నేరాల నియంత్రణపై దృష్టి | sp statement on crime | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణపై దృష్టి

Published Tue, Nov 15 2016 11:09 PM | Last Updated on Sat, Aug 11 2018 8:54 PM

నేరాల నియంత్రణపై దృష్టి - Sakshi

నేరాల నియంత్రణపై దృష్టి

అనంతపురం సెంట్రల్‌ : నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు ఆదేశించారు. మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌హాలులో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో గత నెలలో జరిగిన నేరాలు, ఘటనలతో పాటు పాత అండర్‌ ఇన్వెస్టిగేషన్‌ కేసులను, గ్రేవ్, నాన్‌ గ్రేవ్‌ కేసులను స్టేషన్‌ వారిగా సమీక్షించారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వహించిన సీఐ, ఎస్‌ఐలకు చార్జిమెమో జారీ చేస్తున్నట్లు హెచ్చరించారు.

గ్రేవ్‌ కేసుల్లో సీఐలు తప్పనిసరిగా సంఘటనా స్థలానికి వెళ్ళాలని ఆదేశించారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నుంచి నివేదికలు తెప్పించడంలో జాప్యం చేయరాదని, ఇదే సమయంలో చార్జీషీటు వేయడంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.  నగరంలో ఉన్న పోలీస్‌ సబ్‌ కంట్రోల్‌ను తిరిగి ప్రారంభించాలని తెలిపారు. సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేసి శాంతిభద్రతలను పరిరక్షించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement