బాబు నీతులు చెబుతారే గానీ పాటించరు | shankar narayana fires on cm chandrababu | Sakshi
Sakshi News home page

బాబు నీతులు చెబుతారే గానీ పాటించరు

Published Tue, Apr 4 2017 1:26 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

బాబు నీతులు చెబుతారే గానీ పాటించరు - Sakshi

బాబు నీతులు చెబుతారే గానీ పాటించరు

పెనుకొండ : ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సీఎం చంద్రబాబు నీతులు చెబుతారేగానీ పాటించరనే విషయం ప్రజలకు బాగా అర్థమయ్యిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అన్నారు. సోమవారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు ఇది రాజ్యాంగ వ్యతిరేకమని, తలసాని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ చంద్రబాబు గవర్నర్‌, రాష్ట్రపతి భవన్‌ చుట్టూ తిరిగారన్నారు. దమ్ముంటే తలసాని శ్రీనివాసయాదవ్‌ విసిరిన సవాల్‌ను చంద్రబాబు స్వీకరించాలన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమేకాక మంత్రి పదవులు కూడా ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

చంద్రబాబుకు చీము, నెత్తురూ ఉంటే వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి మంత్రి పదవులు పొందిన ఎమ్మెల్యేలను వెంటనే రాజీనామా చేయించి గెలిపించుకోవాలన్నారు. టీడీపీ పాలనలో మైనార్టీలు, ఎస్టీలకు మంత్రి పదవులు దక్కకుండా పోయాయని, బడుగుల పార్టీ అని చెప్పుకునే బాబు దానిని బడాబాబుల పార్టీగా మార్చేశారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను దూషించిన, అవినీతిపరులైన ఎమ్మెల్యేలకు తన ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పి తీరుతారన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్‌సెల్‌ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, మండల కన్వీనర్‌ శ్రీకాంతరెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్‌రెడ్డి, మురళి, అనితాశ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, రాజగోపాలరెడ్డి, మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన్‌ నాగలూరు బాబు, కొండలరాయుడు, ప్రసాద్, బోయనరసింహ, సోమశేఖరరెడ్డి, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement