ఎస్పీని కలిసిన ఎమ్మెల్సీ వెన్నపూస | mlc vennapusa met sp rajasekharbabu | Sakshi
Sakshi News home page

ఎస్పీని కలిసిన ఎమ్మెల్సీ వెన్నపూస

Published Sat, Apr 8 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

ఎస్పీని కలిసిన ఎమ్మెల్సీ వెన్నపూస

ఎస్పీని కలిసిన ఎమ్మెల్సీ వెన్నపూస

అనంతపురం : పట్టభధ్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి శనివారం ఎస్పీ రాజశేఖర్‌బాబును క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు, కౌంటింగ్‌ ప్రశాంతంగా నిర్వహించారంటూ ఎస్పీని అభినందించారు. అనంతరం స్థానిక కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాలలోని పదోతరగతి మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించారు. ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎన్టీఓ సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పీఎస్‌ ఓబుళరావు, వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, టీచర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డి, రిటైర్డ్‌ లెక్చరర్ల సంఘం నాయకులు జె.శ్రీరాములు, జి.కొండారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement