
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) గురించి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. టీటీడీ పరువుకు భంగం కలించేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతిపై రూ. 100 కోట్లు పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. తిరుపతిని సందర్శించిన సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘తిరుమల స్వామి వారి ఆలయం గురించి ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు తమను కాపాడతారన్న భావనలో ఆంధ్రజ్యోతి ఉంది.
ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతిది ఒక మాట.. కానీ, బాబు ఓడిన తర్వాత ఆ మాట మార్చింది. చంద్రబాబుకు ప్రజల మద్దతు లేదు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదు. కుట్రపూరితంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లు పరువునష్టం దావా వేశా. నా జీవితంలో ఎప్పుడూ పరువు నష్టం దావా కేసు ఓడిపోలేదు’’ అని ఆంధ్రజ్యోతి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరును విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment