరోపించారు. శుక్రవారం చాలకూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేరూరు, భైరవానితిప్ప ప్రాజెక్టులతో పాటు హంద్రీనీవా కోసం రూ.2,846 కోట్లు నిధులు అవసరమని అంచనాలు వేయడం వెనుక తెలుగు తమ్ముళ్లకు లబ్ధిచేకూర్చాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రూ.500 కోట్లు ఖర్చు పెడితే పేరూరు, బీటీపీలకు నీళ్లు వస్తాయన్నారు. కానీ పట్టిసీమ తరహాలో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు అంచనాలు పెంచుకుంటూ పోతున్నారని చెప్పారు. కరువు జిల్లాగా ఉన్న అనంతపురం జిల్లాలో ఈ విధంగా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడటం పద్ధతి కాదని హితవుపలికారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జిల్లా రైతాంగం కోసం ప్రారంభించిన హంద్రీనీవాను టీడీపీ ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. -
ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారం ఇవ్వాలి
గోరంట్ల : జిల్లాలో వర్షాబావ పరిస్థితుల కారణంగా వేరుశనగ పంటను సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం అందించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని బూచేపల్లి గ్రామంలో ఆయనSగురువారం విలేకరులతో మాట్లాడారు. గత రెండేళ్లు ప్రకృతి వైఫరీత్యాలతో పాటు ప్రభుత్వం వైఫల్యాల కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్డాడుతోందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు ఆశాజనకంగా కురవడంతో రైతులు ఎంతో ఆశతో అప్పులు చేసి పంటను సాగు చేశారన్నారు. అయితే ఆతర్వాత వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట ఎండిపోయిందన్నారు. పంట పెట్టుబడులు సైతం దక్కే అవకాశం లే దని రైతులు అందోళన చెందుతున్నారన్నారు. గ్రామాలలో ఏ రైతును కదిలించిన పంట నష్టంపై వాపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాత్రం రక్షక తడులను అందించినట్లు అంకెల గారడితో రైతులను మభ్యపెడుతోందని విమర్శించారు. అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి రైతులతో రక్షక తడులను అందించినట్లు సంతకాలు, వివరాలను తీసుకోవడం జరుగుతోందన్నారు. గోరంట్ల మండలంలో 38311.18 ఎకరాల్లో పంట సాగు చేస్తే సుమారు 2 వేల ఎకరాలకు రక్షక తడులను అందించామని అధికారులు అంటున్న , క్షేత్రస్థాయిలో రైతులు అందలేదని అంటున్నారని ఆయన తెలిపారు. వేరుశనగ సాగు చేసిన రైతులు నష్టపోయి ఏడాదికేడాది వలసలు వెళ్తున్నారని, దీంతో ఎన్నో కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి వేరుశనగ రైతుకు పూర్తిస్థాయిలో కనీసం ఎకరాకు రూ. 20 వేల చొప్పున నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తే రైతాంగం తరుపున ఉద్యమాలు చేపడుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
‘కొండంత అరాచకం
► పెనుకొండలో శ్రుతి మించిన ‘అధికార’ పార్టీ నేతల ఆగడాలు ► వారికే వత్తాసు పలుకుతున్న పోలీసులు ► వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెనుకొండలో అరాచక రాజకీయం రాజ్యమేలుతోంది. ‘అధికారం’ ఉందనే అహంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై ఖాకీలను ఉసిగొల్పుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తూ.. అవస్థలకు గురి చేస్తున్నారు. న్యాయాన్యాయాలను చూడాల్సిన పోలీసులు కూడా ‘పచ్చ’ నేతలకు ‘జీ హుజూర్’ అంటుండడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. పెనుకొండ : పెనుకొండలో అధికార పార్టీ నేతల ఆగడాలు అధికమయ్యాయి. పచ్చనేతలు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్నట్లుగా మారింది. ముఖ్యంగా చిన్న విషయాలకు కూడా రాజకీయరంగు పులిమి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే లక్ష్యంగా వారు అరాచకం కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో కుట్ర కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. చిన్న విషయాలను సైతం టీడీపీ ముఖ్య నేతలు పెద్దదిగా చేసి బెదిరింపులకు దిగడం మాట వినకపోతే పోలీసులపై ఒత్తిడి పెంచి కేసులు నమోదు చేయించడం రివాజుగా మారిపోయిందనే విమర్శలు నెలకొన్నాయి. ప్రశాంతంగా ఉన్న పెనుకొండ ప్రాంతంలో అక్రమ కేసుల తతంగం చర్చనీయాంశంగా మారింది. సోమందేపల్లి మండలం కొనతట్టుపల్లికి చెందిన నరేంద్రరెడ్డిపై టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే పలువురు ముఖ్య టీడీపి నాయకులు పోలీసులపై ఒత్తిడి పెంచి అక్రమ కేసు నమోదు చేయించారని విమర్శలు ఉన్నాయి. డ్వాక్రా సంఘం విషయమై జరిగిన వివాదం చిన్నదే అయినా దానికి రాజకీయరంగు పులిమి కేసు నమోదు చేయించారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే సోమందేపల్లి మండలం చల్లాపల్లికి చెందిన సత్యనారాయణరెడ్డి, అంజినరెడ్డిపై బలమైన కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. ఇక అదే మండలం పోలేపల్లిలో వైఎసార్ సీపీ సానుభూతిపరులు