ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడండి | government schemes | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడండి

Published Fri, Feb 6 2015 2:35 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

government schemes

అధికారులకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ విజ్ఞప్తి
 సోమందేపల్లి : పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రభు త్వ పథకాలు అర్హులందరికీ అందేలా చూ డాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శం కర్‌నారాయణ అధికారులకు సూచించారు. మండలంలో అధికార పార్టీకి చెందిన వారి నే రుణాల మంజూరుకు ఎంపిక చేస్తున్నార ని, అదే విధంగా పింఛన్ల పంపిణీలో కూడా అధికార పార్టీ ఒత్తిడితో కావాలనే కొన్నింటి ని తొలగించారని, అర్హులకు తీరని అన్యా యం జరుగుతోందని మండల నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయాలపై ఎంపీడీవోతో మాట్లాడేందుకు ఆయన గురువారం సోమందేపల్లికి వచ్చారు. ఎంపీడీవో రామాంజినేయులుతో మాట్లాడుతూ క్రెడిట్ క్యాంపులకు దరఖాస్తు చేసుకొమ్మని ప్రకటనలు చేశారన్నారు. వాటిని కమిటీ సభ్యుల సూచన మేరకు అధికార పార్టీ వారికే ఇస్తారనే ప్రచారం జరుగుతోందని తెలిపారు. అలాంటప్పుడు ప్రకటనలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలపై ఇప్పటికే కోర్టుకు వేశామన్నారు. అదే విధంగా పింఛన్ల పంపిణీలో కూడా చాలామందికి అర్హత ఉన్నా తొలగించారని, దీనివ ల్ల అనేక మందికి అన్యాయం జరుగుతోందన్నారు.
 
 దీనిపై స్పందించిన ఎంపీడీవో మాట్లాడుతూ గతంలో చిన్న పొరపాట్ల వల్ల చాలామంది పింఛన్లు తొలగించారని, గత నెలలో తిరిగి వాటిని అప్‌లోడ్ చేశామని చెప్పారు. క్రెడిట్ క్యాంపులలోను అర్హులందరికీ న్యాయం చేస్తామన్నారు. అనంతరం అక్కడి నుంచి తహశీల్దారు కార్యాలయంలో తహశీల్దారు లక్ష్మినాయక్‌ను శంకరనారాయణ కలిశారు. అంత్యోదయ కార్డులలో కూడా పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హులకు అందెలా చూడాలని కోరారు. త్వరలో చేపట్టే ఇంటిపట్టాల పంపిణీలోను అర్హులకు న్యాయం చేయూలని తెలిపారు.
 
  అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. త్వరలోనే పార్టీ గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ మండల కన్వీనర్ వెంకటరత్నం, సర్పంచ్ నారాయణరెడ్డి, పెనుకొండ మండల కన్వీనర్ వెంకట్రామిరెడ్డి, నేతలు గుట్టూరు శ్రీరాములు, నాగలూరు బాబు, కంబాలప్ప, సంజీవరాయుడు, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 జగన్‌పై విమర్శలు మాని ప్రజాసేవ చేయండి
 శెట్టిపల్లి (పెనుకొండ) : వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం అధికార పార్టీ నేతలు మాని,  ప్రజలకు సేవ చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల  శంకరనారాయణ హితువు పలికారు. శెట్టిపల్లి గ్రామంలో గురువారం ఓ వివాహ కార్యక్రమానికి  విచ్చేసిన ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యూరు.
 
 అనంతరం మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే ముందు తాము ప్రజల కు ఏం చేస్తున్నామని ఆత్మవిమర్మ చేసుకోవాలని సూచిం చారు. ఎన్నికల హామీలు గాలికి వదిలేసి సొంత ప్రయోజనా ల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరుబాబు, బీసీసెల్ జిల్లా నేత గుట్టూరు శ్రీరాములు, నేతలు సానిపల్లి మహీధర్, ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి, సర్పం చ్‌లు చలపతి,  శ్రీకాంతరెడ్డి, సుధాకరరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement