‘హోదా’తోనే అభివృద్ధి | mlc candidate in hindupuram | Sakshi
Sakshi News home page

‘హోదా’తోనే అభివృద్ధి

Published Wed, Nov 23 2016 11:20 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

‘హోదా’తోనే అభివృద్ధి - Sakshi

‘హోదా’తోనే అభివృద్ధి

హిందూపురం అర్బన్‌ : ప్రత్యేక హోదా వస్తే అన్ని రకాల రాయితీల లభ్యతతో రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని వైఎస్సార్‌సీపీ బలపరచిన ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం హిందూçపురం విచ్చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా  విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు  ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. 

ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్‌ హాలిడే,  పన్నుల రాయితీలు, నిరుద్యోగులకు ఉపాధి,  రాజధాని నిర్మాణానికి రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం లభిస్తుందన్నది చంద్రబాబు గ్రహించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక దోచుకో.. దాచుకో అన్న చందంగా అధికార పార్టీ నేతలు తయారయ్యారని ఎద్దేవా చేశారు.   నవీన్‌నిశ్చల్‌ మాట్లాడుతూ  ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.   జిల్లా నాయకులు మీసాల రంగన్న, అడ్వకేట్‌ నాగమల్లేశ్వరరెడ్డి, రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహెమన్, కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ శివ, కౌన్సిలర్‌ ఆసీఫ్‌వుల్లా, రజనీ, నాయకులు రియాజ్, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement