
వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ
సాక్షి, గుంటూరు జిల్లా: ఎన్టీఆర్ పేరు చెబితే కిలో రెండు రూపాయల బియ్యం పథకం గుర్తుకు వస్తుంది..వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెబితే ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలు గుర్తుకు వస్తాయి..అలాంటి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క పథకమైనా ఉందా అని సూటిగా టీడీపీ నేతలనుద్దేశించి వైఎస్సార్‌సీపీ అగ్రనేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా ఆయన బాటలో పయనించి అమలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఆంధ్ర రాష్ట్రంలో వనరుల దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు మట్టి, ఇసుక లాంటి వాటిని ఏదీ మిగలనీయడం లేదని మండిపడ్డారు. మహిళలపై టీడీపీ అధికారంలోకి వచ్చాక అకృత్యాలు పెరిగాయని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికారం ముఖ్యమని, వైఎస్సార్ ఆశయాలను సాధించాలంటే జగన్‌ని తప్పక సీఎం చేయాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment