సాక్షి, అనంతపురం : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం అందజేసేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ తనయుడు వెన్నపూస రవీంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగి ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి సహా పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఇంకుడు గుంతల పనుల్లో 548 కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు.
మరోవైపు చంద్రబాబు బస చేసిన ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద వామపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. 3 గంటలుగా వేచి ఉన్నా చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటంపై సీపీఐ, సీపీఎం నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇంటి వద్ద ఉద్రిక్తత
Published Sat, Nov 24 2018 10:45 AM | Last Updated on Sat, Nov 24 2018 12:01 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment