ఎన్‌ఆర్‌ఐ సభకు హాజరైన ఎన్‌ఆర్‌ఐలు, ప్రజలు
అనంతపురం: నిత్యం ప్రజల కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మేధావి వర్గం అభిప్రాయపడింది. ‘వై ఆంధ్రప్రదేశ్ నీడ్స్ జగన్’ అనే అంశంపై ప్రవాసాంధ్రులు (ఎన్‌ఆర్‌ఐ) ఆదివారం నగరంలోని సూరజ్ గ్రాండ్ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ జడ్జి కిష్టప్ప మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా వెనుకబడిన ఏపీ అభివృద్ధి ప్రత్యేక హోదానే ఏకైకమార్గమని ప్రారంభం నుంచి పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన వెనుక చాలా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే అక్రమ కేసులు బనాయించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసులు పెడితే ఎందుకు స్టే తెచ్చుకున్నారని ప్రశ్నించారు.
నిజాయితీగా ఉంటే విచారణను స్వాగతించాలన్నారు. మొదట ప్యాకేజీకి ఒప్పుకొని ప్రజా వ్యతిరేకతను చూసే యూటర్న్ తీసుకొని చంద్రబాబు హోదానినాదం అందుకున్నారన్నారు. దీనిపై అన్ని వర్గాలూ ఆలోచించాలన్నారు. సీఎం చంద్రబాబు హయాంలో అభివృద్ధి అంతా పేపర్లకే పరిమితమైందని వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ కలకడ విమర్శించారు. వైఎస్ జగన్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి కష్టనష్టాలు తెలుసుకుంటున్నారని, ఆయనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి కల్పించడంలో ఘోరంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ సంక్షేమ సంఘం నాయకుడు భక్తవత్సలంరెడ్డి మండిపడ్డారు. ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. లక్షలాది మంది యువత ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని, ప్రత్యేక హోదా సాధనలో బీజేపీ, టీడీపీ రెండూ మోసగించాయని, దీనిపై అందరూ ఆలోచించాలని ఎన్‌ఆర్‌ఐ వెంకట్ అన్నారు.
ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు
రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. కులం, డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజల కోసం పని చేసే వారికి అవకాశం కల్పించాలి. అన్ని సామాజక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకత్వం రావాలి. అవకాశ వాదం కోసం పార్టీలు మారేవారిని ప్రజలు క్షమించరు.– పుల్లారెడ్డి, ఎస్కేయూ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్
ఉద్యోగులకుతీవ్ర ఇబ్బందులు
జిల్లాస్థాయి అధికారి మొదలుకుని గ్రామస్థాయి ఉద్యోగి వరకు ఎవరూ సొంత నిర్ణయాలు తీసుకొని పనిచేసే పరిస్థితి లేదు. ఉద్యోగులుగా ఉంటూ ప్రజలకు సేవ చేయలేకపోతున్నామనే బాధ చాలామందిలో ఉంది. వ్యవస్థలు పటిష్టం చేసే నాయత్వం అవసరం.– జయరామప్ప, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment