న్యాయం జరిగే వరకూ పోరాటం
న్యాయం జరిగే వరకూ పోరాటం
Published Fri, Dec 9 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM
కాంట్రాక్టు అధ్యాపకులకు వైఎస్సార్ సీపీ నేతల సంఘీభావం
గుంటూరు ఎడ్యుకేషన్: శ్రమకు తగిన విధంగా వేతనాలు చెల్లింపు కోరుతూ నిరవధిక సమ్మెలోకి వెళ్లిన ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లోని కాంట్రాక్టు అధ్యాపకులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు సంఘీభావం పలికారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా శిబిరాన్ని శుక్రవారం సందర్శించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను ఆలకించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని ఎన్నికల్లో బూటకపు హామీలు గుప్పించిన టీడీపీ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యాపకులకు అండగా ఉండి న్యాయం జరిగే వరకూ ప్రభుత్వంతో పోరాడతామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, రావి వెంకటరమణ, పెదకూరపాడు సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడు ఉన్నారు.
Advertisement