sp statement
-
నేరాల నియంత్రణపై దృష్టి
అనంతపురం సెంట్రల్ : నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు ఆదేశించారు. మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌హాలులో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో గత నెలలో జరిగిన నేరాలు, ఘటనలతో పాటు పాత అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను స్టేషన్ వారిగా సమీక్షించారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వహించిన సీఐ, ఎస్ఐలకు చార్జిమెమో జారీ చేస్తున్నట్లు హెచ్చరించారు. గ్రేవ్ కేసుల్లో సీఐలు తప్పనిసరిగా సంఘటనా స్థలానికి వెళ్ళాలని ఆదేశించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నివేదికలు తెప్పించడంలో జాప్యం చేయరాదని, ఇదే సమయంలో చార్జీషీటు వేయడంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. నగరంలో ఉన్న పోలీస్ సబ్ కంట్రోల్‌ను తిరిగి ప్రారంభించాలని తెలిపారు. సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేసి శాంతిభద్రతలను పరిరక్షించాలని తెలిపారు. -
నిరంతరం అప్రమత్తం
అనంతపురం సెంట్రల్ : ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఎన్కౌంటర్ నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని క్విక్ రెస్పాన్స్ టీం, అంగరక్షకులను ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదేశించారు. బుధవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో వీరికి ఎస్ఐబీ, గ్రేహాండ్స్ విభాగాల్లో అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీని సమూలంగా తుడిచిపెట్టిన ఘనత రాష్ట్ర పోలీసులకు దక్కుతుందన్నారు. ఇటీవల ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనాయకులు మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అందాయన్నారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు పటిష్ట భద్రత కల్పించి వారికి రక్షణ కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీటీసీ డీఎస్పీ ఖాసీంసాబ్, ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, స్పెషల్‌బ్రాంచ్ సీఐలు రాజశేఖర్, యల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. నిఘా కట్టుదిట్టం అంతకుముందు ఎస్పీ రాజశేఖరబాబు మడకశిర, హిందూపురం సర్కిల్ స్టేషన్లను తనిఖీ చేశారు. అనంతరం ఆయాచోట్ల విలేకరులతో మాట్లాడారు. నేరాల నివారణకు నిఘాను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 1000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నామన్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో పలు చోట్ల మట్కా ఇతర అసాంఘిక కార్యకలాపాలను నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని 600 పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. -
ఫ్యాక్షన్, రౌడీయిజంపై ఉక్కుపాదం
ఏ చిన్న ఘటన జరిగినా సహించేది లేదు పోలీసులకు డీఐజీ, ఎస్పీ హెచ్చరిక అనంతపురం సెంట్రల్: జిల్లాలో ఫ్యాక్షన్, రౌడీయిజాన్ని పూర్తి స్థాయిలో అణచివేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు ఆదేశించారు. అనంతపపురం రుద్రంపేటలో ఇటీవల జరిగిన జంట హత్యల నేపథ్యంలో ఎస్పీ రాజశేఖరబాబుతో కలసి స్థానిక పోలీస్‌కాన్ఫరెన్స్ హాల్లో అనంతపురం సబ్‌డివిజన్ పోలీస్ అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఏ చిన్న ఘటన జరిగినా సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సబ్ డివిజన్లోని ఫ్యాక్షనిస్టుల గురించి ఆరా తీశారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఫ్యాక్షనిస్టులు, వారి అనుచరులపై నిత్యం నిఘా ఉంచాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బందిని తరచూ అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారాన్ని సేకరించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫ్యాక్షన్ ప్రాంతాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ నిబద్ధతతో పని చేయాలని చెప్పారు. సమాజంలో అరాచకాలు సృష్టించే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రధానంగా రౌడీయిజం జిల్లాలో ఎక్కడా కన్పించరాదన్నారు. ప్రశాంతతకు భంగం కలిగించే రౌడీషీటర్లను స్టేషన్లకు పలిపించి తీవ్రంగా హెచ్చరించాలని సూచించారు. భూ కబ్జాదారులపై నిఘా వేయాలని, బైండోవర్లు, కౌన్సెలింగ్‌లు చేపట్టాలన్నారు. రక్షక్, బ్లూకోట్స్ సహా టెక్నాలజీని ఉపయోగించి కేసుల్లో పురోగతి సాధించాలని సూచించారు. అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ, స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ గంగయ్య, డివిజన్ పరిధిలోని సీఐలు పాల్గొన్నారు.