గోరంట్ల : ఓటుకు నోటు కేసులో బయట పడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలోనూ, తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టాడని ,దీనికి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ డిమాండ్ చేశారు. గడపగడపకూ వైఎస్సార్‌సీపీలో భాగంగా ఆయన మంగళవారం మండల పరిధిలోని గుంటిపల్లి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని,రాష్ట్ర ప్రయెజనాలను కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.
రాయలసీమ, ఉత్తరాంధ్రల ప్రత్యేక ప్యాకేజీలతో పాటు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై త్తిడి తేకుండా రెండేళ్ల పాటు కాలయాపన చేశారన్నారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాదులో పదేళ్ల పాటు వుండాల్సి వున్నా, టీడీపీ ప్రజాప్రతినిధుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తున్నారని, కనీసం పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకురావడంలో ఘోర వైఫల్యం చెందారన్నారు.
ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ప్రధాన పంటగా వేరుశనగ సాగు చేశారని, అయితే వర్షభావ పరిస్థితులతో పంట పూర్తిగా ఎండిపోన తర్వాత ప్రభుత్వం రైతుల పట్ల మొసలికన్నీరు కారుస్తోందని తెలిపారు. పార్టీ మండల కన్వీనర్ ఫకృద్దీన్‌సాబ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గంపల వెంకటరమణారెడ్డి, సహకారసంఘాల అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, రఘురామిరెడ్డి, శంకరరెడ్డి, ఎంపీటీసీ గంగిరెడ్డి , మహిళ కన్వీనర్ తబితా లియోనా తదితరులు పాల్గొన్నారు.
ఓటుకు నోటు.. రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు
Published Wed, Aug 31 2016 12:09 AM | Last Updated on Tue, May 29 2018 3:42 PM
Advertisement