కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు ‘వెన్నపూస’ మద్దతు | vennapusa gopalreddy support to contract lecturers | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు ‘వెన్నపూస’ మద్దతు

Published Sat, Dec 31 2016 10:56 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

vennapusa gopalreddy support to contract lecturers

అనంతపురం రూరల్‌ : డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు  పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి  మద్దతు తెలిపారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్న శిబిరాన్ని శనివారం గోపాల్‌రెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ  అబద్ధాల బాబు పాలనకు కలిసికట్టుగా చమరగీతం పాడుదామని పిలుపు నిచ్చారు.  కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.    కాంట్రాక్టు అధ్యాపకులు రామాంజనేయులు, అన్వర్, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement