vennapusa gopalreddy
-
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ఎన్జీవో ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పది రోజుల్లో పీఆర్సీ సమస్య పరిష్కరిస్తామని స్వయంగా సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. ఈలోపే ఉద్యోగ సంఘాల నేతలు కొందరు బ్లాక్ మెయిల్‌కు దిగటం ఏమిటని ప్రశ్నించారు. తమ వద్ద 60 లక్షల ఓట్లు ఉన్నాయని ఉద్యోగ నేత అనడం దేనికి సంకేతమని అన్నారు. సీఎం జగన్ అడిగిన 10 రోజులు గడువు ముగియకముందే అల్టిమేటం ఎందుకు ఇచ్చారని, సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకొంటే బాగుంటుందని చెప్పారు. ఉద్యోగులే ప్రభుత్వ రథ సారథులని, వారు బాగా పనిచేస్తున్నారని సీఎం జగన్ చెప్తున్నారన్నారు. ఈ పరిస్థితిలో ఉద్యోగ నేతలు ఇలా వ్యవహరించటం సరికాదన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ అన్ని విధాల కృషి చేస్తారన్నారు. ఉద్యోగులకు జీతాలు ఎక్కడ రావడంలేదో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పాలన్నారు. నాయకులు సంయమనం పాటించాలని కోరారు. లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్లే ఇక్కడా జరుగుతుందని చురకలు అంటించారు. తర్వాత ఉద్యోగ సంఘాల నేతలే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులను ఇంత మంచిగా చూసుకొనే సీఎం ఎక్కడా ఉండరని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్ చాలా విషయాల్లో పెద్ద పీట వేశారన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులు ఆలోచించి అడుగులు వేయాలన్నారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం అందజేసేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ తనయుడు వెన్నపూస రవీంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగి ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి సహా పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఇంకుడు గుంతల పనుల్లో 548 కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. మరోవైపు చంద్రబాబు బస చేసిన ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద వామపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. 3 గంటలుగా వేచి ఉన్నా చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటంపై సీపీఐ, సీపీఎం నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
యానిమేటర్లకు వైఎస్సార్సీపీ అండ
అనంతపురం అర్బన్: స్వయం సహాయక సంఘాలకు జీవనాడిగా ఉన్న యానిమేటర్లకు (వీఓఏ) వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. డిమాండ్ల సాధనకు వీఓఏలు చేస్తున్న పోరాటాలకు వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే యానిమేటర్లకు రూ.10 వేలు వేతనం ఇస్తామని ఇప్పటికే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రకటించారన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే అమలు చేసి కుటుంబాల్లో వెలుగులు నింపుతామన్నారు. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీఓఏ) ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట యానిమేటర్లు చేపట్టిన ధర్నాకు వారు హాజరై సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, యానిమేటర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అనంతరం సంఘం గౌరవాధ్యక్షులు ఇ.ఎస్.వెంకటేశ్ మాట్లాడుతూ, దసరా కానుకగా జీఓ 1,243ను విడుదల చేసిన ప్రభుత్వం..ఏడాది కాల పరిమితికే జీఓ ఇవ్వడం మోసం చేయడమేనన్నారు. ఇందులో పదోన్నతులు, ప్రమాదబీమా, సెర్ఫ్ నుంచి గుర్తింపుకార్డులు, యూనిఫారం ప్రస్తావన లేదన్నారు. దీన్నిబట్టి చూస్తే యానిమేటర్లకు ఉద్యోగభద్రత కల్పించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. యానిమేటర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ పోరాటం సాగిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్ర (రాజారాం), ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, మహిళా విభాగం అనంతపురం పార్లమెంట్ అధ్యక్షురాలు బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, వీఓఏ ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ వాసునాయక్ తదితరులు పాల్గొన్నారు. ముమ్మాటికీ మోసం చేయడమే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లుతున్న యానిమేటర్లకు వేతనం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభించడం బాధాకరం. యానిమేటర్లకు రూ.3 వేలు ఇచ్చేలా జీఓ ఇచ్చి అమలు చేయకపోవడం మోసమే. అది కూడా ఒక ఏడాదికి మాత్రమే ఇవ్వడం దుర్మార్గం. చంద్రబాబు స్వయం సహాయక సంఘాల్లో రాజకీయం జొప్పించి కలుషితం చేశారు. మహిళ సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విశేష కృషి చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఆ మహానేత అమలు చేసిన పథకాలన్నీ అమలు చేస్తాం. కచ్చితంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి యానిమేటర్లకు రూ.10 వేలు వేతనం అమలు చేసి భద్రత కల్పిస్తారు.– అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య యానిమేటర్లకు తీరని అన్యాయం యానిమేటర్లకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. ప్రాజెక్టుల పేరుతో రూ. వందల కోట్లు కొల్లగొడుతున్న ప్రజాప్రతినిధులు.. యానిమేటర్లకు వేతనం ఇప్పించేందుకు మాత్రం మనసు రావడం లేదు. గౌరవవేతనం రూ.3 వేలు సర్వీసు చార్జీ ఇస్తామంటూ జీఓ ఇచ్చి దానిని అమలు చేయకపోవడం అన్యాయం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 50 వేల సంఘాలు డీఫాల్ట్ అయ్యాయి. ప్రభుత్వం యానిమేటర్లను రాజకీయంగా వాడుకుంటోంది. ప్రజాప్రతినిధులు కూడా తమకు నచ్చిని వారిని తొలగించి...అనుకూలమైన వారిని నియమించుకుంటూ అభద్రతాభావం తీసుకొస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే యానిమేటర్లకు తప్పక న్యాయం జరుగుతుంది. –రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి -
ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్న సీఎం
అనంతపురం : రాష్ట్రంలో కొన్నేళ్లుగా సమసిపోయిన ఫ్యాక్షన్ రాజకీయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి ఆజ్యం పోస్తున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ðవైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. పత్తికొండలో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్న నారాయణరెడ్డిని రానున్న ఎన్నికల్లో ఎదుర్కోలేక మట్టు పెట్టారన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి కేఈ కృష్ణమూర్తి ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల జరిగిన జంటహత్యల వెనుక గొట్టిపాటి రవికుమార్ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఎదురు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఇలాంటి నీచ రాజకీయాలకు తెర తీస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు. -
ఎస్పీని కలిసిన ఎమ్మెల్సీ వెన్నపూస
అనంతపురం : పట్టభధ్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి శనివారం ఎస్పీ రాజశేఖర్‌బాబును క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు, కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించారంటూ ఎస్పీని అభినందించారు. అనంతరం స్థానిక కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలోని పదోతరగతి మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించారు. ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎన్టీఓ సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పీఎస్ ఓబుళరావు, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డి, రిటైర్డ్ లెక్చరర్ల సంఘం నాయకులు జె.శ్రీరాములు, జి.కొండారెడ్డి తదితరులు ఉన్నారు. -
కార్మికుల హక్కులు కాల రాస్తున్నాయ్
అనంతపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం జిల్లా కార్యాలయంలో ఘనంగా జరుపుకొన్నారు. ట్రేడ్ విభాగం జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బరి తెగిస్తున్నారన్నారు. అధికారులపైన, మహిళలపైన దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దుప్పటి పంచాయితీలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక విద్యా, వైద్య రంగాలు సర్వనాశనం అయ్యాయన్నారు. వైఎస్సార్సీపీ క్రమశిక్షణ సంఘం సభ్యులు బి.ఎర్రిస్వామిరెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం, నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ అధికారంలో వస్తే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని చెప్పిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత విస్మరించారని మండిపడ్డారు. కార్మికుల న్యాయమైన హక్కులు, సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ పోరాడుతుందన్నారు. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీం అహ్మద్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఐజీ స్థాయి అధికారికే రక్షణ లేకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. మరువపల్లి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ట్రేడ్ విభాగం ఎప్పుడూ కార్మికుల పక్షాన ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, అనంత చంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు చింతకుంట మధు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ప్రధానకార్యదర్శులు కాలువ వెంకటరాముడు, రామచంద్రారెడ్డి, నాయకులు రిలాక్స్ నాగరాజు, యూపీ నాగిరెడ్డి, షఫీ, జేఎం బాషా, పాన్ సాదిక్, నిమ్మల నాగరాజు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, కృష్ణవేణి, శ్రీదేవి, దేవి, కొండమ్మ, హజరాబి, షమీమ్, విద్యార్థి విభాగం నాయకులు బండి పరుశురాం, నరేంద్రరెడ్డి, షహతాజ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన వెన్నపూస గోపాల్‌రెడ్డి
అమరావతి: పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి శుక్రవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆయనకు స్వీట్ తినిపించి అభినందనలు తెలిపారు. కాగా పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో గోపాల్ రెడ్డి ... టీడీపీ అభ్యర్థిపై 14,367 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
‘వెన్నపూస’ విజయకేతనం
– మండలి ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి – టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డిని ఎలిమినేట్ చేసి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన అధికారులు – వెన్నపూసకు ‘మ్యాజిక్ ఫిగర్’ కంటే 223 ఓట్ల ఆధిక్యత...టీడీపీ అభ్యర్థిపై 14,367 ఓట్ల మెజార్టీ –పార్టీ అభ్యర్థి గెలుపుతో కదనోత్సాహంలో వైఎస్సార్సీపీ శ్రేణులు – ప్రభుత్వ పనితీరుకు ఈ ఎన్నికలే రెఫరెండం అంటున్న పార్టీ నేతలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) అందరూ అనుకున్నట్లే జరిగింది. పట్టభద్రులు ‘ఓటెత్తిన’ చైతన్యంతో వైఎస్సార్సీపీ అభ్యర్థికి పట్టం కట్టారు. తద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటిచెప్పారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల కౌంటింగ్‌లో తొలిరౌండ్ నుంచి నిలకడైన ఆధిక్యత ప్రదర్శించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి తిరుగులేని విజయం సాధించారు. పెద్దలసభలో ఆయన సగర్వంగా అడుగుపెట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ తమకు బలమైన జిల్లాగా భావిస్తున్న అనంతపురం నుంచి, అందులోనూ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన గోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో ‘అనంత’తో పాటు కర్నూలు, వైఎస్సార్ జిల్లా వాసుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఏస్థాయిలో వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోంది. ఇదే తరుణంలో వైఎస్సార్సీపీపై గట్టి నమ్మకం ఉంచారన్న విషయాన్ని ఈ ఎన్నికలు సుస్పష్టం చేస్తున్నాయి. గోపాల్‌రెడ్డి గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో ఉన్నాయి. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 20న మొదలైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి ప్రతి రౌండ్లోనూ గోపాల్‌రెడ్డి నిలకడగా ఆధిక్యత ప్రదర్శించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆరు రౌండ్లలో 53,714 ఓట్లు దక్కించుకున్నారు. అప్పటికి తన సమీప ప్రత్యర్థి కేజేరెడ్డిపై 12,677 ఓట్ల ఆధిక్యత సాధించారు. అయితే విజయానికి అవసరమయ్యే ‘మ్యాజిక్ ఫిగర్’ 67,887. దీని కంటే 14,173 ఓట్లు తక్కువ రావడంతో ఎన్నికల అధికారులు మంగళవారం ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. బరిలోని 25మంది అభ్యర్థులలో తక్కువ ఓట్లు పోలైన వారి నుంచి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. వారి ఓట్లను ఇతర అభ్యర్థులకు జత పరుస్తూ వచ్చారు. గోపాల్‌రెడ్డి, కేజేరెడ్డి, గేయానంద్ మినహా తక్కిన 23 మంది అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓట్లు 8,239 పోలయ్యాయి. ఎలిమినేషన్లో ఈ ఓట్లలో 23వ రౌండ్ ముగిసే సరికి గోపాల్‌రెడ్డికి మరో 1,771 లభించాయి. ఆపై 23వ రౌండ్లో గేయానంద్‌ను ఎలిమినేట్ చేశారు. ఆయనకు లభించిన మొత్తం 34,910 (22వ రౌండ్ పూర్తయ్యే సరికి) ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యతను లెక్కించారు. ఇందులో 10,798 ఓట్లు గోపాల్‌రెడ్డికి దక్కాయి. ఇవి కలిపి గోపాల్‌రెడ్డికి వచ్చిన ఓట్ల సంఖ్య 66,283కు చేరింది. అయినప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌కు 1,827 ఓట్ల దూరంలో నిలిచారు. దీంతో చివరకు టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు పోలైన ద్వితీయ ప్రాధాన్యత, ఆ తర్వాత ప్రాధాన్యత ఓట్లను 24వ రౌండ్‌గా అధికారులు లెక్కించారు. ఈ ప్రక్రియలో ఒక్కో టేబుల్ పరిధిలోని ఓట్లు లెక్కిస్తూ మ్యాజిక్ ఫిగర్‌కు గోపాల్‌రెడ్డి చేరువయ్యారా, లేదా అని అధికారులు పరిశీలిస్తూ వచ్చారు. కొన్ని టేబుళ్లలోని ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక గోపాల్‌రెడ్డికి పోలైన ఓట్లను పరిశీలించగా 68,110కి చేరాయి. ఆయన విజయానికి అవసరమైన ఓట్లు 67,887 మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ కంటే 223 ఓట్లు ఎక్కువ లభించడంతో ఎన్నికల అధికారులు గోపాల్‌రెడ్డి విజయాన్ని ఖరారు చేశారు. జిల్లా వ్యాప్తంగా సంబరాలు గోపాల్‌రెడ్డి గెలిచినట్లు బుధవారం ఉదయం ఆరు గంటలకు అధికారులు ప్రకటించారు. ప్రకటన వెలువడగానే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, వైఎస్సార్సీపీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డితో పాటు పలువురు నేతలు కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని గోపాల్‌రెడ్డిని అభినందించారు. ఒకరికొకరు అభినందనలు తెలియజేసుకున్నారు. ఆపై రిటర్నింగ్ అధికారి కోన శశిధర్ డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. తర్వాత పార్టీ నేతలంతా ఆనందోత్సాహాల మధ్య గోపాల్‌రెడ్డిని భుజాలపై ఎత్తుకుని ర్యాలీగా బయటకు వచ్చారు. అప్పటికే పాలిటెక్నిక్ కాలేజీ వద్ద పార్టీ కార్యకర్తలు భారీగా వేచివున్నారు. గోపాల్‌రెడ్డి బయటకు రాగానే పూలమాలలు వేసి అభినందించారు. ‘జై జగన్’.. ‘జోహార్ వైఎస్సార్’ నినాదాలతో హోరెత్తించారు. అక్కడి నుంచి ర్యాలీగా వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఆపై పార్టీ కార్యాలయానికి వెళ్లి సంబరాలు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లోనూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. టీడీపీకి కోలుకోలేని దెబ్బ గోపాల్‌రెడ్డి అనంతపురం జిల్లా వాసి. జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో 2 ఎంపీలతో పాటు 12 ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ గెలిచింది. కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాను ప్రలోభపెట్టి సైకిలెక్కించారు. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన 8మంది ఎమ్మెల్యేలకు పచ్చకండువా కప్పారు. ఈ క్రమంలో మెజార్టీ ఎమ్మెల్యేలు, అధికార అండతో మండలి ఎన్నికల్లో గెలవాలని టీడీపీ భావించింది. అయితే.. విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్ష పార్టీ పనితీరును బేరీజు వేస్తూ తీర్పు ఇచ్చారు. వైఎస్సార్సీపీ అభ్యర్థికి పట్టం కట్టారు. టీడీపీ అభ్యర్థి ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాయి. నెలకిందట సీఎం చంద్రబాబు పిలిచి జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందని హెచ్చరించారు. ఈ మాటలను నిజం చేసేలా ఓటర్లూ తీర్పు ఇచ్చారు. ఈ విజయంతో వైఎస్సార్సీపీ శ్రేణులు కదనోత్సాహంతో ఉన్నాయి. వచ్చే ఏడాది జరగబోయే సర్పంచ్ ఎన్నికలతో పాటు ఆపై జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
వైఎస్ఆర్ ఎల్పీ కార్యాలయంలో సంబరాలు
-
వైఎస్ఆర్ ఎల్పీ కార్యాలయంలో సంబరాలు
అమరావతి: ఎమ్మెల్సీగా వెన్నపూస గోపాల్ రెడ్డి గెలుపుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు బుధవారం వైఎస్ఆర్ ఎల్పీ సంబరాలు చేసుకున్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధి వెన్నపూస గోపాల్ రెడ్డి విజయంతోపాటు...మూడు చోట్ల వైఎస్ఆర్ సీపీ మద్దతు ఇచ్చిన పీడీపీ అభ్యర్ధులు గెలవడంతో పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అమరావతిలో వైఎస్ఆర్ ఎల్పీ కార్యాలయంలో పార్టీ అధినేతతో పాటు ఇతర నేతలు స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఇది నిజమైన ప్రజా తీర్పు అని నేతలు అభివర్ణించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ ఎమ్మెల్యేలు స్వీట్లు తినిపించారు. ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ సీపీనే విజయం సాధించిందని వైఎస్ జగన్ అన్నారు. గోపాల్ రెడ్డికి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. కాగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిపై 14,146 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
దూసుకెళ్తున్న వెన్నపూస
- గెలుపు దిశగా వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి - ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యత -‘మొదటి ప్రాధాన్యత’లో 12,677 ఓట్ల మెజార్టీ - ‘మ్యాజిక్ ఫిగర్’ దాటాలంటే మరో 14,173 ఓట్లు అవసరం – కొనసాగుతోన్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు – నేడు ఫలితం వెలువడే అవకాశం - రెండు, మూడు స్థానాల్లో కేజేరెడ్డి, గేయానంద్ – నూతనోత్సాహంలో వైఎస్సార్సీపీ శ్రేణులు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యతను చాటారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేజేరెడ్డి కంటే 12,677 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పీడీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ మూడోస్థానంలో నిలిచారు. అయితే.. విజయానికి అవసరమైన ‘మ్యాజిక్ ఫిగర్’ గోపాల్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మొదటి ప్రాధాన్యతలో కేజేరెడ్డి, గేయానంద్‌కు పోలైన ఓట్లు, ‘మ్యాజిక్ ఫిగర్’కు అవసరమయ్యే ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే గోపాల్‌రెడ్డికే విజయావకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. తుది ఫలితం నేడు వెలువడే అవకాశముంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు ముంగిట ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు నూతనోత్సాహంతో ఉన్నాయి. ప్రతి రౌండ్లోనూ వైఎస్సార్సీపీకి మెజార్టీ పట్టభద్రుల కోటా మండలి ఎన్నికల్లో 1,55,711 ఓట్లు పోలయ్యాయి. వీటిని సగటున 26 వేల ఓట్ల చొప్పున విభజించి ఆరు రౌండ్లలో లెక్కింపు పూర్తిచేశారు. సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమైన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మంగâ¶ళవారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. 22 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. మొదటి రౌండ్ నుంచి ఆరో రౌండ్ వరకు ప్రతి రౌండ్లోనూ గోపాల్‌రెడ్డికి ఆధిక్యత లభించింది. ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయనకు 53,714 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డికి 41,037, పీడీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ గేయానంద్‌కు 32,810 ఓట్లు పోలయ్యాయి. తక్కిన వారంతా స్వల్ప ఓట్లు సాధించారు. మొత్తమ్మీద మొదటి ప్రాధాన్యత ఓట్లలో గోపాల్‌రెడ్డి సమీప ప్రత్యర్థి కేజేరెడ్డి కంటే 12,677 ఓట్లు అధికంగా సాధించారు. మ్యాజిక్ ఫిగర్‌కు 14,173 ఓట్ల దూరంలో.. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు మినహాయిస్తే తక్కిన 1,35,772 ఓట్లలో 50శాతం కంటే ఒక్క ఓటు ఎక్కువ అంటే 67,887 ఓట్లను ‘మ్యాజిక్ ఫిగర్’గా ఎన్నికల అధికారులు నిర్ధారించారు. ఈ సంఖ్యకు గోపాల్‌రెడ్డి 14,173 ఓట్ల దూరంలో ఉన్నారు. అలాగే ద్వితీయ స్థానంలోని కేజేరెడ్డి 26,850 , గేయానంద్ 35,077 ఓట్ల దూరంలో ఉన్నారు. దీంతో విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకునేందుకు ముగ్గురిలో గోపాల్‌రెడ్డికే అవకాశాలు ఉన్నాయి. బరిలోని 25మంది అభ్యర్థులలో తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థుల నుంచి మొదలు పెట్టి.. ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులను ‘ఎలిమినేట్’ చేస్తూ వస్తారు. వారికి పోలైన ఓట్లను ఇతర అభ్యర్థులకు జత చేస్తారు. ఈ క్రమంలో 22 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయినా ఫలితం తేలే అవకాశం లేదు. దీంతో ఎలిమినేట్ రౌండ్లో 23వ అభ్యర్థి అయిన గేయానంద్‌కు పోలైన ఓట్లలో కూడా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఈ ఓట్ల లెక్కింపుతో అభ్యర్థి విజయం ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గేయానంద్‌కు 32,810 ఓట్లు పోలయ్యాయి. వీటిలో కనీసం 40–50 శాతం ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు తమకు వచ్చిఉంటాయని వైఎస్సార్సీపీ శ్రేణులు భావిస్తున్నాయి. వీటి లెక్కింపు పూర్తవ్వాలంటే మరో పది గంటలకుపైగా పట్టే అవకాశం ఉంది. బుధవారం తెల్లవారుజామున లేదా ఉదయం ఫలితం వెలువడనుంది. పాలిటెక్నిక్ కళాశాల వద్దే పడిగాపులు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో ఫలితాల కోసం బరిలోని రాజకీయ పార్టీల శ్రేణులు, అభ్యర్థుల సన్నిహితులు కౌంటింగ్ కేంద్రమైన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బయట రెండురోజులుగా పడిగాపులు కాస్తున్నారు. ఫలితాలపై స్పష్టత వచ్చేందుకు మరింత సమయం పడుతుందని తెలిసినా ఇక్కడే వేచిచూస్తున్నారు. -
అధికారులకు ధన్యవాదాలు
అనంతపురం : పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో పోలింగ్ ప్రశాతంగా జరిగేందుకు అధికారులు పూర్తిగా సహకరించారన్నారు. ఎక్కడా చిన్న సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్న అధికార యంత్రాగానికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో జరిగే ఎలాంటి ఎన్నికలైనా ఇదే స్ఫూర్తితో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మూడు జిల్లాల్లోనూ తనకు సహకరించిన వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, నాయకులతో పాటు ఓటింగ్‌లో పాల్గొన్న పట్టభద్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు కొర్రపాడు హుసేన్‌పీరా, ఓబుళరావు, ఎస్ఎం బాషా, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ని చేసినా.. గెలుపు వెన్నపూసదే!
పెనుకొండ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడ్డారని, అయినప్పటికీ ఓటర్లు ప్రలోభాలకు తలొగ్గకుండా వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డికి ఓటు వేశారని పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల వద్ద పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తీరును పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రెండు మూడు రోజులుగా పల్లెలు, పట్టణాల్లో గ్రాడ్యుయేట్ల ఇళ్ల వద్దకు వెళ్లిన టీడీపీ నాయకులు త్వరలో నిరుద్యోగ భృతి ఇచ్చేది తామేనని, ఓటు వేయకపోతే నష్టపోతారని బెదిరించారన్నారు. దీనితోపాటు అందినకాడికి తాయిలాలు ఎరచూపి ఓటు వేయాల్సిందేనని ఒత్తిడి తెచ్చారన్నారు. అయినా ఓటర్లు తమ పార్టీ వైపే మొగ్గు చూపారని, గోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వెంట కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, పట్టణ కన్వీనర్ ఇలియాజ్, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి న్యాయవాది భాస్కరరెడ్డి, సర్పంచులు సుధాకరరెడ్డి, రాజగోపాలరెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్‌రెడ్డి, మురళి, అనితా శ్రీనివాసరెడ్డి, ఉమర్‌ఫారూక్, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరుబాబు తదితరులు ఉన్నారు. -
బాబుకు ఓటుతో బుద్ధి చెప్పండి
- ప్రత్యేకహోదా, రైల్వేజోన్, సీపీఎస్ రద్దు కోసం పోరాటం – వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి గుంతకల్లు టౌన్ : ‘రాష్ట్రంలో రాజ్యహింస పెరిగిపోయింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే ప్రజల్ని, ఉద్యమకారుల్ని హింసలకు గురిచేస్తోంది. ఈ అరాచక, అవినీతి, అబద్దాల ప్రభుత్వానికి మీ విలువైన ఓటుతో బుద్ధి చెప్పండి’ అని పట్టభద్రుల వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం గుంతకల్లుకి విచ్చేసిన ఆయన వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డితో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కాపులను బీసీల్లోకి, రజకులను ఎస్సీల్లోకి చేరుస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీల సా«ధన కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ, ఆయా వర్గాల వారిని పోలీసుల చేత అణచివేయించడం దారుణమన్నారు. తాము గెలిస్తే అనేక పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని టీడీపీ అభ్యర్థి కే జే రెడ్డి ప్రచారం చేయడం యువతను మభ్యపెట్టడమేనన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, లేదా నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు వాగ్ధానాలకే అతీగతీ లేదన్నది యువత గుర్తుంచుకోవాలన్నారు. పైగా ఎలాంటి చట్టబద్దత లేని పార్టీ పొలిట్‌బ్యూరో మీటింగ్‌లో నిరుద్యోగ భృతి ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు లీకులిచ్చి చంద్రబాబు పగటివేషగాడినని నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే గుంతకల్లులో మూతపడిన ఏసీఎస్ మిల్లు, హిందూపురంలోని నిజాంషుగర్ ఫ్యాక్టరీ, పెనుకొండలోని ఆల్విన్, కర్నూల్లోని పేపర్‌మిల్లును పునః ప్రారంభించేందుకు ప్రభుత్వంతో పోరాడుతానన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాతో పాటు గుంతకల్లు కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయించడంతో పాటు స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతతోనే గ్రూప్–డి పోస్టుల భర్తీ, అప్రెంటీస్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుకై ఉద్యమిస్తామన్నారు. సమావేశంలో కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ ఫ్లయింగ్ మాబు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు సుధాకర్, మోహన్‌రావు, కౌన్సిలర్లు అహ్మద్‌బాషా, నగేష్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ప్రలోభాలకు మోసపోకండి మూడేళ్ల అధికారంలో అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోపిడీ చేసిన చంద్రబాబు సర్కారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ యువతను ప్రలోభాలకు గురిచేసేందుకు కుట్రపన్నుతోందని పార్టీ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఒక రోజు ఆనందం కోసం ప్రలోభాలకు గురైతే ఆరేళ్లు నానా ఇబ్బందులు పడటం ఖాయమన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు, నిరుద్యోగులు, ఉద్యోగ, కార్మికులందరినీ నిలువునా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పి, వెన్నపూసను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబుకు గుణపాఠం చెబుదాం
అనంతపురం : అపద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. బెంగళూరు వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఎమ్మెల్సీ ఓట్ ఫైండర్’ అనే సరికొత్త మొబైల్ యాప్‌ను స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రారంభించారు. గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆతర్వాత పట్టించుకోలేదన్నారు. ప్రజాపాలన కాకుండా ఆయన సొంత అజెండాతో పరిపాలన సాగిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను నిలువునా మోసగించారన్నారు. ఉద్యమం చేస్తే యువత, విద్యార్థులపై కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. మహిళా సాధికారత కార్యక్రమం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు తప్ప మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కేవలం మూడు కుటుంబాల కోసమే ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేశారన్నారు. రాష్ట్రంలో సాధారణ మహిళలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులుగా ఉన్న మహిళలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. మార్చి 9న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుఫున పోటీ చేస్తున్న తనను దీవించాలని ఓటర్లను అభ్యర్థించారు. టీడీపీ మద్ధతుతో బరిలో నిలిచిన అభ్యర్థి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, బెంగళూరు ఐటీ విభాగం సభ్యులు ముకుందాపురం ప్రతాప్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, ఉదయ్‌కిరణ్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘వెన్నపూస’ను గెలిపించండి
అనంతపురం ఎడ్యుకేషన్ : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్ధతుతో పోటీ చేస్తున్న ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డికు తొలిప్రాధాన్యత ఓటు వేయాలని వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీం అహ్మద్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సప్తగిరి సర్కిల్లో ఉన్న ఈద్గా మసీదు సమీపంలో నిర్వహించిన ప్రచారంలో నదీంఅహ్మద్‌తో పాటు వెన్నపూస గోపాల్‌రెడ్డి, పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం, నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నదీంఅహ్మద్ మాట్లాడుతూ వెన్నపూస గోపాల్‌రెడ్డి గెలిపించడం ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు. ముఖ్యంగా నిరుద్యోగులను ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మించి ఓట్లు దండుకున్నారన్నారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం లేదంటే ప్రతినెలా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మూడేâýæ్లవుతున్నా పట్టించుకోలేదన్నారు. దీనికితోడు రాష్ట్ర విభజనతో అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది సంజీవినిలాంటిదన్నారు. ప్రత్యేకహోదా కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఈరోజు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించాలనే లక్ష్యంగా తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించి ప్రత్యేకహోదా ఉద్యమానికి మద్ధతు పలకాలని విజ్ఞప్తి చేశారు. గోపాల్‌రెడ్డికి మద్దతుగా నేడు ప్రచారం అనంతపురం : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వైఎస్ఆర్ సీపీ మద్దతు అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి తరఫున ప్రచారం చేసేందుకు బెంగళూరు నుంచి ఐటీ విభాగం ప్రతినిధులు శనివారం రానున్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు ఆకాంక్షించే పట్టభద్రులైన యువత, నిరుద్యోగుల చైతన్యమే లక్ష్యంగా గోపాల్‌రెడ్డికి ప్రచారం చేయడానికే తాము వస్తున్నట్లు ఈ సందర్భంగా ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు ఉదయం 10.30 గంటలకు ప్రెస్‌క్లబ్‌కు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. -
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన
– రాయలసీమ అభివృద్ధిని విస్మరించారు – ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి – ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపు – అట్టహాసంగా వెన్నపూస గోపాల్‌రెడ్డి నామినేషన్ అనంతపురం అర్బన్ : రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని, రాయలసీమ అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ అమలు చేయని ఈ ప్రభుత్వానికి ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం (వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) నుంచి పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎన్జీవో సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు వెన్నపూస గోపాల్‌రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా అనంతపురం రెండో రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గోపాల్‌రెడ్డికి పార్టీ బీఫారంను ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తదితరులు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఒకటో రోడ్డులోని రాఘవేంద్ర స్వామి ఆలయానికి చేరుకుని.. పూజలు చేశారు. అక్కడి నుంచి సుభాష్ రోడ్డులోని మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు చేరుకుని.. పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేకుండా.. అందుకు భిన్నంగా కేంద్రానికి దాసోహమైందన్నారు. ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్న గళాలను అణదొక్కేందుకు చూస్తోందన్నారు. రాష్ట్రానికి హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయన్నారు. తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయఽని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షులు మాలగుండ్ల శంకరనారాయణ మాట్లాడుతూ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటు వేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ..ప్రస్తుతం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, యువత వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఓటు వేసి ప్రభుత్వానికి చెంపపెట్టు వంటి తీర్పు ఇవ్వాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ యువతకు అన్యాయం చేసిన చంద్రబాబుకు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా తమ వ్యతిరేకతను తెలియజేయాలన్నారు. రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్‌ను ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేసి బుద్ధి చెప్పాలన్నారు. కదిరి సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని విస్మరించిన టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీమ్ అహమ్మద్ మాట్లాడుతూ మైనార్టీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి చూపలేదన్నారు. మాజీ మేయర్ రాగేపరశురాం మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, మడకశిర సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, చవ్వా రాజేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎల్ఎం మోహన్‌రెడ్డి, బుర్రా సురేష్‌గౌడ్, గౌస్‌బేగ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు, కదిరి నియోజకవర్గ నాయకుడు వజ్ర భాస్కర్‌రెడ్డి, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, కార్పొరేటర్ గంగన హిమబిందు, విద్యార్థి విభాగం నాయకులు లింగారెడ్డి, నరేంద్రరెడ్డి, బండి పరశురాం తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు – వెన్నపూస గోపాల్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. హామీలను అమలు చేయకుండా దగా చేసింది. ముఖ్యంగా యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పించలేదు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. కేవలం ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తోంది. కేంద్రం వద్ద సాగిలబడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు రైల్వే జోన్ రాకుండా చేసింది. మహిళా సాధికార సదస్సు నిర్వహించినా.. మహిళా రిజర్వేషన్, హింసపై డిక్లరేషన్ ఇవ్వలేదు. రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకోవడమే ధ్యేయంగా పని చేస్తోంది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, యువత నాకు ఓటు వేసి ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి. -
15న ‘వెన్నపూస’ నామినేషన్
అనంతపురం : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి ఈనెల 15న నామినేషన్ దాఖలు చేస్తారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుఽడు శంకరనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరతారని పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ఓటరు నమోదుకు మరో అవకాశం
అనంతపురం ఎడ్యుకేషన్ : పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 13 వరకు నమోదు చేసుకోవచ్చన్నారు. ఇప్పటిదాకా నమోదు చేసుకోని పట్టభద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
పోరాటయోధుడు గోపాల్‌రెడ్డి
–వెన్నపూస గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం –పట్టభద్రులు, వైఎస్సార్సీపీ శ్రేణులకు జిల్లా నేతల పిలుపు –కదిరి నుంచి ‘ఎన్నికల శంఖారావం’ కదిరి : ‘పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి మంచి పోరాట యోధుడు. ఆయనకు నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సమస్యలపై బాగా అవగాహన ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకుంటే చంద్రబాబు మెడలు వంచి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఆయన్ను శాసనమండలికి పంపేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాల’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లాపై ఉన్న అభిమానంతో ‘వెన్నపూస’ను అభ్యర్థిగా ప్రకటించారని, అందుకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్‌కు కానుకగా ఇద్దామని అన్నారు. బుధవారం వారు ఎమ్మెల్సీ ఎన్నికల శంఖారావాన్ని కదిరి నుంచి పూరించారు. ఈ సందర్భంగా స్థానిక కృష్ణా çఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు, నిరుద్యోగులకు ఎన్నో వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పటి దాకా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. పట్టభద్రులైన నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగమిస్తామని చెప్పారని, అలా ఇవ్వలేని పక్షంలో నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగభృతి ఇస్తామన్నారని తెలిపారు. వీటిని ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబును గట్టిగా ప్రశ్నించేందుకు వెన్నపూస గోపాల్‌రెడ్డి లాంటి సమర్థుడు మనకు కావాలని పేర్కొన్నారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసింది. చంద్రబాబు మాత్రం హోదా రాకుండా సైంధవుడిలా అడ్డపడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారు. ఆయనకు దిమ్మ తిరిగేలా ప్రజల తీర్పు మారదని తెలియజెప్పేందుకు గోపాల్‌రెడ్డిని గెలిపించండి’ అని పార్టీ శ్రేణులు, పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయులను కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నదీం, మాజీ మేయర్ రాగే పరశురాం, జెడ్పీ ఫ్లోర్ లీడర్ రవీంద్రారెడ్డి, నాయకులు బాలకృష్ణారెడ్డి, కదిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ కన్వీనర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, నిరుద్యోగులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్లకు ‘వెన్నపూస’ మద్దతు
అనంతపురం రూరల్ : డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి మద్దతు తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న శిబిరాన్ని శనివారం గోపాల్‌రెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ అబద్ధాల బాబు పాలనకు కలిసికట్టుగా చమరగీతం పాడుదామని పిలుపు నిచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంట్రాక్టు అధ్యాపకులు రామాంజనేయులు, అన్వర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలపై సర్కారు నిర్లక్ష్యం
∙ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అనంతపురం రూరల్: కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వ కళాశాల విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. అధ్యాపకుల సమ్మెకు శనివారం ఆయన మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరుబాట సాగిద్దామని పిలుపు నిచ్చారు. 15ఏళ్లుగా తక్కువ వేతనాలకే పనిచేస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కాంట్రాక్టు అధ్యాపకులు చేసిన కృషి మరువలేనిదన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. సుప్రీం కోర్డు సైతం రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిందన్నారు. అయినా న్యాయస్థానాల ఆదేశాలను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అధ్యాపకుల పోస్టులను క్రమబద్డీకరించాలన్నారు. సమ్మెకు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు ప్రటించారు. కొర్రపాడు హూస్సేన్ పీరా, కాంట్రాక్టు అధ్యాపకులు యర్రెప్ప, హనుమంతరెడ్డి, ప్రభాకర్, సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
‘హోదా’తోనే అభివృద్ధి
హిందూపురం అర్బన్ : ప్రత్యేక హోదా వస్తే అన్ని రకాల రాయితీల లభ్యతతో రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని వైఎస్సార్సీపీ బలపరచిన ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం హిందూçపురం విచ్చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్ హాలిడే, పన్నుల రాయితీలు, నిరుద్యోగులకు ఉపాధి, రాజధాని నిర్మాణానికి రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం లభిస్తుందన్నది చంద్రబాబు గ్రహించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక దోచుకో.. దాచుకో అన్న చందంగా అధికార పార్టీ నేతలు తయారయ్యారని ఎద్దేవా చేశారు. నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. జిల్లా నాయకులు మీసాల రంగన్న, అడ్వకేట్ నాగమల్లేశ్వరరెడ్డి, రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహెమన్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ శివ, కౌన్సిలర్ ఆసీఫ్‌వుల్లా, రజనీ, నాయకులు రియాజ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోపాల్‌రెడ్డి
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలోకి.. అనంతపురం: పశ్చిమ రాయలసీమ (అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలు) పట్టభద్రుల నియోజకవర్గానికి 2017లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెన్నపూస గోపాల్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం గురువారం అధికారికంగా ప్రకటించింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన వెన్నపూస గోపాల్‌రెడ్డి 1975-78 మధ్య కాలంలో సైన్యంలో పని చేశారు. ఆ తర్వాత సహకార శాఖలో జూనియర్ ఇన్స్పెక్టర్గా చేరారు. 17 ఏళ్లపాటు జిల్లా ఎన్జీఓ సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం ఉమ్మడి రాష్ట్ర ఎన్జీఓ మాజీ అధ్యక్షుడిగా, జేఏసీ చైర్మన్‌గా, ఆలిండియా అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా తొమ్మిదిన్నరేళ్లు పని చేశారు. 2013 జూన్ 30న ఉద్యోగ విరమణ చేశారు.