rajasekharbabu
-
‘అనంత’ ఎస్పీగా అశోక్‌కుమార్
– రాజశేఖరబాబు చిత్తూరు ఎస్పీగా బదిలీ – గతంలో జిల్లాలో డీఎస్పీగా పనిచేసిన అశోక్‌కుమార్ (సాక్షిప్రతినిధి, అనంతపురం) : అనంతపురం నూతన ఎస్పీగా జీవీజీ అశోక్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఎస్పీ రాజశేఖర్‌బాబును చిత్తూరు ఎస్పీగా బదిలీ చేశారు. గ్రూపు–1కు చెందిన అశోక్‌కుమార్ గతంలో అనంతపురం డీఎస్పీగా పనిచేశారు. మూడేళ్లు పాటు ఇక్కడ పనిచేశారు. ఆ తర్వాత ఏఎస్పీగా పదోన్నతిపై గుంటూరు జిల్లా గురజాల ఓస్డీగా వెళ్లారు. ఆపై హైదరాబాద్ ఇంటెలిజెన్స్‌కు బదిలీ అయ్యారు. 2004 తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పీఎస్ఓ (పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్)గా పనిచేశారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ డీసీపీగా పనిచేసి అక్కడి నుంచి తిరుపతి విజిలెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఇక్కడ కూడా సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆపై కడప ఎస్పీగా పనిచేశారు. తర్వాత విజయవాడ డీసీపీగా వెళ్లారు. తాజాగా అనంతపురం ఎస్పీగా నియమితులయ్యారు. అశోక్‌కుమార్ విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరుంది. అనంతపురంలో డీఎస్పీగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం, కడప ఎస్పీగా పనిచేయడంతో రాయలసీమలోని శాంతిభద్రతలపై స్పష్టమైన అవగాహన ఉంది. పక్షపాత పాలన ఎస్పీ రాజశేఖరబాబు 2014 జూలై 22న బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడేళ్లపాటు పనిచేసిన ఈయన మొదట్లో నిక్కచ్చిగానే వ్యవహరించారు. ఆపై పట్టుసడలించారు. దీంతో పోలీసుశాఖలో క్రమశిక్షణ గాడితప్పింది. ఎవరికివారు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తించారు. దీంతోపాటు అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీలపై పక్షపాత ధోరణితో వ్యవహరించారని, అధికారపార్టీకే మద్దతుగా నిలిచారనే విమర్శలు రాజశేఖరబాబుపై ఉన్నాయి. దీనికి తోడు ఓ ‘మిడిల్బాస్’ తప్పిదాలు చేస్తున్నారని, నిత్యం పంచాయితీలు, సెటిల్మెంట్లు చేస్తున్నారని తెలిసినా, లిఖిత పూర్వకంగా పలువురు ఫిర్యాదు చేసినా అదుపు చేయకుండా వెనుకేసుకొచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాజశేఖరబాబు ప్రవేశపెట్టిన ‘ఒకదొంగ– ఒక పోలీసు’ పూర్తి వైఫల్యం చెందింది. పోలీసు సంక్షేమం కోసం రాజశేఖరబాబు కృషి చేశారు. -
రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయం
అనంతపురం సెంట్రల్ : రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా పని చేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్హాల్లో రహదారుల భద్రత అనే అంశంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబుతో కలిసి డీఐజీ ప్రభాకర్‌రావు మాట్లాడారు. అమరావతిలో హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అన్ని జిల్లాల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలో గత మూడేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై విశ్లేషించినట్లు తెలిపారు. అన్ని జిల్లాల కంటే అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదాలు తగ్గించడంపై ప్రశంసలు వచ్చాయన్నారు. అయితే మరింత ప్రణాళికాబద్ధంగా పనిచేసి రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతినెలా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రోడ్డు భద్రతపై సమావేశం జరుగుతుందన్నారు. పోలీసుశాఖతో పాటు ఇతర శాఖలు కూడా పాల్గొంటాయన్నారు. ప్రభుత్వ అనుబంధ శాఖలను సమన్వయం చేసుకొని రోడ్డు ప్రమాదాలు నివారించడంపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో అన్ని రహదారుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు తరుచూ వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు. తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ధరించేలా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ఓవర్‌లోడ్ వెల్లే వాహనాలను, రాంగ్ డైరెక్షన్లో వచ్చే వాహనాలు, ఇసుక మాఫియాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని హెచ్చరించారు. ప్రతి రోడ్డు ప్రమాదాన్ని జియోట్యాగింగ్ చేయాలని, సీపీఓ సేవలు వినియోగించుకోవాలని, డేంజర్ జోన్స్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
ఎస్పీని కలిసిన ఎమ్మెల్సీ వెన్నపూస
అనంతపురం : పట్టభధ్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి శనివారం ఎస్పీ రాజశేఖర్‌బాబును క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు, కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించారంటూ ఎస్పీని అభినందించారు. అనంతరం స్థానిక కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలోని పదోతరగతి మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించారు. ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎన్టీఓ సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పీఎస్ ఓబుళరావు, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డి, రిటైర్డ్ లెక్చరర్ల సంఘం నాయకులు జె.శ్రీరాములు, జి.కొండారెడ్డి తదితరులు ఉన్నారు. -
నేరాల నియంత్రణపై దృష్టి
అనంతపురం సెంట్రల్ : నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు ఆదేశించారు. మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌హాలులో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో గత నెలలో జరిగిన నేరాలు, ఘటనలతో పాటు పాత అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను స్టేషన్ వారిగా సమీక్షించారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వహించిన సీఐ, ఎస్ఐలకు చార్జిమెమో జారీ చేస్తున్నట్లు హెచ్చరించారు. గ్రేవ్ కేసుల్లో సీఐలు తప్పనిసరిగా సంఘటనా స్థలానికి వెళ్ళాలని ఆదేశించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నివేదికలు తెప్పించడంలో జాప్యం చేయరాదని, ఇదే సమయంలో చార్జీషీటు వేయడంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. నగరంలో ఉన్న పోలీస్ సబ్ కంట్రోల్‌ను తిరిగి ప్రారంభించాలని తెలిపారు. సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేసి శాంతిభద్రతలను పరిరక్షించాలని తెలిపారు. -
అనంతలో మావోల ప్రభావం లేదు
పుట్టపర్తి టౌన్ : జిల్లాలో మావోలు పూర్తిగా కనుమరుగయ్యారని, మావోలతో కలసి పనిచేసేందుకు కూడా ఇక్కడి వారు సుముఖంగా లేరని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన డీఎస్పీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు చెప్పారు.ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇటీవల ఆంధ్రా ఒడిశా సరిహద్దులో పెద్ద ఎత్తున మావోలను ఎన్కౌంటర్ చేయడం జరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న హత్యలలో వివాహేతర సంబంధాలే కారణాలుగా ఉన్నాయన్నారు. కొన్ని చోట్ల మాత్రమే ఫ్యాక్షన్ వల్ల చోటు చేసుకుంటున్నాయన్నారు. మొబైల్ గ్యాంబ్లింగ్, మట్కా, గుట్కా తయారీ తదితర అసాంఘిక కార్యకలాపాలను అణిచివేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేదరికం వల్ల మహిళల అత్మహత్యలు పెరిగాయని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. పేదరికం,అవసరాలను ఆసరాగా చేసుకుని మహిళలను విదేశాలకు, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొందరకు పాల్పడుతున్నారని, వారి ఆటకట్టించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు 140 మంది మహిళలు ఇరత ప్రాంతాల కు తరలివెళ్లినట్లు సమాచారం ఉందని, వారిని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందంజలో ఉందన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ విధానాన్ని కొనసాగిస్తూ సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలను జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి పాల్గొన్నారు. -
సోషల్ మీడియా స్నేహితులతో జాగ్రత్త
అనంతపురం కల్చరల్ : సామాజిక మాద్యమాల ద్వారా స్నేహితులుగా మారి ప్రేమ పేరుతో వంచించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు అమ్మాయిలకు సూచించారు. ఐద్వా, ఎస్ఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక లలితకళాపరిషత్తులో ‘అమ్మాయిలు.. జర జాగ్రత్త’ అన్న అంశంపై ఆలోచనాత్మక సదస్సు జరిగింది. జిల్లా ఎస్పీ రాజశేఖరబాబుతో పాటు ప్రముఖ సినీ దర్శకుడు బాబ్జి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చదువు కోసం నగరానికొచ్చే యువతులు అమాయకంగా అబ్బాయిల చేతిలో మోసపోతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భ్రమలు కల్పించే రంగుల ప్రపంచానికి లోను కాకుండా చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. ఆడపిల్లలున్న హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకుంటోందన్నారు. ఐద్వా ఇటువంటి చక్కటి కార్యక్రమాల ద్వారా అమ్మాయిలకు, మహిళలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. ‘అబ్బాయిలు.. మా జోలికొస్తే జర జాగ్రత్త’ అంటూ హెచ్చరించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రేమను వస్తువుగా పెట్టి తీస్తున్న సినిమాలు సమాజాన్ని పెడదోవపట్టకుండా ఉండాలని అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాల పట్ల అçప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా కాలక్షేపానికి లేదా విజ్ఞాన విషయాల సేకరణకు ఉపయోగపడాలే తప్ప యువతులను మోసం చేసే ప్రత్యామ్నాయంగా మారొద్దని సూచించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కసాపురం ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ఐద్వా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, డా.ప్రసూన, డా.ప్రగతి, వెంకటలక్ష్మమ్మ, విజయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ నగర కార్యదర్శి సూర్యచంద్ర పాల్గొన్నారు. -
తిరుపతి ఎస్పీపై పరువు నష్టం కేసు వేస్తా
చిత్తూరు(ఎడ్యుకేషన్): తన పరువుకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరించిన తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబుపై పరువు నష్టం దావా వేయనున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. శాసనసభ స్పీకర్, మానవహక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం ఆయన చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించేందుకు ఇటీవల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశానన్నారు. దీనికి పోలీసులు రాలేదని, ఎందుకు రాలేదో కనుక్కొనేందుకు తిరుపతి అర్బన్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. ఎస్పీ పోలీసులు రారని చెప్పారని, అలా రాకుండా ఉండేందుకు నిబంధనలు ఏమైనా ఉంటే చెప్పండి, ఫాలో అవుతామని తాను చెప్పానని, దీనికిగాను లేఖ ఇస్తానని, దాని ద్వారా తనకు సమాధానం ఇవ్వాలని కోరానని తెలిపా రు. ఇది తమ ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అని తెలిపారు. అరుుతే శుక్రవారం ఓ దినపత్రికలో ఎస్పీకి తాను ఫోన్ చేస్తే ఆయన ఆగ్రహించినట్లు, తనకు వార్నింగ్ ఇచ్చినట్లు కథనం వచ్చిందని తెలిపారు. ఆ సంభాషణ గురించి తమ ఇద్దరికే తెలుసని, ఈ విషయాన్ని ఎస్పీనే పత్రికలో రాయించారనే అనుమానం కలుగుతోందని చెప్పా రు. ఒక ఐపీఎస్ అధికారికి పత్రికల్లో రాయించాల్సిన అవసరం రావడం బా ధాకరమన్నారు. ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేయకపోయినా, ఆగ్రహిం చినట్లు రాశారని, తాను చట్టసభలకు ప్రాతి నిథ్యం వహించే ఎమ్మెల్యేనని, తనను ఎందుకు ఎీస్పీ హెచ్చరిస్తారని ఆ యన ప్రశ్నించారు. సత్యదూరమైన వా ర్తలు రాసిన ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఈ మొత్తం సంఘటనకు ఎస్పీనే బాధ్యత వహించాలన్నారు. వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా? పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడితే లేనిపోని కేసులు పెడతారని చెప్తుంటారని, ఎస్పీపై పరువు నష్టం దావా వేస్తే ఇబ్బందులకు గురిచేస్తారని చెప్పారని భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఏమేం చేస్తారో చేయాలని, తాను తప్పుడు దారిలో వెళ్లే వ్యక్తిని కాదని, నీతి, నిజాయితీతో ఈ స్థాయికి వచ్చానని వివరించారు. తనపై ఎన్నో తప్పుడు కేసులు పెట్టించిన గల్లా అరుణకుమారిని చంద్రగిరి ప్రజలు అంగీకరించలేదన్నారు. టీడీపీ నేతలు, పోలీసులు కలిసి ఏం చేసినా, తప్పుడు కేసులు పెట్టినా తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ప్రకటించారు. ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యేగా తాను పిలిస్తే రాని పోలీసులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పిలిస్తే వెళ్లరా అని ప్రశ్నించారు. నిబంధనలు అందరికీ ఒకే రకంగా ఉంటాయనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు.