వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోపాల్‌రెడ్డి | ysrcp MLC candidate as Vennapusa gopalreddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోపాల్‌రెడ్డి

Published Fri, Oct 7 2016 2:19 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోపాల్‌రెడ్డి - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోపాల్‌రెడ్డి

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలోకి..
అనంతపురం: పశ్చిమ రాయలసీమ (అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలు) పట్టభద్రుల నియోజకవర్గానికి 2017లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెన్నపూస గోపాల్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం గురువారం అధికారికంగా ప్రకటించింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన వెన్నపూస గోపాల్‌రెడ్డి 1975-78 మధ్య కాలంలో సైన్యంలో పని చేశారు.

ఆ తర్వాత సహకార శాఖలో జూనియర్ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. 17 ఏళ్లపాటు  జిల్లా ఎన్జీఓ సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం ఉమ్మడి రాష్ట్ర ఎన్జీఓ మాజీ అధ్యక్షుడిగా, జేఏసీ చైర్మన్‌గా, ఆలిండియా అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా తొమ్మిదిన్నరేళ్లు పని చేశారు. 2013 జూన్ 30న ఉద్యోగ విరమణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement