పెనుకొండ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడ్డారని, అయినప్పటికీ ఓటర్లు ప్రలోభాలకు తలొగ్గకుండా వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డికి ఓటు వేశారని పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల వద్ద పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తీరును పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రెండు మూడు రోజులుగా పల్లెలు, పట్టణాల్లో గ్రాడ్యుయేట్ల ఇళ్ల వద్దకు వెళ్లిన టీడీపీ నాయకులు త్వరలో నిరుద్యోగ భృతి ఇచ్చేది తామేనని, ఓటు వేయకపోతే నష్టపోతారని బెదిరించారన్నారు. దీనితోపాటు అందినకాడికి తాయిలాలు ఎరచూపి ఓటు వేయాల్సిందేనని ఒత్తిడి తెచ్చారన్నారు.
అయినా ఓటర్లు తమ పార్టీ వైపే మొగ్గు చూపారని, గోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వెంట కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, పట్టణ కన్వీనర్ ఇలియాజ్, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి న్యాయవాది భాస్కరరెడ్డి, సర్పంచులు సుధాకరరెడ్డి, రాజగోపాలరెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్‌రెడ్డి, మురళి, అనితా శ్రీనివాసరెడ్డి, ఉమర్‌ఫారూక్, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరుబాబు తదితరులు ఉన్నారు.
ఎన్ని చేసినా.. గెలుపు వెన్నపూసదే!
Published Thu, Mar 9 2017 11:59 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement