తిరుపతి ఎస్పీపై పరువు నష్టం కేసు వేస్తా
చిత్తూరు(ఎడ్యుకేషన్): తన పరువుకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరించిన తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబుపై పరువు నష్టం దావా వేయనున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. శాసనసభ స్పీకర్, మానవహక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం ఆయన చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించేందుకు ఇటీవల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశానన్నారు. దీనికి పోలీసులు రాలేదని, ఎందుకు రాలేదో కనుక్కొనేందుకు తిరుపతి అర్బన్ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడానని చెప్పారు. ఎస్పీ పోలీసులు రారని చెప్పారని, అలా రాకుండా ఉండేందుకు నిబంధనలు ఏమైనా ఉంటే చెప్పండి,
ఫాలో అవుతామని తాను చెప్పానని, దీనికిగాను లేఖ ఇస్తానని, దాని ద్వారా తనకు సమాధానం ఇవ్వాలని కోరానని తెలిపా రు. ఇది తమ ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అని తెలిపారు. అరుుతే శుక్రవారం ఓ దినపత్రికలో ఎస్పీకి తాను ఫోన్ చేస్తే ఆయన ఆగ్రహించినట్లు, తనకు వార్నింగ్ ఇచ్చినట్లు కథనం వచ్చిందని తెలిపారు. ఆ సంభాషణ గురించి తమ ఇద్దరికే తెలుసని, ఈ విషయాన్ని ఎస్పీనే పత్రికలో రాయించారనే అనుమానం కలుగుతోందని చెప్పా రు. ఒక ఐపీఎస్ అధికారికి పత్రికల్లో రాయించాల్సిన అవసరం రావడం బా ధాకరమన్నారు. ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేయకపోయినా, ఆగ్రహిం చినట్లు రాశారని, తాను చట్టసభలకు ప్రాతి నిథ్యం వహించే ఎమ్మెల్యేనని, తనను ఎందుకు ఎీస్పీ హెచ్చరిస్తారని ఆ యన ప్రశ్నించారు. సత్యదూరమైన వా ర్తలు రాసిన ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఈ మొత్తం సంఘటనకు ఎస్పీనే బాధ్యత వహించాలన్నారు.
వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా?
పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడితే లేనిపోని కేసులు పెడతారని చెప్తుంటారని, ఎస్పీపై పరువు నష్టం దావా వేస్తే ఇబ్బందులకు గురిచేస్తారని చెప్పారని భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఏమేం చేస్తారో చేయాలని, తాను తప్పుడు దారిలో వెళ్లే వ్యక్తిని కాదని, నీతి, నిజాయితీతో ఈ స్థాయికి వచ్చానని వివరించారు. తనపై ఎన్నో తప్పుడు కేసులు పెట్టించిన గల్లా అరుణకుమారిని చంద్రగిరి ప్రజలు అంగీకరించలేదన్నారు. టీడీపీ నేతలు, పోలీసులు కలిసి ఏం చేసినా, తప్పుడు కేసులు పెట్టినా తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ప్రకటించారు. ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యేగా తాను పిలిస్తే రాని పోలీసులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పిలిస్తే వెళ్లరా అని ప్రశ్నించారు. నిబంధనలు అందరికీ ఒకే రకంగా ఉంటాయనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు.