రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని లాంటిదని, హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎ స్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అన్నారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా సోమ వారం ఆయన పరిగి మండల ంలోని టీడీపల్లి,ఎర్రగుంట గ్రామాల్లో పర్యటించారు.
∙వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ
పెనుకొండ రూరల్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని లాంటిదని, హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎ స్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అన్నారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా సోమ వారం ఆయన పరిగి మండలంలోని టీడీపల్లి,ఎర్రగుంట గ్రామాల్లో పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హోదా వస్తే పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు.
ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత జగన్మోహహన్ రెడ్డి ఒక్కరే ఉద్యమం చేస్తున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడడానికే చంద్రబాబు ప్రత్యేక హోదా పై నోరు మెదపడం లేదన్నారు. ప్రత్యేక హోదా ఆందోళనలో పాల్గొనేం దుకు విద్యార్థులు వెళ్తుండగా వారి తల్లిదండ్రులపై పీడీ యాక్ట్ పెట్టి కేసులు నమోదు చేస్తామని అధికార పార్టీ నాయకులు భయపెడ్తున్నారన్నారు. అధికారపార్టీ నాయకులు ప్రజలకు ఏమి చేశారని జనచైతన్య యాత్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గొళ్లపల్లికి హంద్రీ నీవా జలాలను తీసుకొస్తున్నామని మభ్య పెడ్తున్నారన్నారు.
జిల్లాకు సాగు, తాగునీరు తీసుకురావడంలో జిల్లా మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎంపీలు దద్దమ్మలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పెనుకొండ నియోజక వర్గానికి వచ్చిన పరిశ్రమలు శిలాఫలాకాలకే పరిమితమయ్యాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి ఆర్భాటాలే తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెన్నపూసగోపాల్‌రెడ్డిని గెలిపించి అధికార పార్టీకి కనువిప్పు గావించాలని పట్టభద్రులకు ఆయన పిలుపునిచ్చారు.