ఓబుళనరసింహులు, నరశింహప్ప, రామకష్ణ, చక్కిరప్పపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. ఈ కేసుల వెనుక అధికార పార్టీ ప్రజా ప్రతినిధి ముఖ్య భూమిక పోషించినట్లు విమర్శలున్నాయి. అలాగే పెనుకొండ మండలం శెట్టిపల్లి సర్పంచ్ చలపతిపై టీyీ పీ ముఖ్య నాయకుడు పోలీసుల ద్వారా తీవ్ర ఒత్తిడి పెట్టి ఇబ్బంది కలిగించినట్లు వైఎసార్ సీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురైనట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఇక ఐదు రోజుల క్రితం పరిగి మండలం పైడేటి గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ జరగ్గా పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన ప్రముఖ ప్రజా ప్రతినిధి వైఎస్సార్ సీపీ శ్రేణులకు భారీగా కౌన్సిలింగ్ ఇవ్వాలని పట్టుబట్టడమే కాక రమణ అనే నాయకుడికి లాఠీ పంచ్ చూపాలని, కౌన్సిలింగ్ ఇచ్చిన విధానం వెంటనే తనకు వాట్సాప్ ద్వారా పంపాలని హిందూపురం పోలీస్ అధికారిని కోరినట్లు వైఎసార్ సీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. రాజకీయ ఒత్తిడితో టీడీపి శ్రేణులకు మాత్రం చిన్న కేసుతో సరిపెట్టుకున్న పోలీసులు వైఎస్సార్ సీపీ శ్రేణులను పూర్తీ స్థాయిలో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పైడేటి ఘర్షణలో పలువురు వైఎసార్ సీపీ శ్రేణుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు టీడీపీ శ్రేణులపై మాత్రం ఏ చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అక్రమ కేసులు ఆపకపోతే ప్రైవేట్ కేసులు తప్పవు : మాలగుండ్ల శంకరనారాయణ, వైఎస్సార్ సీపీ, జిల్లా అధ్యక్షుడు వైఎసార్ సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఎమ్మెల్యే బీకే.పార్థసారథి, మరి కొందరు నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మాలగుండ్ల శంకరనారాయణ విమర్శించారు. పరిగి మండలం మండలం పైడేటిలో ఐదురోజుల క్రితం వినాయక చవితి సందర్భంగా జరిగిన ఘర్షణలో వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో శంకరనారాయణ బుధవారం సబ్జైల్లో పార్టీ శ్రేణుల్ని కలిసి వారితో చర్చించారు. రమణ, చిరంజీవి తదితరులందరికీ పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందని భయపడవద్దని అన్నారు. ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని వారికి అభయమిచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ‘ పెనుకొండ నియోజకవర్గంలో ప్రశాంతత నెలకొందని ప్రజలు భావిస్తున్న తరుణంలో ఇలాంటి కుట్ర కేసులు ఏ మేరకు న్యాయం. రాజకీయం కోసం అమాయకులను బలి చేయడం సమంజసం కాదు. ఇలాంటి చర్యలను ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీశ్రేణులు ఆపకపోతే న్యాయ పోరాటానికి పార్టీ తరపున సిద్ధమవుతాం. అవసరమైతే ప్రైవేట్ కేసుల ద్వారా ఎదుర్కోవడానికి వెనుకాడబోమ’ని అన్నారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, సర్పంచ్ సుధాకరరెడ్డి, ఎంపీటీ సీ రామ్మోహన్‌రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి భాస్కరరెడ్డి, మాజీ మార్కెట్‌యార్డ్ చైర్మన్ నాగలూరుబాబు, వైశాలి జయశంకరరెడ్డి, కొండలరాయుడు, పరిగి మండల నాయకులు, పైడేటి గ్రామస్తులు ఉన్నారు. కాగా.. రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులను కాంగ్రెస్ ఇన్చార్జ్ కేటీ.శ్రీధర్, డీసీసీ ఉపాధ్యక్షుడు గుట్టూరు చినవెంకటరాముడు పరామర్శించారు. -
బంద్ విజయవంతం చేయండి
అనంతపురం : ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రుల ప్రకటనలు, ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనెల 10న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్రబంద్‌ను జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి విజయవంతం చేయాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయి రెండున్నరేళ్లవుతున్నా నేటికీ చంద్రబాబు ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిన్నటి రోజున కేంద్ర మంత్రుల ప్రకటనలతో చంద్రబాబు మాటలన్నీ ఉత్తివేనని తేలిపోయిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని నిన్నటి వరకు ఆశలు పెట్టుకున్న కోట్లాది ప్రజల గుండెల్లో గుణపాలు చెక్కేలా కేంద్రం ప్రకటన చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఈరోజు నీటిమూటలు చేశారని ధ్వజమెత్తారు. వెంకయ్యనాయుడు బొంకయ్యనాయుడులా మారారని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని చెప్పిన ఆయన ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తేకుండా కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయట పడేందుకు కేంద్రం వద్ద సాగిలపడ్డారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్సీపీ ముందు నుంచీ పోరాడుతోందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంతవరకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పోరాటాలు చేస్తామన్నారు. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
విచారణ అంటే భయమెందుకు బాబూ?
గోరంట్ల : నేనే నిప్పులా బతికాను..నీతి, నిజాయితీ అనే ఉపోద్ఘాతాలు చెప్పే సీఎం చంద్రబాబు ఏ కేసులోనైనా విచారణ అంటే భయం ఎందుకో అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలుగుండ్ల శంకరనారాయణ ప్రశ్నించారు. మండలంలోని కమ్మవారిపల్లి గ్రామంలో ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో రెండు రోజుల క్రితం గంభీరంగా తన నిజాయితీపై ఉపోద్ఘాతాలు ఇచ్చిన సీఎం హడావుడిగా హైకోర్టులో స్టే తీసుకురావడంపై ఆయన నీతి, నిజాయితీలను శంకించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. న్యాయస్థానం ఆశ్రయించడంతో ఆయన ఈ కేసులో ఎంత ఆందోళనలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చునన్నారు. పలు కేసుల్లో ఏదో ఒక సాంకేతిక కారణాలను చూపి స్టేలను తెచ్చుకున్నారని ఆయన గుర్త చేశారు. ఏతప్పు చేయకపోతే ఎందుకు స్టే తెచ్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఆడియో టేపులు ఉన్నా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ఫకృద్దీన్‌సాబ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గంపల వెంకటరమణారెడ్డి, మలసముద్రం మాజీ సర్పంచు వెంకటరమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి, నాయకులు ధనుంజయరెడ్డి , శివశంకర్‌రెడ్డి, వీరనారాయణరెడ్డి, అంగడినారాయణరెడ్డి, ఇలియాస్, డాక్టర్బాషా తదితరులు పాల్గొన్నారు. -
ఓటుకు నోటు.. రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు
గోరంట్ల : ఓటుకు నోటు కేసులో బయట పడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలోనూ, తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టాడని ,దీనికి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ డిమాండ్ చేశారు. గడపగడపకూ వైఎస్సార్సీపీలో భాగంగా ఆయన మంగళవారం మండల పరిధిలోని గుంటిపల్లి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని,రాష్ట్ర ప్రయెజనాలను కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. రాయలసీమ, ఉత్తరాంధ్రల ప్రత్యేక ప్యాకేజీలతో పాటు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై త్తిడి తేకుండా రెండేళ్ల పాటు కాలయాపన చేశారన్నారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాదులో పదేళ్ల పాటు వుండాల్సి వున్నా, టీడీపీ ప్రజాప్రతినిధుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తున్నారని, కనీసం పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకురావడంలో ఘోర వైఫల్యం చెందారన్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ప్రధాన పంటగా వేరుశనగ సాగు చేశారని, అయితే వర్షభావ పరిస్థితులతో పంట పూర్తిగా ఎండిపోన తర్వాత ప్రభుత్వం రైతుల పట్ల మొసలికన్నీరు కారుస్తోందని తెలిపారు. పార్టీ మండల కన్వీనర్ ఫకృద్దీన్‌సాబ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గంపల వెంకటరమణారెడ్డి, సహకారసంఘాల అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, రఘురామిరెడ్డి, శంకరరెడ్డి, ఎంపీటీసీ గంగిరెడ్డి , మహిళ కన్వీనర్ తబితా లియోనా తదితరులు పాల్గొన్నారు. -
‘ఉత్తుత్తి హామీలతో వంచించారు’
పెనుకొండ రూరల్ : చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ వంచనలేనని గోనిపేట గ్రామస్తులు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ వద్ద వాపోయారు. శుక్రవారం మండలంలోని గోనిపేట గ్రామంలో శంకరనారాయణ గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ‘ప్రభాకర్ అనే మతి స్థిమితం లేని వ్యక్తికి గతంలో రూ. 200 పింఛన్ వచ్చేది. టీడీపీ అధికారంలోకి రాగానే అతనికి పింఛన్ తొలగించార’ని స్థానికులు తెలిపారు. అంతేకాకుండా పింఛన్లు, పక్కాగృహాలు, ఇంటికో ఉద్యోగం, డ్వాక్రా రుణాలు తదితర సమస్యలను గ్రామస్తులు ఏకరవు పెట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్‌రెడ్డి, అనితాశ్రీనివాసరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరుబాబు తదితరులు పాల్గొన్నారు. -
కేసుల భయంతోనే ‘హోదా’ తాకట్టు
పెనుకొండ: ఓటుకు కోట్లు కేసు భయంతో ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షుడు శంకర్‌నారాయణ విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పట్టణంలో మంగళవారం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ బంద్ నిర్వహించింది. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాను సీఎం చంద్రబాబు కేంద్రం కాళ్ల వద్ద తాకట్టు పెట్టారన్నారు. వెంటనే కేంద్ర మంత్రులను మంత్రి మండలి నుంచి ఉపసంహరించుకోవాలన్నారు. -
ఆ ముగ్గురూ ‘ప్రత్యేక’ ద్రోహులు
– ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీది అలుపెరుగని పోరాటం – ఆగస్టు 2న బంద్‌ను విజయవంతం చేయండి – పార్టీ నేతలు శంకరనారాయణ, విశ్వ, గురునాథరెడ్డి అనంతపురం టౌన్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పేర్కొన్నారు. ఆ ముగ్గురినీ ‘ప్రత్యేక’ ద్రోహులుగా అభివర్ణించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం అనంతపురంలోని టవర్‌క్లాక్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. ప్రత్యేక హోదా మన హక్కన్నారు. ఈ విషయంలో ముందు నుంచి చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారన్నారు. అందరూ కలిసి రాష్ట్రాన్ని నట్టేట ముంచారన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అధోగతి పడుతోందన్నారు. రాజ్యసభలో జరిగిన చర్చలో టీడీపీ ఎంపీలు బీజేపీని ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరు సాగిస్తున్నారన్నారు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆగస్టు 2న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారన్నారు. జిల్లాలోని మేధావులు, యువకులు, విద్యార్థులు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలపాలని కోరారు. రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ అన్యాయం చేస్తే ఇప్పుడు బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి పడుతుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏ విధంగా జనం రోడ్లమీదకొచ్చారో ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు ఎర్రిస్వామిరెడ్డి, బుర్రా సురేష్‌బాబు, మహమ్మద్ గౌస్, వలిపిరెడ్డి శివారెడ్డి, గోపాల్‌మోహన్, చింతకుంట మధు, మారుతీనాయుడు, బాల నరసింహారెడ్డి, పాలే జయరాం నాయక్, కొర్రపాడు హుస్సేన్ పీరా, వెంకటరామిరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, డాక్టర్ మైనుద్దీన్, శివశంకర్, వాయల శీన, పసులూరి శీన తదితరులు పాల్గొన్నారు. 2న విద్యా సంస్థల బంద్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఆగస్టు 2న చేపట్టిన రాష్ట్ర బంద్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం తెలిపారు. బంద్‌కు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని ఆయన కోరారు. -
చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి
పెనుకొండ రూరల్ : ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా, చేనేతల రుణమాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని..ఇలా అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా నిలువునా మోసం చేశారంటూ ప్రజలు మండిపడ్డారు. పెనుకొండ మండలం సుద్దబట్లపల్లి, సత్తారుపల్లి గ్రామాల్లో బుధవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, నాయకులు, కార్యకర్తలతో కలిసి గడప గడపకూ తిరిగి టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు ఏ విధంగా ఉందో తెలపాలని కోరారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, ఉద్యోగాల భర్తీ ఊసే లేదని, నిరుద్యోగభృతీ ఎవరికీ అందలేదని, సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని ప్రజలు దుమ్మెత్తి పోశారు. ఆనాడు చెప్పిందొకటి.. నేడు చేస్తున్నదొకటి అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నయవంచక నేతను తామెన్నడూ చూడలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. -
బాబుపై మహిళల తిరుగుబావుటా తథ్యం
► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ మడకశిర: రాష్ట్రంలోని మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తిరుగుబాటు చేయడం తథ్యమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం మడకశిరకు వచ్చిన సందర్భంగా డాక్టర్ తిప్పేస్వామి నర్సింగ్ హోమ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇంత వరకు పైసా కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదన్నారు. తప్పుడు హామీతో మహిళల ఓట్లను దండుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం డ్వాక్రా మహిళలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మహిళలు కన్నెర్ర చేస్తే చంద్రబాబుకు పుట్టగతులుండవని హెచ్చరించారు. మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని జోస్యం చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ఎస్ఆర్ అంజినరెడ్డి, మండల కన్వీనర్ ఈచలడ్డి హనుమంతరాయప్ప, పట్టణ నాయకులు పార్వతమ్మదాసన్న, హిద్దు తదితరులు పాల్గొన్నారు. -
'మే 2న ఖాళీ బిందెలతో నిరసన'
అనంతపురం : రాష్ట్రంలో తాగునీటి సమస్య తీర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు నివారణపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. శనివారం అనంతపురంలో శంకర్‌నారాయణ విలేకర్లలో మాట్లాడుతూ... ఈ నేపథ్యంలో మే 2వ తేదీన జిల్లాలో ఖాళీ బిందెలతో నిరసన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసన తెలపాలని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. -
'చంద్రబాబు ప్రచార ఆర్భాటాలకే పరిమితం'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు. హంద్రీ-నీవాను కేవలం చెరువులకు పరిమితం చయడానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు శంకర్ నారాయణ, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. హంద్రీ-నీవా ఆయకట్టుకు పనులను ఆపడం దారుణమన్నారు. ఆయకట్టుకు నీళ్లివ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. -
'పయ్యావుల సోదరులవి హత్యా రాజకీయాలు'
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కు లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ వ్యాఖ్యానించారు. హత్యారాజకీయాలకు కేంద్ర బిందువులు పయ్యావుల సోదరులు అని ఆయన ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో రైతులను బెదిరించి, మభ్యపెట్టి వారి నుంచి అధికార పార్టీ నేతలు, ఏపీ మంత్రులు వేల ఎకరాలను హస్తగతం చేసుకున్నారని తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. రైతులను బెదిరించి నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో పయ్యావుల భూములను కూడబెట్టారని పేర్కొన్నారు. అక్రమాలు జరిగినందునే రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ ను ప్రభుత్వం బ్లాక్ చేసిందని ఆయన మండిపడ్డారు. రాజధాని అమరావతి భూకంభకోణంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్ సీపీ నేత శంకర్ నారాయణ విజ్ఞప్తి చేశారు. -
దౌర్జన్యాలను ఎండగడతాం..
అధికారపార్టీ అరాచకాలపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం 16న బెళుగుప్పలో ధర్నా అనంతపురం : ప్రభుత్వాధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని నియంతపాలన కొనసాగిస్తూ.. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలను ఎండగడతామని వైఎస్సార్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బి. గురునాథ్‌రెడ్డి మాట్లాడారు. ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకాలకు నిరసనగా ఈ నెల 16న బెళుగుప్ప మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి పార్టీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్కె రోజా, జిల్లా పరిశీలకులు, పర్యవేక్షకులు మిథూన్‌రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే జయరాం, తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. అధికారపార్టీ నాయకులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులను పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వాధికారులు వత్తాసు పలుకుతున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను టీడీపీ కార్యాలయాలుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సూరయ్య హత్య కేసు నుంచి శీనప్ప తప్పించుకోవడానికి సీబీఐతో విచారణ జరిపించారన్నారు. సూరయ్య భార్య ఓబులమ్మను అనేక ప్రలోభాలకు గురిచేయడమే కాకుండా వారి ఆస్తులను కొల్లగొట్టేందుకు కట్రపన్నుతున్నారన్నారు. పయ్యావుల శీనప్ప నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలే తప్పా.. ఈ మహిళలను వేధించడం సరికాదన్నారు. అధికారం శాశ్వతమని భావించి రాజ్యాంగేతర శక్తులుగా టీడీపీ నాయకులు చేస్తున్నా దౌర్జన్యాలను ఖండిస్తున్నామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, సానుభూతిపరులు హత్యలకు , దౌర్జన్యాలు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులపై వరుస దాడులు జరుగుతున్నా విషయాన్ని ప్రభుత్వాధికారులు గమనించాలన్నారు. మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి టి. కృష్ణవేణి, ఎస్సీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, అధికారప్రతినిధి సిపి వీరన్న, జిల్లా కమిటీ సభ్యులు ఓబిలేసు పాల్గొన్నారు. -
అనంతలో పోలీసుల అత్యుత్సాహం
అనంతపురం: అనంతపురంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత ఈ 29న రాష్టవ్యాప్తంగా చేపట్టనున్న బంద్‌ను భగ్నం చేయాలని ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణకు పోలీసులు ఫోన్ చేశారు. పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ఆర్ సీపీ రేపు చేపట్టనున్న బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రపన్నుతున్నారంటూ శంకర్ నారాయణ ఆరోపించారు. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ జగన్ చేపట్టనున్న బంద్‌ను అడ్డుకుంటే టీడీపీ చరిత్ర హీనులుగా మిగులుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడి గృహనిర్భందం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో ధర్మవరం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, సీపీఐ నేతలని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా ఎస్పీ కార్యలయం ఎదుట ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళ చేస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం హంద్రీనివా ప్రాజెక్ట్ కాలువ పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. గొల్లపల్లిలో సూక్ష్మసేద్యం చేస్తున్న రైతులతో ఆయన ముఖాముఖిలో చర్చిస్తారు. కుంటి మద్ది చెరువులో నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొంటారు. -
'బాబూ.. పారిశ్రామికవేత్తలకో న్యాయం, రైతులకు మరో న్యాయమా?'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణ మండిపడ్డారు. కరువుపై చంద్రబాబుకు అవగాహన లేదని, అందుకే 2013 ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వనని చెబుతున్నారని విమర్శించారు. పారిశ్రామికవేత్తలకు ఓ న్యాయం, రైతులకు మరో న్యాయమా అని విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణ తప్పుపట్టారు. చంద్రబాబుకు రాయలసీమపై నిజంగా ప్రేమ ఉంటే హంద్రీ నీవాకు 1500 కోట్ల రూపాయల నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తామని చంద్రబాబు, మంత్రులు పొంతనలేని హామీలు ఇస్తున్నారని అన్నారు. అక్రమ సంపాదన కోసమే పట్టిసీమ ప్రాజెక్టు ముందుకుతెచ్చారని ఆరోపించారు. ఎన్నికల హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదని వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రశ్నించారు. రుణమాఫీ హామీ అమలుగాక రైతులు, డ్వాక్రా మహిళలు అనేక కష్టాలు పడుతున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా ప్రజలు టీడీపీకి 2 ఎంపీ, 12 ఎమ్మెల్యే సీట్లు గెలిపించినా చంద్రబాబు జిల్లాకు చేసింది శూన్యమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సూచనలతోనే వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయని విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణ ఆరోపించారు. -
'ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎదుర్కొంటాం'
అనంతపురం: అనంతలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు శంకరనారయణ, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలు మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే టీడీపీ దౌర్జన్యాలను ఎదుర్కొంటామని తెలిపారు. హంద్రీనీవ ప్రాజెక్ట్‌ను ఏడాదిలోగా పూర్తిచేస్తామని బాలకృష్ణ, పరిటాల సునీత హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్లో కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయిస్తే ఎందుకు నోరు మెదపలేదు అని ప్రశ్నించారు. పట్టిసీమద్వారా రాయలసీమకు నీరందిస్తామని ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారు. కానీ జీవోలో ఎందుకు స్పష్టంగా హామీ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. అనంతలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. -
ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడండి
అధికారులకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ విజ్ఞప్తి సోమందేపల్లి : పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రభు త్వ పథకాలు అర్హులందరికీ అందేలా చూ డాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శం కర్‌నారాయణ అధికారులకు సూచించారు. మండలంలో అధికార పార్టీకి చెందిన వారి నే రుణాల మంజూరుకు ఎంపిక చేస్తున్నార ని, అదే విధంగా పింఛన్ల పంపిణీలో కూడా అధికార పార్టీ ఒత్తిడితో కావాలనే కొన్నింటి ని తొలగించారని, అర్హులకు తీరని అన్యా యం జరుగుతోందని మండల నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయాలపై ఎంపీడీవోతో మాట్లాడేందుకు ఆయన గురువారం సోమందేపల్లికి వచ్చారు. ఎంపీడీవో రామాంజినేయులుతో మాట్లాడుతూ క్రెడిట్ క్యాంపులకు దరఖాస్తు చేసుకొమ్మని ప్రకటనలు చేశారన్నారు. వాటిని కమిటీ సభ్యుల సూచన మేరకు అధికార పార్టీ వారికే ఇస్తారనే ప్రచారం జరుగుతోందని తెలిపారు. అలాంటప్పుడు ప్రకటనలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలపై ఇప్పటికే కోర్టుకు వేశామన్నారు. అదే విధంగా పింఛన్ల పంపిణీలో కూడా చాలామందికి అర్హత ఉన్నా తొలగించారని, దీనివ ల్ల అనేక మందికి అన్యాయం జరుగుతోందన్నారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో మాట్లాడుతూ గతంలో చిన్న పొరపాట్ల వల్ల చాలామంది పింఛన్లు తొలగించారని, గత నెలలో తిరిగి వాటిని అప్లోడ్ చేశామని చెప్పారు. క్రెడిట్ క్యాంపులలోను అర్హులందరికీ న్యాయం చేస్తామన్నారు. అనంతరం అక్కడి నుంచి తహశీల్దారు కార్యాలయంలో తహశీల్దారు లక్ష్మినాయక్‌ను శంకరనారాయణ కలిశారు. అంత్యోదయ కార్డులలో కూడా పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హులకు అందెలా చూడాలని కోరారు. త్వరలో చేపట్టే ఇంటిపట్టాల పంపిణీలోను అర్హులకు న్యాయం చేయూలని తెలిపారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. త్వరలోనే పార్టీ గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ మండల కన్వీనర్ వెంకటరత్నం, సర్పంచ్ నారాయణరెడ్డి, పెనుకొండ మండల కన్వీనర్ వెంకట్రామిరెడ్డి, నేతలు గుట్టూరు శ్రీరాములు, నాగలూరు బాబు, కంబాలప్ప, సంజీవరాయుడు, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్‌పై విమర్శలు మాని ప్రజాసేవ చేయండి శెట్టిపల్లి (పెనుకొండ) : వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడం అధికార పార్టీ నేతలు మాని, ప్రజలకు సేవ చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ హితువు పలికారు. శెట్టిపల్లి గ్రామంలో గురువారం ఓ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యూరు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న జగన్మోహన్రెడ్డిని విమర్శించే ముందు తాము ప్రజల కు ఏం చేస్తున్నామని ఆత్మవిమర్మ చేసుకోవాలని సూచిం చారు. ఎన్నికల హామీలు గాలికి వదిలేసి సొంత ప్రయోజనా ల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరుబాబు, బీసీసెల్ జిల్లా నేత గుట్టూరు శ్రీరాములు, నేతలు సానిపల్లి మహీధర్, ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి, సర్పం చ్‌లు చలపతి, శ్రీకాంతరెడ్డి, సుధాకరరెడ్డి పాల్గొన్నారు. -
శంకర నారాయణను మంత్రిని చేస్తా
పెనుకొండ, న్యూస్‌లైన్ : పెనుకొండ ఎమ్మెల్యేగా శంకర నారాయణను గెలిపిస్తే క్యాబినెట్లో మంత్రిగా తీసుకుంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. బుధవారం పెనుకొండలోని అంబేద్కర్ సర్కిల్లో జరిగిన ‘వైఎస్ఆర్ జనభేరి’ సభలో ఆయన ప్రసంగిస్తూ.. శంకర నారాయణ ఉన్నత విద్యావంతుడని, మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడని ప్రశంసించారు. పార్టీ కోసం శ్రమించిన ఆయనను పెనుకొండ నియోజకవర్గ ప్రజలు ఆదరించాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హిందూపురం ఎంపీ అభ్యర్థి దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డిని గెలిపించాలని, ఆయనను గెలిపిస్తే భవిష్యత్‌లో యువతకు ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన బాబురెడ్డికి భవిష్యత్‌లో తగిన స్థానం కల్పిస్తామని, ఎప్పటికీ తన గుండెల్లో బాబురెడ్డి ఉంటారన్నారు. ఎన్నికలయ్యాక కూడా బాబురెడ్డి తనతో ఉంటారన్నారు. అనంతరరం పట్టణానికి చెందిన మైనార్టీ నాయకులు నూర్‌బాషా, జాహెదుల్లాఖాన్, ఫరీద్ తదితరులు జగన్‌ను శాలువతో సత్కరించారు. -
అంబేద్కర్‌కు ఘన నివాళి
సాక్షి, ముంబై: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అనుయాయులు అనేక ప్రాంతాల్లో అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎక్కడా చూసిన లౌడ్ స్పీకర్లలో ఆయన జీవిత చరిత్ర తెలిపే పాటలు వినిపించాయి. దాదర్‌లోని చైత్యభూమిలోని అంబేద్కర్ విగ్రహనికి సోమవారం ఉదయం గవర్నర్ శంకర్నారాయణన్, హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే, బీఎంసీ కమిషషర్ సీతారాం కుంటే, స్థాయీ సమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలే, వివిధ పార్టీలకు చెందిన నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. కొల్హాపూర్‌లో...: స్థానిక బిందు చౌక్‌వద్ద అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, మేయర్ సునీత రావుత్, కార్మిక శాఖ మంత్రి హసన్ మశ్రీప్ తదితరులు నివాళులర్పించారు. ఆంధ్ర ప్రజా సంఘం హాలులో... ముంబైలోని ఆంధ్ర ప్రజా సంఘం హాలులో అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకున్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి వీజే రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్, మహాత్మా పూలే, బుద్ధ భగవాన్, శివాజీ మహరాజ్ చిత్రపటాలకు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అధ్యక్షుడు జె.మన్మథరావు అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి వివరించారు. కార్యక్రమంలో డీవీ రావు, ఎం.సాయి సారథి, జేవీ మూర్తి విశ్వనాధ్, టి.ప్రకాశ్ పాల్గొన్నారు. తూర్పుడోంబివల్పిలో... తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక, శ్రమజీవి సంఘం సంయుక్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని సోమవారం నిర్వహించారు. తూర్పుడోంబివలిలోని అయిరే గావ్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ దుర్గేష్ అక్కెనపెల్లి మాట్లాడుతూ...సమాజానికి పట్టిన రుగ్మతలను తొలగించడానికి బాబాసాహెబ్ జీవితాంతం పోరాడారన్నారు. ఆయన కన్న కలలను నిజం చేసిననాడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు గడచినా అంటరానితనం, మూఢ నమ్మకాలుసమసిపోలేదని రమేష్ గొండ్యాల విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంతోష్ గంబ్రె, నార్ల సతీష్, అల్లి మల్ల్లేష్, శ్రీమల్, సంఘ నాయకులు పాల్గొన్నారు. తెలుగు కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో... తెలుగు కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సైన్లో సోమవారం అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. దళితులు, బహుజనులకు మాత్రమే కాకుండా ప్రతి వర్గానికి సమాజానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధ్యక్షుడు కొంపల్లి జాన్, ఉపాధ్యక్షులు ఆరే కృపానందం, కార్యదర్శి బత్తుల లింగం, కోశాధికారి సంఘం ప్రభాకర్, మగ్గిడి, రవి, సభ్యులు సంగేమ్, వినోద్ బాస, మహేష్, తలారి ఆనందం, బొండొల్ల సుదర్శన్, కొలి గంగారాంలు పాల్గొన్నారు. -
ప్రాదేశిక ఎన్నికల్లో విజయం మాదే
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ సోమందేపల్లి, న్యూస్‌లైన్: మొదటి విడత ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ తెలిపారు. శుక్రవారం పెనుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ కంచుకోటగా భావిస్తున్న పెనకొండలో విజయం సాధిస్తామన్నారు. అన్నిచోట్లా ఫ్యాను గాలి బలంగా వీస్తోందన్నారు. రాష్ట్రంలో అధికశాతం ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లు ఏకమై రాష్ట్రాన్ని విభజనకు కారణమయ్యాయన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పథంలో నిలవాలన్నా జగన్ వల్లే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారన్నారు. జగన్ చెపుతున్న 5 సంతకాలు ప్రజల మనసులో నిలిచిపోయాయన్నారు. పెనుకొండ నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ బలంగా ఉందన్నారు. జిల్లా పరిషత్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పెనుకొండ నియోజక వర్గం సమన్వయకర్త సానిపల్లి మంగమ్మ, నాయకులు గుట్టూరు శ్రీరాములు, అత్తర్ఖదిర్ తదితరులు ఉన్నారు. -
సోనియాను తరమాలి
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : సోనియా గాంధీని భారతదేశం నుంచి తరిమికొట్టాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మండిపడ్డారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంపై పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి గురువారం రాత్రి ఆయన యూపీఏ, బీజేపీ, టీడీపీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. విభజన కారకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ కుట్రపూరితంగా తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపిందని ధ్వజమెత్తారు. సీమాంధ్రకు న్యాయం చేయాలని చెబుతూనే నట్టేట ముంచిందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం కేంద్రం విభజన జరుపుతోందని, అందులో బీజేపీ, టీడీపీ భాగస్వామ్యులయ్యాయని ఆరోపించారు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్న నరేంద్ర మోడీ ఇవాళ విభజనపై ఎందుకు నోరుమెదపడం లేదన్నారు. నరేంద్ర మోడీ పులిచర్మం కప్పుకున్న మేక అని ఎద్దేవా చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపారన్నారు. ఈ పార్టీలను బంగాళాఖాతంలో కలపాలన్నారు. వైఎస్సార్సీపీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో వైఎస్ జగన్ ప్రభావం ఎక్కువవుతుందన్న భావనతోనే ఆంధ్రప్రదేశ్ విభజనకు పాల్పడ్డారని ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం మొదటి నుంచి తమ పార్టీ మాత్రమే కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డీసీసీబీ అభ్యర్థి లింగాల శివశంకర్‌రెడ్డి, శింగనమల నేత ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జేఎం బాషా, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్‌పీరా, జిల్లా ఉపాధ్యక్షుడు వాయల శ్రీనివాసులు, విద్యార్థి విభాగం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండిపరుశురాం, జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేంద్ర రెడ్డి, నగరాధ్యక్షుడు మారుతీ ప్రకాష్, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జ్ చుక్కలూరు దిలీప్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు యూపీ నాగిరెడ్డి, యువజన విభాగం నగరాధ్యక్షుడు మారుతీనాయుడు పాల్గొన్నారు. -
సమైక్య ద్రోహుల చొక్కా పట్టుకోండి
మడకశిర, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ద్రోహులను చొక్కా పట్టుకుని నిలదీయండని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎన్నికల పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా మడకశిరలోని వైఎస్సార్ సర్కిల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కన్వీనర్ శంకరనారాయణ అధ్యక్షతన జరిగిన ‘సమైక్య శంఖారావం’ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సమైక్యాంధ్ర ద్రోహులుగా మిగిలాయన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేమని గుర్తించిన ఈ రెండు పార్టీలు కుమ్మక్కై కుట్ర పన్నడం రాష్ట్ర విభజనకు దారితీసిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని కల్లబొల్లి మాటలు చెప్పిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చివరకు చేతులెత్తేసి సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేశారన్నారు. వైఎస్సార్సీపీ కోరిన విధంగా అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి వుంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీకి సీమాంధ్రలో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికే సోనియాగాంధీ ఓట్లు, సీట్ల రాజకీయం చేసి తెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టిందని విమర్శించారు. రాష్ట్రాన్ని చీల్చేందుకు కుట్ర పన్నిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి చంద్రబాబు వత్తాసు పలికి సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని ప్రగల్బాలు పలికిన విజయవాడ ఎంపీ లడగపాటి రాజగోపాల్ కూడా చివరకు చేత్తులెత్తేశారని ఆరోపించారు. సమైక్యాంధ్ర ద్రోహులైన కాంగ్రెస్, టీడీపీ నాయకులను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ర్టం సమైక్యంగా ఉండాలని పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనేనని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే రాష్ర్టంలో సువర్ణయుగం తిరిగి ప్రారంభమవుతుందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దూరదృష్టి గల నాయకుడని, అందుకే ఆయన హయాంలో సువర్ణయుగం సాగిందన్నారు. చంద్రబాబు హయాంలో వరుస కరువులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త ఎల్ఎం మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మడకశిరలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం తథ్యమన్నారు. మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వైఎస్సార్ రుణాన్ని తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రానికి కట్టుబడి మంత్రి రఘువీరారెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు. -
వైఎస్ఆర్సీపీ బంద్ విజయవంతం
సాక్షి, అనంతపురం : రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ‘అనంత’లో సమైక్య ఉద్యమం మిన్నంటింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన బంద్ పిలుపునకు పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు, వివిధ ప్రజా సంఘాలు స్పందించాయి. ఫలితంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. సమైక్య వాదులు ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. సోనియా గాంధీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టారు. పార్టీ కార్యాలయాల వద్ద కంచెలు వేశారు. ఆర్ట్స్ కళాశాల హాస్టల్ విద్యార్థులు బయటకు రాకుండా కట్టడి చేశారు. హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేయడంతో కొందరు విద్యార్థులు ససేమిరా అన్నారు. దీంతో పలువురిని బలవంతంగా పంపించేశారు. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుంచి బంద్ పాటించారు. ర్యాలీ నిర్వహించి సప్తగిరి సర్కిల్లో మానవహారంగా ఏర్పడి యూపీఏ దిష్టి బొమ్మను దహనం చేశారు. మధ్యాహ్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. విభజన నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు ఓపీ సేవలను బహిష్కరించి నిరసన తెలిపారు. వైద్య ఆరోగ్య జేఏసీ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట మానవహారంగా ఏర్పడ్డారు. ఎస్‌యూసీఐ, యువ జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, బీకే పార్థసారధి, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు, మహాలక్ష్మి శ్రీనివాసులు ర్యాలీ నిర్వహించి ఆర్ట్స్ కళాశాల హాస్టల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. రాజకీయ జేఏసీ, ఆర్టీసీ, ఏపీ ఎన్జీఓలు మద్దతు తెలిపారు. ధర్మవరం, బత్తలపల్లిలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ నేతలు వేర్వేరుగా ఆందోళన చేసి బంద్ పాటించారు. గుంతకల్లు, గుత్తిలో వైఎస్ఆర్సీపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. పామిడిలో రాస్తారోకో చేశారు. హిందూపురంలో నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేశారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువాలు, జెండాలను దహనం చేశారు. టీడీపీ నాయకులు, ఏపీ ఎన్జీఓలు ర్యాలీ చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. కదిరిలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు ఇస్మాయిల్, షాకీర్.. కళ్యాణదుర్గంలో తిప్పేస్వామి.. పెనుకొండలో మంగమ్మ ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. పుట్లూరు మండలంలో వైఎస్ఆర్ సీపీ నేత ఆలూరి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. మడకశిరలో జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ర్యాలీ, రాస్తారోకో చేశారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పుట్టపర్తిలో జేఏసీ ఆధ్వర్యంలో టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. అమరాపురం, అగళి, గుడిబండ, అమడగూరు, నల్లమాడ, బుక్కపట్నం, సోమందేపల్లి, పరిగి, రొద్దం, గోరంట్ల, రాప్తాడు, కనగానపల్లి, ఆత్మకూరు, సీకేపల్లి, రామగిరి, ఉరవకొండ, వజ్రకరూరు, కూడేరు, బెళుగుప్ప, కణేకల్లు, గుమ్మఘట్ట, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు బంద్ నిర్వహించారు. పెనుకొండలో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. బుక్కరాయసముద్రంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి, ఎమ్మెల్సీ శమంతకమణి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేరం నాగిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బంద్ పాటించారు. విడపనకల్లులో కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా, శనివారం కూడా బంద్ కొనసాగించాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులు, సమైక్యవాదులకు పిలుపునిచ్చారు.