విచారణ అంటే భయమెందుకు బాబూ?
గోరంట్ల : నేనే నిప్పులా బతికాను..నీతి, నిజాయితీ అనే ఉపోద్ఘాతాలు చెప్పే సీఎం చంద్రబాబు ఏ కేసులోనైనా విచారణ అంటే భయం ఎందుకో అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలుగుండ్ల శంకరనారాయణ ప్రశ్నించారు. మండలంలోని కమ్మవారిపల్లి గ్రామంలో ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో రెండు రోజుల క్రితం గంభీరంగా తన నిజాయితీపై ఉపోద్ఘాతాలు ఇచ్చిన సీఎం హడావుడిగా హైకోర్టులో స్టే తీసుకురావడంపై ఆయన నీతి, నిజాయితీలను శంకించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
న్యాయస్థానం ఆశ్రయించడంతో ఆయన ఈ కేసులో ఎంత ఆందోళనలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చునన్నారు. పలు కేసుల్లో ఏదో ఒక సాంకేతిక కారణాలను చూపి స్టేలను తెచ్చుకున్నారని ఆయన గుర్త చేశారు. ఏతప్పు చేయకపోతే ఎందుకు స్టే తెచ్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఆడియో టేపులు ఉన్నా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ఫకృద్దీన్‌సాబ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గంపల వెంకటరమణారెడ్డి, మలసముద్రం మాజీ సర్పంచు వెంకటరమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి, నాయకులు ధనుంజయరెడ్డి , శివశంకర్‌రెడ్డి, వీరనారాయణరెడ్డి, అంగడినారాయణరెడ్డి, ఇలియాస్, డాక్టర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.